కమొడిటీస్‌పై ఓ లుక్కేయండి..!
what are commodities in stock market
ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు వస్తువుల ధరలు పెరిగిపోతున్నపుడు కమొడిటీస్ ధరలు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమొడిటీస్ ధరలు అనుకూలంగా ఉన్న రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని పెట్టుబడి సంస్థలు అంచనా వేస్తున్నాయి. లోహాలు, చమురు, మాంసం, వ్యవసాయోత్పత్తులు వీటన్నింటిని కమొడిటీస్ గా పేర్కొంటారు. ఆహార ధాన్యాలు, బంగారం, వెండి, అల్యుమినియం, రాగి, ఇనుము, చమురు, సహజవాయువు, విద్యుత్… వీటన్నింటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మార్కెట్లో ప్యూచర్ కాంట్రాక్టులు, స్పాట్ మార్కెట్లు ఇందుకు వీలుకల్పిస్తున్నాయి. మనదేశంలో ఎన్ సీడెక్స్, ఎంసీఎక్స్, ఐఈఎక్స్ లలో ఇటువంటి లావాదేవీలు జరుగుతాయి.
commodities are profitable or not
ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కువగా బంగారం, వెండి, వ్యవసాయోత్పత్తులపై ఆసక్తి చూపిస్తున్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అధిక ద్రవ్యోల్బణం, ఇతర పరిస్థితుల ప్రభావం.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడిచమురు బ్యారెల్ 110-120 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుంది. దీని కారణంగా పెరిగిపోతున్న వస్తువుల ధరలు అదుపు చేసేందుకు ఈ నెలలో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెంచుతామని, అవసరమైతే మరిన్ని విడతలు పెంచుతామని అమెరికా కేంద్రబ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. ఈ సమయంలో మన దేశ స్టాక్ మార్కెట్లో విదేశి పెట్టుబడుదారులు ఎక్కువగా అమ్మకాలు చేపట్టారు. గత 5 నెలల్లోనే రూ.లక్ష కోట్లకు పైగా విలువైన షేర్లను వారు అమ్మారు. అందువల్లే మన దేశ స్టాక్ మార్కెట్లో దిద్దుబాట్లు చోటుచేసుకుంటోంది. ఇలాంటి సమయంలో కమొడిటీస్ పై పెట్టుబడులు కొంతకాలం వరకు లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
మనం పెట్టే పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలని పెట్టుబడిదారులు ఈక్విటీ షేర్లకు పరిమితం కాకుండా వస్తువుల ధరలపై ట్రేడింగ్ జరిగే ఎక్స్చేంజీలకూ దారీతీస్తున్నారు. పెట్టుబడుల్లో కొంత వరకు బంగారం, వెండి, చమురు, కొన్ని వ్యవసాయోత్పత్తులు కాంట్రాక్టుల్లోనూ పెడుతున్నాం. కొంతమంది వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యాపారస్థులు వస్తువుల ధరలు పెరుగుదలపై లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
which is the right time to invest in equity
ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీ వద్దు
స్టాక్ మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు దిద్దుబాటు ను లెక్కలోకి తీసుకుంటే, ప్రస్తుతం వస్తువుల ధరలపై పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వవచ్చునని పెట్టుబడుల సంస్థ రోజర్స్ హోల్డింగ్స్ ఛైర్మన్ జిమ్ రోజర్స్ చెప్తున్నారు. కొన్ని అనుకూల పరిస్థితుల్లో వస్తువుల ధరలు పెరిగిపోతాయని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండితో పాటు వ్యవసాయోత్పత్తులపై పెట్టుబడులు ఆకర్షనీయంగా కనిపిస్తున్నాయని, ఫిబ్రవరి నెలలో 1790 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర, ఇప్పుడు 1925 డాలర్ల పై ఉంది. చమురు కూడా అంతే ఈనెల 1న బ్యారెల్ 100 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు 112 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఇంకా పెరగొచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు కొంత సమయం తీసుకోవాలని అంటున్నారు.
Leave a Reply