what are penny stocks
పెన్నీ స్టాక్స్ అంటే తక్కువ షేర్ ప్రైస్ కలిగి ఉండి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా తక్కువగా ఉండే కంపెనీలకు చెందే షేర్లను పెన్నీ స్టాక్స్ అంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉండడం వలన కొంతమంది ప్రమోటర్లు ఈ షేర్లను తమకు కావాల్సిన విధంగా పెంచడం లేగా తగ్గించడం చేస్తారు. అందువలన ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే లాభాలు కూడా వస్తాయి. ప్రస్తుతం అద్భతాలు సృష్టించిన ఎన్నో స్టాక్స్ ఒకప్పుడు పెన్నీ స్టాక్స్‌గా మొదలైనవే. ఇవి అమాంతం పెరిగి నమ్మలేనంతగా లాభాలను ఇస్తుంటాయి. ఆ షేర్ పెరిగి వేల రెట్లలో సిరులు కురిపిస్తాయి. అయితే వీటిలో ఏది నిజమైన కంపెనీ అనేది తేల్చుకోవడం కొంచెం కష్టం. పెన్నీ స్టాక్స్ మాటున పెద్ద పెద్ద స్కాంలు, భారీ కుంబకోణాలు జరుగుతుంటాయి. చిన్న చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి ట్రాప్‌లకు బలై మొత్తం డబ్బును కోల్పోతుంటారు.
better to stay away from penny stocks
కొత్తగా స్టాక్ మార్కెట్ లో వచ్చేవారుఈ పెన్నీ స్టాక్స్ కి దూరంగా ఉండడం మంచిది. చాలామంది షేర్ ప్రైస్ తక్కువగా ఉందని ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ చాలా పెన్నీ స్టాక్స్ అనేవి ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటాయి గాని పెరగవు. కాబట్టి వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి. వీటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.