ఈ క్రెడిట్ కార్డులపై రాయితీలే..
which credit card offers more discounts
సాధారణంగా మనలాంటి ప్రజలకు ఉన్న ఎంటర్‌టైన్ మెంట్లలో ప్రధానమైనది సినిమా. భారతీయులకు సినిమాపై ఉన్న మోజు ఎంతో చెప్పలేనిది కాదు. అయితే ఇటీవల కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లడం కష్టమైంది. ఇప్పుడు తిరిగి థియేటర్లు తెరుచుకోవడం, పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవడంతో మళ్లీ థియేటర్లకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే థియేటర్లలో టికెట్లు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గి ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ విపరీతంగా పెరిగింది. దీంతో టికెట్ బుకింగ్ యాప్స్, క్రెడిట్ కార్డుల సంస్థలు ప్రజలను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్ల, రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా కొన్ని క్రెడిట్ కార్డులు పూర్తిగా సినిమా టికెట్లకోసమే ప్రత్యేకంగా వస్తున్నాయి. అలాంటి కొన్ని క్రెడిట్ కార్డుల కోసం తెలుసుకుందాం. అయితే క్రెడిట్ కార్డుల వాడకం, చార్జీలు, ఫైన్లు, వడ్డీల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మనం గుర్తించాలి.
what are the benefits on axis my zone credit card
*పేటీఎం మూవీస్ ద్వారా రెండో సినిమా టికెట్ కొనుగోలు చేస్తే 100 శాతం రాయితీని యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డు ఇస్తోంది. అజియో లో కనీసంరూ. 2,000 ఖర్చు చేస్తే రూ.600 తగ్గింపు, రెస్టారెంట్లలో 20 శాతం రాయితీ కూడా ఉంటుంది. ఈ కార్డు పై తొలిసారి ఏడాది ఎలాంటి వార్షిక రుసుము ఉండదు. రెండో సంవత్సరం నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
*ప్రతి సంవత్సరం రూ.6,000 విలువ చేసే సినిమా టికెట్లను ఎస్బీఐ ఎలైట్ కార్డు ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఒక నెలలో రెండు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్ పై రూ.250 రాయితీ వస్తుంది. ఈ రాయితీ రెండు టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రివార్డు పాయింట్స్ ఎలాగో ఉంటాయి.
*మనం 10,000 రూపాయలు ఒక నెలలో ఖర్చు చేస్తే పీవిఆర్ కొటాక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ రెండు పీవీఆర్ టికెట్లను ఉచితంగా ఇస్తోంది. పీవీఆర్ బాక్సాఫీసు వద్ద సినిమా టికెట్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
పీవీఆర్ లో ఫుడ్, బివరేజెస్ పై 15 శాతం రాయితీ లభిస్తుంది. ఈ కార్డు వార్షిక రుసుము రూ.999.
*ఒక నెలలో రూ.10,000కు మించి ఖర్చుచేస్తే సినిమా టికెట్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ కొటాక్ డిలైట్ ప్లాటినం క్రెడిట్ కార్డు ఇస్తోంది. ఒక సంవత్సరంలో ఖర్చులు రూ.1.25 లక్షలు దాటితే నాలుగు ఉచిత పీవీఆర్ టికెట్లు లేదా రూ.750 క్యాష్ బ్యాక్ ను ఈ కార్డు అందిస్తోంది. దీని వార్షిక ఫీజు రూ.299
* బుక్ మైషో ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకుంటే 25 శాతం రాయితీని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డు ఇస్తుంది. వారంలో డైనింగ్ పై చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 10 రివార్డ్ పాయింట్ల దక్కుతాయి. ఇతర కేటగిరీల్లో 3 రివార్డ్ పాయింట్లు వస్తాయి. సంవత్సరానికి రుసుము రూ.1000.
Leave a Reply