
మన జీవిత కాల లక్ష్యాలను, సుదూర అవసరాలను తీర్చుకోవడానికి ఆర్థిక ప్రణాళిక ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ఆర్థిక ప్రయాణం సజావుగా సాగితేనే జీవితం ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అందుకే చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇక దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. అలా చేయగలిగితే విజయం సులభమే.
ప్రతి ఒక్కరికీ ఒక ఆర్థిక ప్రణాళిక ప్రత్యేకంగా ఉండాల్సిందే. అందరికీ ఒకే ఆర్థిక వ్యూహం సరికాదు. అందుకు మనం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. లేదా సరైన ఫైనాన్షియల్ ప్లానర్ ను ఆశ్రయించడం చాలా మేలు.
how to make a financial plan
జీతం/ఆదాయం, ఆస్తులు, అదనపు ఆదాయం, కుటుంబ అవసరాలు, ఖర్చులు, సమీప అవసరాలు, జీవిత కాల లక్ష్యాలు, మనకు ఉన్న ఆర్థిక అవగాహన ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆర్థిక ప్రణాళిక రచించాలి. కుటుంబ సభ్యులు, వృద్ధులు, పిల్లలు వారి వయసు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని ఆధారంగా చేసుకుని మనకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రణాళిక తయారు చేసుకోవాలి. అప్పడు దీనిని అమల్లో పెట్టాలి.
what are the parts in financial planning
ప్రణాళికలో చేర్చాల్సిన విషయాలు
అత్యవసర నిధి
నెలవారీ కనీస ఖర్చు
కుటుంబ అవసరాలు
ఆరోగ్యం, చదువు
సమీప లక్ష్యాలు
ఇన్సూరెన్స్
సేవింగ్స్
పెట్టుబడులు
ఈ విషయాలు తప్పకుండా ప్రణాళికలో ఉండాలి. ఆదాయాన్ని పై వాటిన్నిటికీ సర్దుబాటు చేసుకోవాలి. ఇంకా మిగిలి ఉంటే అప్పడు దాన్ని మన లగ్జరీల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ కేటాయింపులు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. వారి కుటుంబ పరిస్థితుల ఆధారంగా వీటిని సవరించుకోవాలి. ప్రణాళిక ను తప్పకుండా ఫాలో అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.