
మన పూర్వీకుల నుంచి మనకు తెలిసిన అత్యంత సురక్షిత, ప్రాచీన పొదుపు సాధనం బంగారం. బంగారాన్ని సురక్షిత పెట్టుబడి పథకంగా అనుకుంటాం. కానీ ప్రస్తుతం పసిడి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. నాణ్యత విషయంలో సందేహం ఉంటుంది. పైగా దాన్ని భద్రంగా దాచుకోవడం ఒక సమస్యగానే ఉంటుంది. దీనికి పరిష్కారంగా వచ్చినవే సార్వబౌమ పసిడి బాండ్లు (సావరీన్ గోల్డ్ బాండ్లు-ఎస్ జీబీ). రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఈ మధ్య బంగారం ధరలు మళ్ళీ పెరగడంతో బాండ్లపై ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది.
what are rbi gold funds
కేంద్ర ప్రభుత్వం బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి సులభంగా ఈ సార్వబౌమ పసిడి బాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బాండ్లను ఆర్బీఐ తొలిసారిగా 2015 నవంబరు 5న విడుదల చేసింది. అప్పుడు గ్రాము ధర రూ.2,684.. ఆదరణ బాగుండటంతో ఆర్బీఐ వరుసగా ఈ బాండ్లను విడుదల చేస్తోంది. తక్కువ డబ్బుతో మనకు బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండడం, మనం పెట్టిన పెట్టుబడికి ఏటా 2.5 శాతం వడ్డీ లెక్కన 6 నెలలకొకసారి చెల్లించడంలాంటి ప్రయోజనాలతో చాలామంది వీటిని ఎంచుకుంటారు. ప్రస్తుతం పదో విడత బాండ్ల ఇష్యూ ఈ నెల 4వరకు జరిగింది. వీటికి గ్రాము కనీస ధర రూ.5,109గా ఆర్బీఐ నిర్ణయించింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసే రిటైల్ మదుపరులకు రూ.50 తగ్గింది.
how to invest in rbi gold funds
పసిడి బాండ్లు 2015-16లో 3 విడతల్లో అందుబాటులోకి వచ్చాయి. 2016-17లో 4విడతల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి 10 విడతల్లో ఈ బాండ్లు అందుబాటులోకి వచ్చాయి. తొలి విడత బాండ్లు 2015-16లో వచ్చినపుడు దీనిధర రూ.2,951 ఇప్పుడు ఇవి స్టాక్ ఎక్స్చేంజీలో దాదాపు రూ.4,700 పలుకుతున్నాయి. అంటే 6 ఏళ్ళలో దాదాపు 75 శాతం వరకు రాబడి వచ్చిందన్నమాట. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ లో వచ్చిన బాండ్ విలువ రూ.2,951 ఈ నాలుగేళ్ళలో 59 శాతం రాబడి అందింది. దీనికి వడ్డీ 6నెలలకొకసారి అదనంగా వస్తుందన్నది మనం గుర్తించాలి. కొత్తగా జారీ చేసిన బాండ్లకు బదులు స్టాక్ ఎక్స్చేంజీలో వివిధ సమయాల్లో బాండ్లను పరిశీలించి కొనడం వల్ల మరింత తక్కువ ధరకే బాండ్లను సొంతం చేసుకోవచ్చు. అయితే స్వల్పకాలిక పెట్టుబడులకు వర్తించే పన్ను నిబంధనలు దృష్టిలో పెట్టుకోవాలి.