
మనలో చాలామంది డబ్బు గురించి చులకనగా మాట్లాడతారు. ఈకతో సమానం అని.. డబ్బు లేకపోయినా ఎలాగోలా బతికేయగలమని అంటుంటారు. అలా అనే వారు ఎవరూ సక్సెస్‌ఫుల్ పీపుల్ కాదు. ఎందుకంటే వారిలోని అసమర్థతే వారితో అలా మాట్లాడిస్తుంది. డబ్బును సంపాదించలేక, దానిని సరైన మార్గంలో వాడుకోలేని వారు మాత్రమే డబ్బును అవమానిస్తారు. ఎవరైతే డబ్బును గౌరవిస్తారో, లవ్ చేస్తారో వారే సంతోషాన్ని, సక్సెస్‌ను సొంతం చేసుకుంటారు.
what is the need of money
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ మహానుబావుడు అన్నాడట. ఇందులో వాస్తవం ఎంతో స్పృహలో ఉన్న ఏ వ్యక్తికైనా తెలుస్తుంది. మన దగ్గర డబ్బు ఉంటేనే అందరూ మనతో తిరుగుతారు. మన దగ్గర అవసరాల కోసం వస్తుంటారు. సంబంధాలు కలుపుకుంటారు. మన జాలి కోసం, మన ప్రేమ కోసం ఎదురుచూస్తుంటారు. మనల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు కూడా. కానీ ఒక వేళ మన దగ్గర డబ్బు లేదనుకోండి…. అప్పడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒప్పుకున్నా, లేకపోయినా ఇదే వాస్తవం. కానీ బయటకి మాత్రం డబ్బుదేముంది.. మనుషులు శాశ్వతం అని చిలక పలుకులు పలుకుతారు. వారంతా అబద్ధాల కోరులే.
why we have to respect money
మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ డబ్బే శాశ్వతం… మనుషులు కాదు. మన తాతలు తండ్రులు ఆస్తులు, కోట్ల రూపాయలు సంపాదించి వారసులకు అందిస్తున్నారు. వారు సంపాదించిన డబ్బు మన వరకూ ఉంటుంది తప్ప, వాళ్లు మాత్రం చనిపోతున్నారు. మనుషులు బతికినంత కాలం ఒక రకమైతే, చనిపోయాక వారి విలువ సంపాదించిన డబ్బుతోనో, ఆస్తితోనో పెరుగుతుంది. పేద తల్లిదండ్రులను వారి పిల్లలు కూడా సరిగా గుర్తించరు. మాకు ఏమీ ఇవ్వలేదంటూ జీవితకాలం తిడుతూనే ఉంటారు. డబ్బును సంపాదించిన వాడిని మోసగాడనో.. అక్రమార్జన అనో తెలిసీ తెలియక అనేయకండి. అలా అన్నారంటే అది మీలో అక్కసే అయి ఉంటుంది. మీరు సంపాదించలేకపోయారు కాబట్టి ఎదుటి వాడు సంపాదిస్తుంటే ఓర్వలేక అసూయతో వాళ్లపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని అర్థం.
ఇక్కడ జరుగుతుందేంటంటే డబ్బును ప్రేమించిన నాడే సంపాదన సాధ్యమవుతుంది. ధనాన్ని గౌరవించిన నాడే ధనమూ మనల్ని గౌరవించి మనతో ఉంటుంది. డబ్బును, డబ్బు సంపాదించేవాడిని అవమానించకండి. జస్ట్ లవ్ దెమ్.