Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

రైల్వే స్టాక్స్ దూకుడు..13% ఎగబాకిన RVNL షేర్లు.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం! Railway Stocks Surge: RVNL Shares Jump 13%, Investor Optimism Rises!

Posted on 27/12/2025 By admin No Comments on రైల్వే స్టాక్స్ దూకుడు..13% ఎగబాకిన RVNL షేర్లు.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం! Railway Stocks Surge: RVNL Shares Jump 13%, Investor Optimism Rises!

భారత స్టాక్ మార్కెట్‌లో మరోసారి రైల్వే రంగం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల కొన్ని నెలలుగా నెమ్మదిగా కదిలిన రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) షేర్లు ఒకే రోజులో సుమారు 13 శాతం వరకు పెరగడం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. RVNLతో పాటు ఇతర రైల్వే పీఎస్‌యూ కంపెనీల షేర్లలోనూ గణనీయమైన లాభాలు నమోదయ్యాయి.

రైల్వే రంగంపై మళ్లీ నమ్మకం..Renewed Confidence in the Railway Sector
(Railway Stocks)ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ రంగంపై పెట్టుబడిదారుల్లో మళ్లీ విశ్వాసం పెరిగింది. బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులు పెరగడం, కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ రావడం, ఇప్పటికే కొనసాగుతున్న పనుల్లో వేగం పెరగడం వంటి అంశాలు రైల్వే స్టాక్స్‌కు బలాన్నిచ్చాయి. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలతో రైల్వేలు నేరుగా అనుసంధానమై ఉండటంతో, ఆర్థిక వృద్ధి అంచనాలు పెరిగిన ప్రతిసారీ ఈ రంగానికి డిమాండ్ పెరుగుతోంది.

RVNL షేర్లకు ఎందుకు అంత డిమాండ్? Why Is There So Much Demand for RVNL Shares?
రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) భారత రైల్వేలకు అనుబంధ సంస్థ. రైల్వే ప్రాజెక్టుల అమలు, డబ్లింగ్ లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, కొత్త రైల్వే లైన్లు, మెట్రో, విదేశీ ప్రాజెక్టులు వంటి కీలక పనులను ఈ సంస్థ చేపడుతుంది. ఇటీవల RVNLకు సంబంధించి వచ్చిన కొన్ని పాజిటివ్ వార్తలు షేర్ ధరను పైకి నెట్టాయి. భారీ విలువైన కొత్త ఆర్డర్లు, ప్రాజెక్టుల అమలులో పురోగతి, ఆర్థిక ఫలితాల్లో స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ రంగ సంస్థగా నమ్మకం.. ఈ అంశాలన్నీ కలిసి RVNL షేర్లకు కొనుగోళ్ల మోత పెరిగేలా చేశాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే RVNL షేర్ల‌ కొనుగోళ్లు పెరిగాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే షేరు గ్యాప్-అప్‌తో ప్రారంభమై, కొద్ది గంటల్లోనే దాదాపు 13 శాతం వరకు పెరిగి రూ. రూ. 391కు చేరింది. ఇది సాధారణ రోజువారీ లాభం కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. అయితే, ఈ ఒక్కరోజు ర్యాలీ ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొత్తంగా చూస్తే RVNL షేరు సుమారు 9 శాతం తగ్గినట్టే ఉంది. అంటే, ఇటీవల జరిగిన నష్టాల నుంచి కొంతమేర కోలుకునే ప్రయత్నంగా ఈ ర్యాలీని మార్కెట్ నిపుణులు చూస్తున్నారు.

ఇతర రైల్వే స్టాక్స్ ఇలా.. Other Railway Stocks Follow Suit
– RVNL ఒక్కటే కాదు… రైల్వే రంగానికి చెందిన ఇతర కంపెనీల షేర్లు (Railway Stocks)కూడా బలమైన ర్యాలీ చూపించాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) షేర్లు కూడా పెట్టుబడిదారుల కొనుగోళ్లతో ముందుకెళ్లాయి. ఈ షేరు 8.65 శాతం పెరిగి రూ. 132కు చేరింది. రైల్వే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రధాన సంస్థ కావడంతో, రైల్వే మౌలిక వసతుల పెట్టుబడులు పెరిగితే IRFCకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు ఈ లాభాలకు కారణంగా కనిపిస్తున్నాయి.
– ఇర్కాన్ ఇంటర్నేషనల్ (IRCON) షేర్లలోనూ లాభాలు కనిపించాయి. దేశీయంగానే కాకుండా విదేశీ ప్రాజెక్టులు చేపడుతున్న సంస్థ కావడంతో దీర్ఘకాలంలో మంచి అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
– రైట్స్ లిమిటెడ్ షేర్లు (RITES)కూడా పాజిటివ్ ట్రెండ్‌లో కదిలాయి. కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ సేవల్లో అనుభవం ఉన్న ఈ సంస్థకు స్థిరమైన ఆర్డర్ బుక్ ఉండటం బలంగా మారింది.
– టెక్స్‌మాకో రైల్ షేర్లు కూడా పాజిటివ్ ట్రెండ్‌లో కదిలాయి. రైల్వే కోచ్‌లు, మౌలిక సదుపాయాల తయారీలో ఈ సంస్థకు ఉన్న ఆర్డర్ బుక్ ఇన్వెస్టర్లకు భరోసా ఇస్తోంది. ఈ షేరు 4.47 శాతం పెరిగి రూ. 140కు చేరింది. కంపెనీకి ఉన్న ఆర్డర్ బుక్, రైల్వే రంగంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు ఈ స్టాక్‌కు మద్దతుగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– IRCTC షేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. టికెట్ బుకింగ్, కేటరింగ్, టూరిజం వంటి విభాగాల్లో ఈ కంపెనీకి స్థిరమైన ఆదాయ వనరులు ఉండటం దీనికి బలంగా మారింది.ఈ షేరు 3.79 శాతం పెరిగి రూ. 705కు చేరింది.
– రైల్‌టెల్ కార్పొరేషన్ షేర్లు గణనీయంగా పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే సరికి ఈ షేరు 8.11 శాతం పెరిగి రూ. 385కు చేరింది. క్రితం సెషన్‌లో ఉన్న స్థాయిలతో పోలిస్తే ఈ లాభం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. రైల్వే కమ్యూనికేషన్ నెట్‌వర్క్, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణలో రైల్‌టెల్ కీలక పాత్ర పోషిస్తుండటంతో, దీర్ఘకాలంలో ఈ కంపెనీపై అంచనాలు పెరుగుతున్నాయి.

ప్రభుత్వ పెట్టుబడులు కీలకం..Government Investment Remains the Key Driver
(Railway Stocks)కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ఆర్థిక వృద్ధికి కీలకమైన రంగంగా చూస్తోంది. సరుకు రవాణా సామర్థ్యం పెంచడం, ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచడం, హైస్పీడ్ రైళ్లు, వందే భారత్ వంటి ప్రాజెక్టులు ఈ రంగాన్ని కొత్త దశకు తీసుకెళ్తున్నాయి. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులు రైల్వే పీఎస్‌యూ కంపెనీలకు నేరుగా పనిగా మారుతున్నాయి. అందుకే ఈ స్టాక్స్‌పై మార్కెట్‌లో ఆసక్తి పెరుగుతోంది.

ఆర్థిక ఫలితాల ప్రభావం..Impact of Financial Results
RVNL సహా పలు రైల్వే సంస్థలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఆదాయం పెరగడం, లాభాలు స్థిరంగా కొనసాగడం, అప్పుల భారం నియంత్రణలో ఉండటం వంటి అంశాలు పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయి. ప్రత్యేకంగా RVNL విషయంలో ప్రాజెక్టుల అమలులో ఆలస్యం తగ్గడం, పనుల వేగం పెరగడం లాంటి అంశాలు లాభదాయకతను మెరుగుపరుస్తున్నాయి.

దీర్ఘకాల పెట్టుబడులకు అనుకూలమా? Is It Suitable for Long-Term Investment?
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రైల్వే స్టాక్స్‌(Railway Stocks)లో ఇటీవల ర్యాలీ తాత్కాలిక వార్తల ప్రభావంతో వచ్చినదే అయినా, దీర్ఘకాలంలో ఈ రంగానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దేశ ఆర్థిక వృద్ధితో పాటు రైల్వే రవాణా అవసరం పెరుగుతుంది. సరుకు రవాణా ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు ప్రభుత్వ మద్దతు కూడా కొన‌సాగుతుంది. అయితే ఇప్పటికే భారీగా పెరిగిన స్టాక్స్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రైల్వే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. షార్ట్‌టర్మ్ లాభాల కోసం పరుగులు పెట్టకుండా, దీర్ఘకాల దృష్టితో చూడాలి. ఒక్క స్టాక్‌పై ఆధారపడకుండా విభిన్న పెట్టుబడులు చేయాలి. కంపెనీ ఆర్డర్ బుక్, ఆర్థిక స్థితి పరిశీలించాలి. మార్కెట్ ఒడిదుడుకులకు సిద్ధంగా ఉండాలి

రైల్వే స్టాక్స్ ఎందుకు పెరిగాయంటే..? Why Have Railway Stocks Risen?

రైల్వే స్టాక్స్‌(Railway Stocks)లో కనిపించిన భారీ ర్యాలీకి ప్రధాన కారణం కొత్త ప్యాసింజర్ ఫేర్‌లు అమల్లోకి రావడమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈరోజు నుంచి రైల్వే ప్రయాణికుల టికెట్ ధరల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో రైల్వే ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు బలపడగా, అదే ప్రభావం స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. ఇది ఈ ఏడాదిలో రెండోసారి ప్రయాణికుల ఛార్జీల పెంపు కావడం గమనార్హం. ఇంతకుముందు జులై నెలలో ఒకసారి టికెట్ రేట్లు పెంచగా, ఇప్పుడు మళ్లీ స్వల్పంగా సవరణలు చేపట్టింది. రైల్వే శాఖ చేసిన మార్పుల ప్రకారం, సాధారణ సెకండ్ క్లాస్‌లో 215 కిలోమీటర్ల వరకు టికెట్ ధరలు పెంచలేదు. షార్ట్ డిస్టెన్స్ ప్రయాణికులు, రోజూ ప్రయాణించే డైలీ కమ్యూటర్లు ప్రభావితం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీర్ఘదూర ప్రయాణాల్లో మాత్రం స్వల్పంగా ఛార్జీలు పెరిగాయి. దీంతో సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా, రైల్వే ఆదాయం మాత్రం పెరిగేలా ప్రభుత్వం సమతూక విధానాన్ని అవలంబించినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు పెరిగితే రైల్వే ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు సహజమే. ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం రైల్వేలకు కీలకమైన వనరు కావడంతో, ఈ నిర్ణయం రైల్వే ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందన్న భావన పెట్టుబడిదారుల్లో ఏర్పడింది. అదే సమయంలో షార్ట్ డిస్టెన్స్ ప్రయాణికులను మినహాయించడం, డైలీ కమ్యూటర్లపై భారం వేయకపోవడం వంటి అంశాలు సామాజికంగా సానుకూలంగా ఉండటంతో, ప్రభుత్వ నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు తోడయ్యాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం టికెట్ ఛార్జీల్లో స్వల్ప పెంపు రైల్వే ఆదాయానికి దీర్ఘకాలంలో మేలు చేస్తుంది. అదే సమయంలో ప్రయాణికుల సంఖ్యపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో రైల్వే సంస్థల ఆర్థిక స్థితి మెరుగుపడితే, అనుబంధ పీఎస్‌యూ కంపెనీలకు కూడా లాభం చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

222
FEATURE NEWS Tags:Government Investment Remains the Key Driver, Impact of Financial Results, Is It Suitable for Long-Term Investment?, Other Railway Stocks Follow Suit, Renewed Confidence in the Railway Sector, Why Have Railway Stocks Risen?, Why Is There So Much Demand for RVNL Shares?

Post navigation

Previous Post: లోన్ వద్దనుకుంటున్నారా.. అయితే రద్దు చేసుకోండి ! ‘కూలింగ్-ఆఫ్’ నిబంధనతో సేఫ్ ఎగ్జిట్! Don’t Want the Loan? Cancel It! Safe Exit with ‘Cooling-Off’ Rule!
Next Post: 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026!

Related Posts

  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులివే.. ! Alert for Taxpayers: Major Changes from April 1 FEATURE NEWS
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS
  • ఎల్‌ఐసీలో డెత్ క్లెయిం చేసుకోవ‌డం ఎలా how to apply for death claim in LIC FEATURE NEWS
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • జీఎస్టీ తగ్గింపు .. రూ. కోట్లలో పండగ విక్రయాలు! GST Reduction Sparks Festive Sales Worth Crores! FEATURE NEWS
  • ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ స‌మ‌రీ తెలుగు THE COMPOUND EFFECT book summery telugu BOOKS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • రూపాయి ఢమాల్‌… తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకిన వైనం Rupee Tumbles… Breaches ₹90 Mark for the First Time FEATURE NEWS
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest? FINICAL PLANNING
  • పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్… డబ్బు డబుల్.. భద్రతకు భ‌రోసా! Post Office Savings Scheme… Safe Path to Wealth Growth FEATURE NEWS
  • 8-4-3 నియమంతో 15 ఏళ్లలోనే కోటీశ్వరులు..! 8-4-3 Rule: The Simple Path to Become a Crorepati in 15 Years INVESTMENTS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme