
క్రెడిట్ కార్డు అనేది ఇటీవల చాలా సాధారణమైన విషయమైంది. అందరూ క్రెడిట్ కార్డును వాడుతుంటారు. ప్రతి కొనుగోలుకూ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. కార్డు వినియోగం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి, అందులో ఉండే వెసులుబాట్లను, ఆఫర్లను వినియోగించుకుంటే అధికంగా ప్రయోజనం పొందవచ్చు.
సాధారణంగా మనందరికీ తెలిసినట్టుగా చూస్తే క్రెడిట్ కార్డుతో అనేక మంది నష్టపోయారని వింటుంటాం. తీసుకున్న అప్పుకన్నా అనేక రెట్లు అధికంగా మనం చెల్లించాల్సి వచ్చిన పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. అయితే అలాగే క్రెడిట్ కార్డులతో లాభాలు సంపాదించిన వారి గురించి పెద్దగా విని ఉండరు. ఎందుంటే కేవలం ఇంటిలిజెంట్స్ మాత్రమే ఇలా చేయగలరు. ఎవరైతే క్రెడిట్ కార్డు ట్రాప్‌లో చిక్కుకోరో వాళ్లే లాభపడతారు.
WHAT IS MEANT FOR CREDIT
క్రెడిట్ అంటే అప్పే
క్రెడిట్ కార్డు అంటే అప్పు తీసుకోవడమే. వినడానికి స్టైల్‌గా ఉన్నా క్రెడిట్ అంటే అప్పు అన్న విషయం మనం మర్చిపోకూడదు. అప్పు తీసుకున్న వారు చెల్లించాల్సిన విషయాన్ని విస్మరించడకూడదు. దాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలి. అలా చెల్లించని పక్షంలో మనం నష్టపోయే మొత్తం ఎన్ని రెట్లో మనం లెక్కపెట్టలేం. క్రెడిట్ కార్డులను ఉపయోగించడం సులభం కనుక ఎక్కువ ఖర్చుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనపై అప్పుల భారాన్ని సృష్టించవచ్చు. దీంతో మానసిక ఆందోళన మొదలవుతుంది.
ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవుతారో, ఫైన్ పడితే కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకుంటారో వాళ్లంతే నష్టపోయే జాబితాలో ప్రథమంగా ఉంటారు. కానీ తెలివైన వారెవరూ ఇలా చేయరు. వారు ఆ కార్డు ద్వారా ఎలా మనం బెనిఫిట్ పొందవచ్చో ఆలోచిస్తారు.
PROPER USAGE OF CREDIT CARD
ఆశ్చర్యం వద్దు.. ఖర్చు చేస్తే లాభాలే
* ప్రధానంగా ఎటువంటి వడ్డీ లేకుండా 45 రోజుల వరకూ మనకు ఫ్రీగా డబ్బులు ఇస్తారు. ఇలా తీసుకున్న డబ్బులను ఎక్కడైనా అధిక వడ్డీ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే ఫ్రీగా వడ్డీ పొందవచ్చు. ఇది మనకు మంచి ఆదాయమే. లేదంటే స్టాక్ మార్కెట్, లిక్విడ్ ఫండ్స్ లాంటి అనేక సాధనాల్లో డబ్బులు పెట్టి రాబడి పొందవచ్చు.
* ప్రతి లావాదేవీపై రివార్డ్ పాయింట్లను పొందొచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని వోచర్లను పొందొచ్చు.
* ఏటీఎం క్యాష్ విత్ డ్రా సదుపాయం కూడా ఉంది. ఏ బ్యాంకు ఏటీఎంకు వెళ్ళైనా డబ్బులు తీసుకోవచ్చు. 40 నుంచి 45 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ సౌకర్యం ఉంటుంది.
* ఎప్పుడు అవసరం అయినా కార్డును ఉపయోగించవచ్చు.టైమ్ లిమిట్ ఉండదు.
* క్రెడిట్ కార్డ్ పై పర్సనల్ లోన్స్ కూడా పొందవచ్చు. క్రెడిట్ కార్డ్ లో ఉపయోగించని క్రెడిట్ లిమిట్ పై ఈ లోన్ తీసుకోవచ్చు. లేదంటే ట్రాక్ రికార్డ్ ప్రాతిపదికన కూడా లోన్ లభిస్తుంది.
* స్మార్ట్ ఫోన్, ఫ్రిజ్, టీవీ లేదంటే ఇతర ప్రొడక్టులు క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసినపుడు, వాటిని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.
* క్రెడిట్ కార్డు బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుచుకోవచ్చు.
* ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సదుపాయం కూడా లభిస్తుంది.
* క్రెడిట్ కార్డులను తెలివిగా ఉపయోగిస్తూ, బిల్లు నిర్ణీత గడువులోగా క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తే అప్పుడు క్రెడిట్ లిమిట్ పెరుగుతూ ఉంటుంది.
* మనం యూనికార్డ్ ఉపయోగించి, లక్షరూపాయలు గాని ఖర్చు చేస్తే డ్యూ డేట్ లోగా మనం డబ్బులు చెల్లిస్తే 1శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక లక్ష కి రూ.1000 వస్తుంది. అనగా సంవత్సరానికి 12,000
స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ లో లక్ష రూపాయలు సేవింగ్స్ ద్వారా 6-7 శాతం వడ్డీ కలుస్తుంది. తద్వారా మనకి సంవత్సరానికి రూ.6000 వస్తుంది. మొత్తంగా రూ.18,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది.
`what is bill cycle of credit card
క్రెడిట్ కార్డులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బిల్ సైకిల్. అంటే బిల్ జనరేట్ అయ్యే తేదీ. డ్యూడేట్. అంటే బిల్లు కట్టాల్సిన తేదీ. ఈ రెండు విషయాలను మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. నిర్ణీత తేదీలోగా బిల్లు కట్టలేకపోతే ప్రతి రోజూకూ వడ్డీ పడుతుంది. ఇది మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.
క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో వచ్చిన మార్పులు
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ కీలకంగా మారింది. షాపింగ్, ఇతర లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇటీవల పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు వినియోగ నిబంధనల్లో అనేక మార్పులొచ్చాయి. రివార్డ్ పాయింట్స్ మొదలు కార్డ్ సంబంధిత ఛార్జీల వరకూ ఏయే మార్పులు వచ్చాయి.. కొత్త నిబంధనలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం..
థర్డ్ పార్టీ యాప్స్
Third Party Apps
ఈ మధ్య క్రిడిట్ కార్డ్స్ బిల్స్ ను బ్యాంక్స్ మొబైల్ యాప్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ నుంచి చాలామంది కడుతున్నారు. అంటే cred, google pay, phonepay, paytm. దీంతో ఆయా Third Party Apps వాళ్లు మన డబ్బును తీసుకుని బ్యాంకుకు కడుతున్నారు. అయితే ఇక Third Party Apps ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడం ద్వారా ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు, ఓచర్లు రావు.
ఉదాహరణకు.. మనం cred అనే యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టినట్లయితే మనకి cred పాయింట్స్ వస్తాయి. వాటి తో మనం షాపింగ్ చేసుకోవచ్చు. అదే మనం cred ద్వారా UPI చేస్తే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ ని మనం క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడంలో ఉపయోగపడుతుంది.
Chek appలో chipsని ఇస్తారు. ఆ chipsతో మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది. ఈ యాప్ వాళ్ళు కూడా ఓచర్స్ ఇస్తూ ఉంటారు. మనకి మార్కెట్లో చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇకపై ఈ యాప్స్ ను ఉపయోగించలేం. నేరుగా బ్యాంకుకు సంబంధించిన యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేయాలి.
RBI కొత్త అప్ డేట్
RBI New Update
మనం బిల్లు పే చేయాలంటే బ్యాంక్ వెబ్ సైట్ లేదా బ్యాంక్ యాప్ కి వెళ్ళి డైరక్ట్ గా పే చేయాలి. Third Party Apps ద్వారా మనం పేమెంట్ చేయలేం. RBI నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే అన్ని బ్యాంకులు BBPS అనగా BHARAT BILLPAY సిస్టమ్ తో రిజిస్టర్ అవ్వాలి. ఇలా అవ్వకపోతే Third Party Apps ద్వారా ఆ బ్యాంకుకు పేమెంట్లు చేయలేరు. కాగా మొత్తం 34 బ్యాంకుల్లో 5 బ్యాంకులు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ బ్యాంక్స్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. state bank of india, bank of baroda, kotak Mahindra bank, Indus ind bank, federal banks కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలిన 26 బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ మన వద్ద ఉంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్ పే మెంట్ చేయలేం. అందుకే మిగిలిన బ్యాంక్స్ RBI ని టైం అడుగుతున్నాయి. RBI టైమ్ ఇస్తే మిగిలిన బ్యాంకులు అప్ డేట్ అవుతాయి.
ఎంతమంది థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగిస్తున్నారు.. ఎంత డబ్బును కడుతున్నారో TRACKING చేయడం కోసమే ఆర్బీఐ ఈ రూల్‌ను తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఎటువంటి స్కామ్స్, మోసాలు జరగకుండా సెక్యూరిటీని పెంచడానికి RBI ఈ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది.