Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India

Posted on 04/12/2025 By admin No Comments on రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India

రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా బలహీనపడుతుండగా, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పంపకాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఏఈ, సౌదీ, ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పంపే రిమిటెన్సులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. రూపాయి పతనం కారణంగా అక్కడి దిర్హమ్‌తో పోలిస్తే భారత్‌ ఖాతాలకు వస్తున్న నగదు మూడింతలు పెరిగినట్లే అనుభవం కలుగుతోందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

దిర్హమ్‌ బలంగా – రూపాయి బలహీనంగా..Dirham Strengthens, Rupee Weakens

గత కొద్ది నెలలుగా గ్లోబల్‌ మార్కెట్లలో డాలర్‌ దూకుడుగా పయనిస్తుండటంతో రూపాయి వరుసగా పతనమవుతోంది. దిర్హమ్‌–రూపాయి మారకపు విలువ పెరగడంతో గల్ఫ్‌లో ఉన్న కార్మికులు పంపే ప్రతి దిర్హమ్‌కు భారతీయ కుటుంబాలకు మరింత ఎక్కువ మొత్తంలో నగదు అందుతోంది. దీంతో రిమిటెన్స్‌ సెంటర్ల వద్ద క్యూలు పెరిగి, ట్రాన్సాక్షన్‌ వాల్యూమ్‌ రికార్డు స్థాయికి చేరింది.

మూడింతలు సంతృప్తి..Triple the Satisfaction

యూఏఈలో ఉన్న ఉద్యోగులకు జీతాల్లో పెరుగుదల లేకపోయినా, రేటు మార్పులు మాత్రమే భారీ లాభం తీసుకొస్తున్నాయి. 1 దిర్హమ్‌ = గతంలో 18–19 రూపాయలు… ఇప్పుడు 22–23 రూపాయలకు చేరుకోవడంతో
అదే జీతం పంపినా.. భారత కుటుంబాలకు చేరే మొత్తంలో మూడింతల లాభం పొందుతున్నామనే భావన ఏర్పడింది. బ్యాంకులు, మనీ ఎక్స్చేంజ్‌ కంపెనీలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
“గత నెలతో పోలిస్తే యూఏఈ నుంచి పంపిన రిమిటెన్సులు 25–35% పెరిగాయి. రూపాయి బలహీనపడిన ప్రతిసారి ఇలాంటి ట్రెండ్‌ చూస్తాం. ఈసారి పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది” అని బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. ఏదేమైనా భారత్‌లో కుటుంబాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. విదేశాల్లో కష్టపడి పనిచేసే కుటుంబ సభ్యుల నుండి పంపే నగదు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అందుతుండటంతో గ్రామాల్లో, పట్టణాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అప్పుల తీర్చడం, ఇళ్ళ నిర్మాణ,
పిల్లల చదువు ఖర్చులు వంటి పనులు వేగంగా పూర్తి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

రూపాయి పతనంతో ఆందోళన ..Worry Over Rupee’s Decline

ఒక్కవైపు గల్ఫ్‌ రిమిటెన్సులు పెరుగుతున్నా .. మరోవైపు దిగుమతులపై భారత్‌కు భారం పెరుగుతుంది.
క్రూడ్‌ ఆయిల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బంగారం దిగుమతులకు భారీగా అదనపు ఖర్చు అవుతుండటంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తప్పదని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం తాత్కాలికంగా రిమిటెన్స్‌ గ్రహీతలకు లాభం తెచ్చినా… దీర్ఘకాలంలో దిగుమతులు ఖరీదు కావడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ప్రభుత్వ, ఆర్బీఐ చర్యలతో మారకపు విలువను నిలకడైన స్థాయికి తీసుకురావాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. రూపాయి బలహీనపడిన ప్రతిసారి… విదేశాల్లో పనిచేసే భారతీయుల రిమిటెన్సులు కుటుంబాలకు ఓ మానసిక బలం ఇస్తాయి. అయితే దీని వెనుక దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

రూపాయి పతనం… సామాన్యుడిపై భారం ఎంత? Rupee Slide: How Much Burden on the Common Man?

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి వరుసగా బలహీనపడుతూ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయిలకు చేరింది. డాలర్‌ దూకుడు ఆగకపోవడంతో భారతీయ కరెన్సీపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ మారకపు విలువ పతనం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాక, సామాన్యుడి జేబుపైనా నేరుగా పడుతోంది. రోజువారీ అవసరాలు, ప్రయాణాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటిపై భారం పెరుగుతోంది.

దిగుమతులు పెరిగే కొద్దీ… ధరల దెబ్బ.. As Imports Rise… Prices Hit Hard

భారత్‌ పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకునే వస్తువులపై తొలి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్‌. రూపాయి బలహీనపడితే డాలర్లలో దిగుమతి చేసుకునే క్రూడ్‌ ఆయిల్‌ మరింత ఖరీదవుతుంది.దీని ప్రభావంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరుగుతాయి. తద్వారా కూరగాయలు, ధాన్యాలు, రోజువారీ సరుకుల ధ‌ర‌లు కూడా నింగినంటుతాయి. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలలో కీలక భాగాలు దిగుమతి చేయాల్సి వస్తుంది. రూపాయి పడిపోతే ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 2%–10% వరకు అదనపు భారం ప‌డుతుంది. గాడ్జెట్‌ ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. మెడికల్‌ పరికరాలు, మందులు, ఆప్టికల్‌ పరికరాలు, డయాగ్నస్టిక్‌ మిషన్లు, ముడి మందులు విదేశాల నుంచే వస్తాయి. డాలర్‌ బలపడితే ఆసుపత్రి చికిత్స ఖర్చులు కూడా పెరుగుతాయి. రవాణా–దిగుమతి ఖర్చులు పెరగడంతో పాలు , నూనెలు, FMCG ఉత్పత్తులు, కూరగాయలు ధరలు పెరుగుతాయి.

విదేశీ ప్రయాణం – రెట్టించిన ఖర్చు… Foreign Travel — Double the Cost

డాలర్ విలువ పెరిగినందున విదేశీ ట్రిప్స్‌, విద్య, మెడికల్‌ టూరిజం ఖర్చు కూడా పెరుగుతుంది. విమాన టికెట్లు, హోటల్స్‌, స్థానిక రవాణా కు బడ్జెట్‌ మించి వెచ్చించాల్సి వస్తుంది.

విదేశీ చదువు – తల్లిదండ్రులకు టెన్షన్.. Overseas Education — A Growing Worry for Parents

ట్యూషన్ ఫీజులు డాలర్లలో ఉండడం వల్ల విదేశీ కోర్సు ఖర్చు మరింత పెరుగుతుంది. విద్యార్థుల జీవన ఖర్చు కూడా 15% వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో త‌ల్లిదండ్రుల‌పై భారం ప‌డుతుంది.

రుణాల EMIపై పరోక్ష ప్రభావం… Indirect Impact on Loan EMIs

ఇంధన , దిగుమతి ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీని కారణంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంపు చేసే అవకాశం ఉంటుంది . హోం లోన్, కార్‌ లోన్ EMIలు పెరిగే అవకాశం ఉంది. అయితే… ప్రయోజనం పొందేవారు కూడా ఉన్నారు. రూపాయి పతనం వల్ల ఎగుమతిదారులు, విదేశాల్లో పనిచేసే భారతీయుల కుటుంబాలు కొంత లాభం పొందుతారు. రిమిటెన్స్‌ ఎక్కువగా అందుతుండ‌డం వ‌ల్ల‌ ఎగుమతులకు డిమాండ్‌ పెరుగుతుంది. కానీ దేశీయ వినియోగదారుడి కోణంలో చూసుకుంటే… భారం మాత్రం తప్పదు. “రూపాయి మరింత బలహీనమైతే రాబోయే రెండు నెలల్లో ద్రవ్యోల్బణం 0.5%–1% వరకు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించే విధానాలు, స్థిర కరెన్సీ చర్యలు అవసరం” అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డాలర్‌ దూకుడు ..Dollar Surge

భారత్‌–అమెరికా డీల్‌పై నెలకొన్న అనిశ్చితులు, విదేశీ పెట్టుబడుల పెద్ద ఎత్తున వెనుకంజ… ఈ రెండు అంశాలు కలిసి రూపాయి విలువను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సాగుతున్న బలహీనత నేటి ట్రేడింగ్‌లో మరింత పెరిగింది. ఒక దశలో రూపాయి ఏకంగా 28 పైసలు క్షీణించి 90.43 వద్దకు చేరి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.

వెనక్కి పోతున్న విదేశీ పెట్టుబడులు… Foreign Investments Pulling Back…

భారత ఈక్విటీ, డెట్‌ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు కోట్ల రూపాయల పెట్టుబడులను వరుసగా వెనక్కి తీసేస్తున్నారు. గ్లోబల్‌ ఆర్థిక అనిశ్చితి. భారత్‌–అమెరికా వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడం. US యీల్డ్స్‌ పెరుగుదల వంటి అంశాలు విదేశీ ప్రవాహాలను తగ్గించాయి. FPI ఔట్‌ఫ్లోలు పెరిగినప్పుడల్లా డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. అదే ఇప్పుడు రూపాయి విలువను మరింత బలహీనపరుస్తోంది. దిగుమతిదారుల డాలర్ కొనుగోళ్లు కూడా ఒత్తిడి పెంచుతున్నాయి. రూపాయి విలువపై ఒత్తిడి ఇంకా కొన్నిరోజులు కొనసాగవచ్చు. కరెన్సీ 90.70–91 స్థాయిలను తాకే అవకాశం ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌ స్థిరపడే వరకు రూపాయి పునరుద్ధరణ కష్టమే. “భారత్‌–అమెరికా డీల్‌లో స్పష్టత వచ్చినా, FPI ప్రవాహాలు తిరిగి పుంజుకున్నా అప్పుడే కొంత ఉపశమనం లభిస్తుంది” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

232
FEATURE NEWS Tags:As Imports Rise… Prices Hit Hard, Dirham Strengthens, Dollar Surge, Foreign Investments Pulling Back…, Foreign Travel — Double the Cost, Indirect Impact on Loan EMIs, Overseas Education — A Growing Worry for Parents, Rupee Slide: How Much Burden on the Common Man?, Rupee Weakens, Triple the Satisfaction, Worry Over Rupee’s Decline

Post navigation

Previous Post: డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December
Next Post: గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh!

Related Posts

  • క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future FEATURE NEWS
  • కొత్త పన్ను విధానంలో ఏటా మార్పులివే..! Year-wise Changes in the New Tax Regime FEATURE NEWS
  • బ్యాంకు రుణాల మాఫీ | బ్యాంకులు వేల కోట్ల రుణాలను ఎందుకు రద్దు చేస్తాయి? Bank Loan Write-Offs | Why Banks Cancel Thousands of Crores? FEATURE NEWS
  • లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ పుస్త‌క స‌మ‌రీ LIFE’S AMAZING SECRETS by gaur gopal das book review telugu BOOKS
  • కొత్త పాన్‌ కార్డ్‌ కోసం కేవలం ఆధార్‌ సరిపోదు! నిబంధనలు కఠినతరం… ఏమేం అవసరమంటే? New PAN Card Rules 2026 – Aadhaar Alone Not Enough Anymore FEATURE NEWS
  • లోన్ రిజెక్ట్ అయితే క్రెడిట్ స్కోరు పడిపోతుందా? Does Loan Rejection Really Hurt Your Credit Score? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఆర్‌బీఐ రూల్‌తో పెర‌గనున్న ఈఎంఐలు NEWS
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • ఒక్క‌సారిగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు ..భార‌త్‌పై భార‌మెంతో తెలుసా? How Much Will the Sudden Spike in Crude Oil Prices Cost India? FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • ఎల్ఐసీ నుంచి రెండు కొత్త పాల‌సీలు.. అవేమిటో తెలుసుకుందాం! Two New LIC Policies — Let’s Find Out What They Are! INSURANCE
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ బీమా పెర‌గొచ్చు NEWS
  • బైబ్యాక్‌పై కొత్త పన్ను భారం… ఏప్రిల్‌ 1 నుంచి 12% సర్‌చార్జి.. 12% Surcharge on Buyback Capital Gains from April 1 FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme