Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్పులివే.. అన్ని రంగాల‌పై ప్రభావం! New Financial Year Brings Major Changes Across Sectors

Posted on 30/03/2026 By admin No Comments on ఏప్రిల్‌ 1 నుంచి కొత్త మార్పులివే.. అన్ని రంగాల‌పై ప్రభావం! New Financial Year Brings Major Changes Across Sectors

కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ఆరంభానికి కేవలం కొన్నిగంట‌ల స‌మ‌యం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్‌ 1 నుంచి అనేక మార్పులు అమల్లోకి (New Financial Year Brings Major Changes ) రానున్నాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే… ఈ మార్పులు కేవలం పన్నులకే పరిమితం కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు, రైల్వే ప్రయాణికులు… దాదాపు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం, లేబర్ కోడ్స్‌, బడ్జెట్ ప్రతిపాదనలు, బ్యాంకింగ్ మార్పులు, రైల్వే నిబంధనలు.. ఇలా అనేక అంశాలు కలిపి ఈసారి మార్పుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పులు ఏంటి? ఇవి మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి? అనే అంశాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కొత్త ఆదాయపు పన్ను చట్టం… సరళతే లక్ష్యం.. New Income Tax Law Aims for Simplicity
1961 నుంచి అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం “ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025” పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి (New Financial Year Brings Major Changes )రానుంది. ఈ చట్టాన్ని రూపొందించడంలో ప్రధాన ఉద్దేశ్యం.. పన్ను వ్యవస్థను సరళీకరించడం. ప‌న్ను చెల్లింపుదారులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న క్లిష్టతను తగ్గించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. ముఖ్యంగా సాధారణ వ్యక్తికి అర్థమయ్యే భాషలో చట్టాన్ని రూపొందించడం విశేషం. అయితే పన్ను శ్లాబులు, రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనించాల్సిన అంశం.

ఫైనాన్షియల్ ఇయర్‌కు బదులు ‘ట్యాక్స్ ఇయర్’.. Introduction of a Single ‘Tax Year’ Concept
ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ (FY), అసెస్‌మెంట్ ఇయర్ (AY) అనే రెండు పదాలు ఉండటం వల్ల చాలామంది గందరగో ళానికి గురయ్యేవారు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం “ట్యాక్స్ ఇయర్” అనే కొత్త పదాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే (New Financial Year Brings Major Changes )కాలాన్ని ఇకపై ట్యాక్స్ ఇయర్‌గా పరిగణిస్తారు. దీంతో పన్ను వ్యవస్థ మరింత స్పష్టంగా మారనుంది.

హెచ్‌ఆర్‌ఏలో భారీ మార్పులు… మరిన్ని నగరాలకు లాభం.. HRA Benefits Extended to More Cities
ఇంటి అద్దె భత్యం (HRA) విషయంలో కూడా కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మెట్రో నగరాలుగా గుర్తించిన నాలుగు నగరాల్లో (దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై) నివసించే వారికి మాత్రమే 50% వరకు మినహాయింపు లభించేది. ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు కూడా చేరాయి. దీంతో ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. అయితే ఈ మినహాయింపులు పొందాలంటే అద్దె ఒప్పందం, యజమాని వివరాలు, పాన్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

లేబర్ కోడ్స్ ప్రభావం… చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశమా? Labour Codes May Impact Take-Home Salary
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం (New Financial Year Brings Major Changes )ఉద్యోగుల బేసిక్ సాలరీ మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా సంస్థల్లో ఇది 30–40% మధ్యలో ఉంది. ఈ మార్పుతో పీఎఫ్‌, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాల కోసం కేటాయించే మొత్తం పెరుగుతుంది. దీని వల్ల భవిష్యత్ భద్రత పెరిగినప్పటికీ, నెలవారీ చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.

ఎఫ్‌అండ్‌ఓ ట్రేడర్లకు షాక్… ఎస్‌టిటి పెంపు.. Higher STT for F&O Traders
స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పెంచింది. ఫ్యూచర్స్‌పై 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్‌పై కూడా గణనీయంగా పెంపు చేసింది. దీంతో ట్రేడింగ్ ఖర్చులు పెరగడం ఖాయం.

పాన్ నిబంధనల్లో కఠినతరం.. PAN Rules Tightened Across Transactions
పాన్ కార్డు సంబంధిత నిబంధనల్లో పెద్ద మార్పులు (New Financial Year Brings Major Changes ) చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆధార్‌తోనే పాన్ పొందడం సాధ్యమయ్యేది. ఇకపై ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, జనన ధృవపత్రం వంటి అదనపు పత్రాలు అవసరం. అంతేకాకుండా బ్యాంక్ లావాదేవీలు, ఆస్తి కొనుగోలు, వాహనాలు, హోటల్ బిల్లులు—ఇలా అనేక రంగాల్లో పాన్ తప్పనిసరి చేస్తున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలకు, రూ.20 లక్షల పైబడిన ఆస్తి లావాదేవీలకు, రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలకు పాన్ తప్పనిసరి అవుతుంది.

ఇన్సూరెన్స్ పాలసీలపై కొత్త నిబంధనలు.. PAN Mandatory for All Insurance Policies
ఇప్పటి వరకు సంవత్సరానికి రూ.50 వేల ప్రీమియం దాటితేనే పాన్ అవసరం ఉండేది. ఇకపై ప్రతి పాలసీకి పాన్ ఇవ్వడం తప్పనిసరి. ఇది పారదర్శకత పెంచడమే కాకుండా పన్ను ఎగవేతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రైల్వే ప్రయాణికులకు కఠిన నిబంధనలు.. Stricter Train Ticket Cancellation Rules
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కూడా మార్పులు (New Financial Year Brings Major Changes ) చేశారు. రైలు బయల్దేరడానికి 8 గంటల లోపల టికెట్ రద్దు చేస్తే ఇకపై ఎలాంటి రిఫండ్ ఉండదు. ముందుగా ఇది 4 గంటలు మాత్రమే ఉండేది. ఇక 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% కోత, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే 25% కోత విధిస్తారు. దీంతో ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది.

బ్యాంకింగ్, ఎల్పీజీ ధరల్లో మార్పులు.. Changes in Banking and LPG Prices
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులను తగ్గించింది. కొన్ని కార్డులపై 50% వరకు పరిమితి తగ్గింపు అమలు చేసింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చిలోనే గృహ వాడుక గ్యాస్ రూ.60 పెరిగింది. ఏప్రిల్‌లో మరోసారి ధరలు సవరించే అవకాశం ఉంది. విమాన ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

మార్పులు ఎందుకు? ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది? Why These Changes and Their Impact?
ఈ మార్పుల (New Financial Year Brings Major Changes ) వెనుక ప్రధాన ఉద్దేశ్యం.. పన్ను వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఆర్థిక క్రమశిక్షణను పెంచడం, డిజిటల్ ట్రాకింగ్‌ను బలోపేతం చేయడం. అయితే సాధారణ ప్రజలపై వీటి ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. కొందరికి లాభాలు ఉంటే, మరికొందరికి అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు భవిష్యత్ భద్రత పెరిగినా, ప్రస్తుతం చేతికి వచ్చే జీతం తగ్గవచ్చు. ట్రేడర్లకు ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక అవసరం.

ముందస్తు అవగాహనతోనే లాభం.. Conclusion: Awareness is the Key
ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు (New Financial Year Brings Major Changes ) సాధారణ విషయాలుగా కనిపించినా… దీర్ఘకాలంలో మన ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు.. ఎవరైనా సరే ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తమ ఆర్థిక ప్రణాళికలను సవరించుకోవడం అవసరం. ఏదేమైనా మార్పులు తప్పనిసరి… కానీ అవగాహన ఉంటే అవే అవకాశాలుగా మారతాయి.

90
FEATURE NEWS Tags:Changes in Banking and LPG Prices, Conclusion: Awareness is the Key, Higher STT for F&O Traders, HRA Benefits Extended to More Cities, Introduction of a Single ‘Tax Year’ Concept, Labour Codes May Impact Take-Home Salary, New Income Tax Law Aims for Simplicity, PAN Mandatory for All Insurance Policies, PAN Rules Tightened Across Transactions, Stricter Train Ticket Cancellation Rules, Why These Changes and Their Impact?

Post navigation

Previous Post: సేవింగ్స్ అకౌంట్‌లో దాగి ఉన్న అవకాశాలు… కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు! Hidden Benefits of a Savings Account… More Than Just Saving Money!
Next Post: డిజిట‌ల్ బీమా కొనుగోలులో జ‌ర‌భ‌ద్రం.. వినియోగదారుల‌ను వెంటాడుతున్న డార్క్‌ ప్యాటర్న్స్‌ బెడద‌! Danger in Digital Insurance Purchases: Dark Patterns Haunting Consumers!

Related Posts

  • ట్రంప్‌ టారిఫ్‌లు రద్దు.. రీఫండ్‌ ఎవరికీ? Trump Tariffs Verdict: Who Really Gets the Money Back? FEATURE NEWS
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • ఆటో పే సౌకర్యం… సౌలభ్యమేనా? లేక అప్రమత్తత అవసరమా? Auto Pay Facility: Convenience or a Call for Caution? FEATURE NEWS
  • బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు బ్రేక్‌.. RBI Puts the Brakes on Bank Mis-selling FEATURE NEWS
  • పన్ను కోతలతో త‌గ్గిన ఆదాయ వృద్ధి .. Income Growth Slows Due to Tax Cuts FEATURE NEWS
  • ఆస్తి పంపకాల్లో ఏది మంచిది? గిఫ్ట్ డీడా?… వీలునామానా? Gift Deed or Will – Which is Better for Property Transfer? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఇన్వెస్టింగ్ వైపు మహిళ‌ల అడుగులు.. Women Moving Towards Investing INVESTMENTS
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying FEATURE NEWS
  • 8-4-3 నియమంతో 15 ఏళ్లలోనే కోటీశ్వరులు..! 8-4-3 Rule: The Simple Path to Become a Crorepati in 15 Years INVESTMENTS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • What to do before financial decision ఆర్థిక నిర్ణయాల‌కు ముందు ఓ సారి ఆలోచించండి FINICAL PLANNING
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’? FEATURE NEWS
  • టర్మ్ పాలసీ రద్దయ్యిందా? అయితే వెంట‌నే పునరుద్ధరించుకోండి! Has Your Term Policy Lapsed? Revive It Immediately! INSURANCE
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme