మంచిగా డబ్బులు సంపాదించాలి.. మంచి పోర్ట్ ఫోలియో ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సరైన ప్రణాళిక, నిరంతర విశ్లేషణ, శ్రద్ధ అవసరం. ఒక ఫైనాన్షియల్ నిపుణుడిని సంప్రదించి, మీ పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించాలి. పెట్టుబడులను క్రమంగా సమీక్షించాలి. మార్కెట్ మార్పులను పరిశీలించాలి. అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవాలి. పెట్టుబడులకు ముందు సంసిద్ధత, ఆ తర్వాత సరైన పెట్టుబడుల ఎంపిక కూడా కీలకమే.
ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, సంపాదన మొదలుపెట్టే వారు సేవింగ్ చేయాలనుకుంటారు. అయితే అలా సేవింగ్ కి వెళ్లే ముందు కొన్ని పనులను తప్పనిసరిగా పూర్తిచేయాలి. మన పెట్టుబడుల లక్ష్యం నెరవేరాలంటే ఇవి పూర్తి చేసుకోవాల్సిందే. ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసేముందు ఒక ప్రణాళికను సిధ్ధం చేసుకోవాలి. అందుకు ముందే మనం ప్లానింగ్ వేసుకుని రడీగా ఉండాలి. ఆ తర్వాతే ఎందులో పెట్టాలి.. ఎక్కడ ఎంత కాలం ఉంచాలో నిర్ణయించాలి.
లక్ష్యాలను గుర్తించుకోవాలి
మనం పెట్టుబడులు ప్రారంభించేముందు మరో ముఖ్యమైన పని చేయాలి. ముందుగా మన లక్ష్యాలను గుర్తించి, ఆ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు భవిష్యత్తులో ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కవేసుకోవాలి. ఆ మొత్తాన్ని లెక్కవేసుకున్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత అందుకు ఉన్న సమయం, కావాల్సిన మొత్తాన్ని అనుసరించి సరైన పెట్టుబడి మార్గాలు, పథకాలను ఎంచుకోవాలి.
PLAN FOR EMERGENCY FUND
అత్యవసర నిధి
మన పెట్టుబడి ప్రయాణం సరైన పద్దతిలో వెళ్ళాలంటే మన ఆర్థిక ప్రణాళికలో కొంత డబ్బును అత్యవసర పరిస్థితుల కోసం ఉంచాలి. మనకి అనుకోని కారణాల వల్ల సంపాదన ఆగిపోతే ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్మెంట్ ఒక్కోసారి ఆలస్యం కావచ్చు. అలాంటి సమయాల్లోనూ ఈ డబ్బులు ఉపయోగపడతాయి. ఇందుకోసం సుమారు ఆరు నెలల పాటు మన జీవనానికి సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఎప్పుడైనా తీసుకోగలిగేలా దాచి పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవడం కొంచెం లాభదాయకం.
లెక్క ఉండాల్సిందే
ఖర్చులు ఎప్పుడూ ఆదాయానికి లోబడి స్థాయి మేరకు ఉండాలి. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండాలి. ముందుగా మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి. అయితే ఆదాయం ఖర్చులపై పూర్తి అవగాహన ఉండాలి. మనకొచ్చిన ఆదాయాన్ని ఒక పేపర్ మీద రాసుకుని ఖర్చులను కూడా నోట్ చేసుకోవాలి. దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఖర్చు చేసే విధానం పై మనకి అవగాహన వస్తుంది. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. అనవసరపు ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి వీలుంటుంది. ప్రతి ఒక్కరూ నెలవారి ఆదాయం వచ్చిన వెంటనే కొంత పొదుపు చేసి మిగిలినది ఖర్చులకు ఉపయోగించాలి.
NEVER GO FOR LOAN
అవసరమైతేనే అప్పు
మనం అనవసర ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు. విలాసాల కోసం, లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం లోన్‌లు తీసుకోకూడదు. ఆస్తి కొనడానికి అప్పు చేసినా పర్వాలేదు. అది కూడా మన దగ్గర మినిమమ్ అమౌంట్ ఉంటేనే.. లేకపోతే డెబిట్ ఎక్కువౌతుంది. మన సొంత ఇంటి కల కోసం గృహ రుణం తీసుకోవచ్చు. పైగా చాలా వరకు ఇతర రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మనం కారు కొనాలనుకున్నపుడు వీలైనంత డౌన్ పేమెంట్ చెల్లించి, తక్కువ కాలంలోనే రుణం క్లియర్ చేసుకోగలగాలి. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలు ఎక్కువ వడ్డీ విధిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండడం మంచిది.
ఇన్సూరెన్స్ మరవొద్దు
సంపాదించే ప్రతి ఒక్కరూ పెట్టుబడుల కంటే తగిన జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవాలి. మనతో పాటు మన కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా రక్షణ లేకపోతే దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కోసం చేసిన పొదుపు, పెట్టుబడులు వైద్య ఖర్చులకు సరిపోతుంది. మంచి కవరేజీ ఉన్న పాలసీలు తీసుకోవాలి. ఎంత ముందుగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. అందువల్ల బీమాతో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలి.
ఇవన్నీ పూర్తయిన తర్వాత మనం మానసికంగా, ఆర్థికంగా సిద్ధమయ్యాక అప్పడు మనం పెట్టుబడులకు వెళ్లాలి. మన భవిష్యత్తు అవసరాలు, ఖర్చలు, ఆదాయం వీటిని బట్టి దిగువ ఉన్న రకరకాల సాధనాల్లో
మన డబ్బులు పెట్టాలి. పెట్టుబడులు కొనసాగించాలి.
* స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
INVEST IN STOCK MARKET
– దీర్ఘకాలిక అభివృద్ధి చేయగల కంపెనీలను ఎంచుకోవాలి.
– ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి హై గ్రోత్ రంగాల్లో పెట్టుబడులు చేయడం లాభదాయకం.
– SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) విధానంలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.
* మ్యూచువల్ ఫండ్స్ Mutual Funds
– అధిక వృద్ధి గల ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి.
– బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల కొంతవరకు రిస్క్ తగ్గించుకోవచ్చు.
– నిపుణుల సలహాలతో ట్రేడింగ్ చేయడం మంచిది.
* రియల్ ఎస్టేట్ Real Estate
– పెరుగుతున్న నగరాల్లో ఆస్తులు కొనుగోలు చేయాలి.
– లాంగ్ టర్మ్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి.
* బంగారం, డిజిటల్ ఆస్తులు
Gold and Digital Assets
– బంగారం, గోల్డ్ ఈటీఎఫ్‌లు మంచి ఆదాయ మార్గాలు. రీట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి క్రమానుగతంగా లాభాలు పొందవచ్చు.
– క్రిప్టోకరెన్సీ లాంటి డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టొచ్చు.
* ఇతర పెట్టుబడి మార్గాలు Other Investment Options
– బాండ్‌లు, PPFలు (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) వంటి లాభదాయకమైన పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
– డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ పొందొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు Precautions to Take
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆర్థిక నిపుణుల సూచనలతో పెట్టుబడులు పెట్టడం ఈజీనే అయినా కొందరు ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అటువంటి వారు తిరిగి తమ పోర్ట్ఫోలియోను సవరించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక లక్ష్యాలు నెరవేరేలా పోర్ట్ ఫోలియో
ACHIEVING FINANCIAL GOALS EFFECTIVELY
మీ పోర్ట్‌ఫోలియోను ప్రయోజనకరంగా చేసుకునేందుకు పెట్టుబడులను ఒకసారి సమీక్షించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరే విధంగా వాటి పనితీరు ఉందో లేదో గమనించాలి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నవారు చెప్పిన ప్రకారం పెట్టుబడులు పెడుతుంటాం. అవి కొన్నిసార్లు పేలవమైన ప్రదర్శనను కనబరచవచ్చు. గతంలో మంచి లాభాలను తెచ్చిన ఫండ్లు ప్రస్తుతం నష్టాల్లో ఉండొచ్చు. పోర్ట్ఫోలియోను సమీక్షించుకోవడం ద్వారా మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను కొనసాగించవచ్చు.
లాభం లేని పెట్టుబడులను తొలగించండి
ELIMINATE UNPROFITABLE INVESTMENTS
పెట్టుబడుల పోర్ట్ఫోలియో ను సమీక్షిస్తే ఏ ఫండ్ వల్ల అయితే మీకు లాభం లేదో దానిని తొలగిస్తే లక్ష్యం నెరవేరుతుంది. 2-3 సంవత్సరాల నుంచి ఏ ఫండ్ల తీరు బాగాలేదో వాటిని తొలగించి ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు సమీక్ష చేస్తుండాలి. రిస్క్, మార్కెట్ ఒడుదొడుకలు, ఆర్థిక లక్ష్యాలు వంటివి దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను కొనసాగించాలి.
లక్ష్యాలకు అనుగుణంగా ఎంచుకోండి
ACCORDING TO GOALS
ప్రతిదానికి వేర్వేరు పెట్టుబడి విధానాలను ఎంచుకోవాలి. రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎక్కువగా లాభాలు ఇచ్చే ఈక్విటీ సంబంధిత ఫండ్లలో, రిస్క్ లేకుండా ఉండే స్వల్ప కాలిక లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేయాలి. పాత పద్ధతిలో ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్ పెట్టుబడులు కాకుండా ఈక్విటీలో పెట్టుబడులు ఎక్కువ రాబడిని ఇస్తాయి.
సమీక్షించుకోవడం మంచిది
IT IS GOOD TO REVIEW
తగిన పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం మంచిది. కనీసం సంవత్సరానికి ఒకసారైనా పెట్టుబడులను గమనించుకోవాలి. అప్పుడు మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడులు కొనసాగుతున్నాయా లేదా తెలుసుకోగలుగుతారు. బెంచ్‌మార్క్‌కి లేదా ఇతర ఫండ్లకు సమానంగా మీ ఫండ్లు పనిచేస్తున్నాయా లేదా చూడాలి.
ఆచితూచి అడుగేయాలి
పైన చెప్పిన అన్ని విధానాలు మీ పోర్ట్‌ఫోలియోను సవరించుకోవడంలో తోడ్పడతాయి. చేసిన తప్పిదాల్ని తెలుసుకొని భవిష్యత్తులో మళ్లీ రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగేయాలి. దీంతో ఆరోగ్యకరమైన పోర్ట్ఫోలియోను తయారు చేసుకోవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు.
ఓపికగా ఉండాలి
BE PATIENT
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్లందరికీ ఒక విజన్ ఉండాలి. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ ఓవరాల్ గా దీర్ఘకాలంలో హై అవుతున్నాయనే విషయాన్ని గుర్తించాలి. కోవిడ్ లో కూడా స్టాక్ మార్కెట్లు 50 శాతం డౌన్ అయ్యాయి. అయితే మళ్లీ రికవరీ అయ్యాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్‌తో ఎగ్జిట్ అవ్వకూడదు. మార్కెట్ లో అలా నిలబడితే చాలు డబ్బులు వస్తాయనే విషయాన్నిగుర్తించాలి. ఓపికగా ఉండడం చాలా ముఖ్యం.
ఫ్రీ అమౌంట్‌ను జనరేట్ చేసుకోవాలి
GENERATE FREE AMOUNT
మిడిల్ క్లాస్ పర్సన్స్ కు చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఒక ఫ్రీ అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఆ ఫ్రీ అమౌంట్ కోసం కష్టపడాలి. ఎక్స్ట్రా వర్క్ కూడా చేయాలి. ఒక ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని ఎక్స్ట్రా వర్క్ తో మనకున్న టాలెంట్ ను ఉపయోగించి కొంత అమౌంట్‌ను సంపాదించాలి. దానిని వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయాలి. గోల్డ్ లో ఒక భాగం, మిగతా మొత్తం ఈక్విటీలో ప్రధానంగా ఆటోమొబైల్ , బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ ఎం సీజీ, సిమెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇలా తదితర రంగాలకు సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక రూ.10 లక్షల వరకు మీరు పోర్ట్ ఫోలియో ని మెయింటైన్ చేస్తే ఆ తర్వాత మీకు డివిడెండ్స్ వస్తాయి . లైఫ్ లాంగ్ సంతోషంగా జీవించొచ్చు.