
స్టాక్ మార్కెట్ కండీషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎకానమీలో ఒక్కొక్కసారి గ్రోత్ బాగుంటుంది. ఒక్కొక్కసారి `హై‘ ఒక్కోసారి `లో’ లో ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ కూడా ఒక్కొక్కసారి హై లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంప్లేషన్ కూడా `లో` లో ఉంటుంది. అందుకని వేర్వేరు ఎకనామిక్ కండీషన్స్ ల బట్టి స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ లకు గురవుతూ ఉంటుంది. ఎకానమీలో మనీ ఫ్లో ఎలా ఉందనే అంశం పై స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. అందువల్ల ఈ వాలటాలిటీ కాని, సెక్టార్ రొటేషన్ కాని ఇవన్నీ మార్కెట్ ఎకానమీ పై ఆధరపడి ఉంటాయి. దీన్ని అర్థం చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మార్చుకుంటూ పోతే లాభాలకు డోకా ఉండదు.
స్టాక్ మార్కెట్‌లో వచ్చే ఈ అనిశ్చితిని మనం ఎలా ఉపయోగించుకోవాలి.. ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో కొంత పరిపక్వతతో ఆలోచించగలిగితే లాభాలు సాధించడం పెద్ద కష్టం కాదు.
how to know when market up will up and down
ఎప్పుడు అప్..? ఎప్పుడు డౌన్..?
వరల్డ్ మార్కెట్‌లో జరిగి చిన్న చిన్న మార్పులు స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. వాటిని తెలుసుకుంటే మార్కెట్ అప్ అండ్ డౌన్‌ను ముందే పసిగట్టి ఇన్వెస్ట్‌మెంట్ ను కొనసాగించవచ్చు.
* ఉక్రేయిన్ రష్యా యుధ్ధం వల్ల మన ఇండియాలో కొన్ని కంపెనీలు లాభపడ్డాయి. కొన్ని కంపెనీలు నష్టపోయాయి. మనం వంటనూనె ను ఉక్రేయిన్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. అక్కడి నుంచి దిగుమతులు సరిగా రాకపోవడంతో ఈ యుధ్ధం వల్ల వంటనూనె ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఇండియాలో వంట నూనె ఉత్పత్తి చేసే కంపెనీ అదానీ విల్ మర్ చాలా లాభపడింది.
* ఆయిల్ ని, క్రూడ్ ఆయిల్ ని వాడే పెయింటింగ్ ఇండస్ట్రీ కావచ్చు,టైర్ ఇండస్ట్రీ కావచ్చు ఆ స్టాక్స్ 15-20 శాతం ఇటీవల డ్రాప్ అయ్యాయి. ఎందుకంటే రా మెటీరియల్ ధరలు పెరగడం ద్వారా కంపెనీకి వచ్చే ప్రోఫిట్ తగ్గుతుంది.
* జాతీయ, అంతర్జాతీయ ఎకానమీలో యాక్టివిటీస్ వల్ల స్టాక్ మార్కెట్ నిరంతరం వాలటాలిటీకి గురవుతూ ఉంటుంది. ప్రతి 3 లేదా 6 నెలలకొకసారి మన పోర్ట్ ఫోలియోని రివ్యూ చేసుకోవాలి.
* ఇన్ ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, కమొడిటీ మార్కెట్ బాగా పనిచేస్తుంది. అలాంటి టైంలో కమొడిటీకి సంబంధించి అన్ని స్టాక్స్ బెనిఫిట్స్ పొందుతాయి.
* ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయనుకుంటే, ఆ కండీషన్ లో మార్కెట్స్ బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
* మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నపుడు, ప్రస్తుతానికి ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉంది..? ఏ సెక్టార్ మీద ఎఫెక్ట్ చేయబోతుంది..? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇలా కొన్ని ప్రత్యేక పరిస్థితులను గుర్తించగలిగినప్పుడు ఆ సమయంలో ఉన్న సెక్టార్, దాని పెరుగుదల అవకాశాలు ఇలాంటి వాటిని పసిగట్టి పెట్టుబడి చేస్తే లాభాలు గడించడం చాలా సులభం.