
what is NSE co location scam
మన దేశంలో ఎన్నో రకాలైన స్కామ్స్ జరుగుతున్నాయి. అలాగే స్టాక్స్ మార్కెట్లో కూడా స్కామ్స్ జరిగాయి. అందులో మనకు బాగా తెలిసిందే హర్షద్ మెహతా స్కామ్. ఈ స్కామ్ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన స్కామ్ ఒకటి జరిగింది. అదే NSE కో- లొకేషన్ స్కామ్. ఈ స్కామ్ లో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. 1.చిత్రా రామకృష్ణన్. 2.ఆనంద్ సుబ్రమణ్యమ్. 3. హిమాలయాన్ బాబా.
ఈ స్కామ్ లో బాధితులు ఎవరూ లేరూ. బాధితులు లేకుండా ఈ స్కామ్ ను ఎలా చేయగలిగారో తెలుసుకుందాం..
సింపుల్ గా చూస్తే..
ఎన్ఎస్ఈ అనేది ఒక బజార్ అనుకుంటే.. ఆ బజార్‌లో గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ వస్తువులను చాలా మంది దుకాణదారులు అమ్ముకుంటుంటారు. ఇలా అమ్మబడే వస్తువులు స్టాక్స్ అయితే, ఇలా అమ్మే దుకాణదారులు స్టాక్‌బ్రోకర్స్. ఈ బజార్‌లోకి వచ్చి సాధారణ వినియోగదారులు(ఇన్వెస్టర్లు) ఈ వస్తువులను కొనుక్కుంటూ, అమ్ముకుంటూ ఉంటారు. ఇలా అమ్మి కొన్నందుకు కొంత రుసుం వినియోగదారులు బజారుకు, దుకాణదారులకు చెల్లిస్తారు. ఇక్కడ దుకాణదారులు కూడా తమకు అనుమతినిచ్చినందుకు బజారుకు కొంత రుసుం చెల్లిస్తారు. ఇలా వచ్చే డబ్బులతో బజారు లాంటి ఎన్ఎస్ఈ అనేది లాభాలను పొందుతుంటుంది.
what are the functions of NSE
NSE లో లాభాలు ఇలా ..
ఎన్ఎస్ఈ లో 1600 పైగా కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఈ స్టాక్స్‌ను ఎన్ ఎస్ ఈ అనేది ఎక్స్చేంజీ చేస్తుంది. స్టాక్స్ ను మనం అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా ఎన్ఎస్ఈ ఎక్జిక్యూట్ చేస్తుంది.
కంపెనీలు NSE కి IPO ద్వారా లిస్టింగ్ కు వస్తాయి. ఆ కంపెనీలు లిస్టింగ్ ఫీజు, ప్రోసెసింగ్ ఫీజు NSE కి పే చేస్తాయి. అంతేకాకుండా UPSTOX, ANGLE ONE, జిరోదా వంటి బ్రోకరేజ్ కంపెనీల నుంచి ప్రోసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. NSE మన దేశంలో ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలో ఒకటి. NSE మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్సు ఉంటుంది. NSE కి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గా చిత్ర రామకృష్ణ పనిచేశారు. NSE లో ఒకప్పుడు ఫిజికల్ ట్రేడింగ్ మాత్రమే ఉండేది. స్టాక్స్ కొనాలన్న, అమ్మాలన్న ఫిజికల్ గానే జరిగేది. కాని చిత్ర రామకృష్ణన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేసిడ్ సిస్టమ్ తీసుకువచ్చారు.
NSE లో డేటా సర్వర్స్ ఉంటాయి. ఇవి NSE లో రియల్ టైమ్ స్టాక్ ప్రైసెస్ ని ఎటువంటి సమస్య లేకుండా స్టాక్ బ్రోకర్స్‌కి అందిస్తాయి. ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవరంటే UPSTOX, ANGLE ONE లాంటి కంపెనీలు. మనం ఒక స్టాక్ ను కొనాలన్న, అమ్మాలన్నా డైరెక్ట్ గా కొనలేం. మధ్యలో ఈ బ్రోకర్స్ ఉంటారు. బ్రోకర్స్ కి లక్షల్లో కస్టమర్స్ ఉంటారు. కాబట్టి బ్రోకర్స్ కూడా సర్వర్స్ ను మెంటెయిన్ చేస్తారు. మనం కొనే షేర్ NSE సర్వర్ నుంచి బ్రోకర్ సర్వర్ కి వస్తుంది. అక్కడి నుంచి మనకు వస్తుంది. ఇది ట్రేడింగ్ సిస్టమ్.
what is colocation facility
2010 ఆగష్టు లో NSE వాళ్ళు కో- లొకేషన్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టారు. దీనివలన స్టాక్ ప్రైసెస్ అనేవి 0.1 మిల్లీ సెకెన్స్ నుంచి 2 సెకెన్స్ ముందుగానే ఈ కో- లొకేషన్ ఫెసిలిటీ ఉపయెగించుకున్న బ్రోకర్స్ కి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ బ్రోకర్స్ సర్వర్స్ హ్యంగ్ కాకాండా ఎఫిషియంట్ గా పనిచేస్తాయి. దీని వల్ల బ్రోకర్స్ కస్టమర్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రేడ్స్ అమలు అవుతాయి. అయితే ఈ కో లొకేషన్ ఫెసిలిటీస్ లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ని ఉపయోగించి NSE లో అధికారులు, స్టాక్ బ్రోకర్స్ కలిసి స్కామ్ చేశారు. అది ఎలా చేసారో నెక్ట్స్ పార్ట్‌లో చూద్దాం..
what are data servers in NSE
ఎన్ ఎస్ ఈలో డేటా సెర్వర్స్ ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. స్టాక్ మార్కెట్‌లో జరిగే ఈ లక్షల ట్రేడ్లన్నింటినీ ప్రాసెస్ చేయడానికి ఈ డేటా సర్వర్స్ ఉపయోగపడతాయి. ఈ సర్వర్స్ ఎంత బాగా పనిచేస్తే కష్టమర్లు చేసే ట్రేడింగ్ అంత ఎఫిషియంట్ గా ఉంటుంది. అందుకే వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎన్ ఎస్ ఈలో మూడు డేటా సర్వర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన మూడు డేటా సర్వర్స్ ద్వారానే ఇక్కడ ఒక స్కాం చేయడానికి అవకాశం ఏర్పడింది. అది ఎలాగో చూద్దాం.
కో- లొకేషన్ అంటే..?
2010 ఆగష్టు లో NSEలో కో-లొకేషన్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టారు. అంటే NSE లో మూడు సర్వర్స్ ఉంటాయి. ఇందులో 1 సర్వర్ లో ఎక్కువ క్లౌడ్ ఉంటుంది. 2వ సర్వర్ లో తక్కువ క్లౌడ్ ఉంటుంది. 3వ సర్వర్ ను బ్యాకప్ కోసం మత్రమే ఉపయోగిస్తారు. ఈ మూడు సర్వర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రోకర్స్ కి వెళుతుంది. NSE కి, బ్రోకర్ సర్వర్ కి మధ్యలో లోడ్ బేలన్సర్ ఉంటుంది. దీని పని ఏమిటంటే NSE లో ఉన్న 3 సర్వర్స్ ని మోనిటర్ చేస్తూ సర్వర్ 1లో క్లౌడ్ ఎక్కువ ఉంటే సర్వర్ 2 కి, సర్వర్ 2లో క్లౌడ్ ఎక్కువ ఉంటే సర్వర్ 1 కి, ఈ రెండూ కాకపోతే సర్వర్ 3 కి డేటాను మర్చుతూ బ్రోకర్ సర్వర్ కి అనుసంధానిస్తుంది. కానీ ఈ లోడ్ బేలన్సర్ అనేది 2010లో NSE లో అమర్చలేదు.
story behind co location scam
స్కాం ఎలా జరిగిందంటే..?
ఎన్ ఎస్ ఈ లో కో- లొకేషన్ ఫెసిలిటీకి అవసరమైన లోడ్ బాలెన్సర్ అనేది ఏర్పాటు కాలేదు. దీంతో
సర్వర్ 1,2 లను నార్మల్ బ్రోకర్స్ కి అపాయింట్ చేసి బ్యాక్ అప్ సర్వర్ అయిన సర్వర్ 3 ని పూర్తిగా కో లొకేషన్ ఫెసిలిటీస్ పేరుతో కొంతమంది బ్రోకర్స్ కి అప్పగించారు. ఇలా ఇవ్వడం వల్ల సెర్వర్ 3 లో తక్కవ క్లౌడ్ ఉండడంతో ట్రేడర్స్ చేసే ఆర్డర్స్ అనేవి చాలా త్వరగా ప్లేస్ అయ్యేవి. అంటే సర్వర్ 1,2 ల కన్నా సర్వర్ 3 లోనే 30 నుంచి 60 సెకెన్ల ముందే స్టాక్ ప్రైస్ తెలుస్తుంది. కాబట్టి వాళ్లు త్వరగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎక్జిట్ అయిన తర్వాత సెర్వర్1,2లో ట్రేడ్స్ అనేవి ప్లేస్ అయ్యేవి. దీంతో సర్వర్ 3 ని హ్యాక్ చేసుకున్న వారు లాభాలు పొందగా, సెర్వర్ 1,2 లోని ట్రేడర్లు నష్టపోయేవారు. ఇలా వీళ్ళు 5 సంవత్సరాలు చేశారు. ఇలా కో- లొకేషన్ స్కామ్ ద్వారా NSE లో అధికారులు, బ్రోకర్స్ కలిపి పెద్ద కుంభకోణం చేశారు. ఇందులో చిన్న, చిన్న ఇన్వెస్టర్స్ నష్టపోయారు. OPG SECURITIS సంస్థ ఈ స్కామ్ లో ముఖ్యపాత్రను పోషించింది.
what is chitra ramakrishnan role in co location scam
ఇది `చిత్ర`మైన కథే..
ఈ స్కామ్ ను బయటపెట్టింది సుచిత్రా దలాల్. ఆ తర్వాత సీబీఐ వచ్చి చిత్రా రామకృష్ణన్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. చిత్రా రామకృష్ణన్ తన పర్సనల్ ఈ మెయిల్ ద్వారా NSE కి సంబంధించిన విషయాలను హిమాలయన్ బాబాకి చేరవేసేవారు. ఆ బాబా కూడా రిటర్న్ మెసేజ్ చేస్తూ NSE లో ఏమి చేయాలి.. ఎవరిని నియమించాలి అన్ని విషయాలను ఈమెతో పంచుకున్నారు. హిమాలయాన్ బాబా చెప్పడం ద్వారానే చిత్ర ప్రత్యేకంగా చీఫ్ అడ్వైజర్ అనే పోస్టును క్రియేట్ చేసి ఆనంద్ సుబ్రమణ్యమ్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. అంతటితో కాకుండా లక్ష రూపాయలు ఉన్న అతని జీతాన్ని ఒక్కసారిగా 14 లక్షలు చేసేశారు. ఆనంద్ సుబ్రమణ్యమ్ అనే వ్యక్తి NSE లో పనిచేస్తున్నారన్న విషయం హెచ్ ఆర్ రికార్డులో కూడా లేదు. ఇదంతా ఆమె హిమాలయన్ బాబా చెప్పడంతోనే చేసింది. అసలు ఈ హిమాలయన్ బాబా ఎవరూ అని ప్రశ్నించగా “అతను హిమలయాల్లో ఉంటారు.. నాకు అన్ని సలహాలు అతనే ఇస్తారు“ అని చిత్ర చెప్పడం ఆశ్చర్యకరం. హిమాలయాల్లో సిగ్నల్స్ ఉండవు కదా మరి ఆ బాబా ఎలా మెయిల్స్ రిటర్న్ చేస్తారు అని సీబీఐ ప్రశ్నించగా అతను శక్తిలున్న బాబా అని అన్నారు. ఇప్పటికీ సీబీఐకి ఆ బాబా ఎవరో తెలియలేదు.
అసలు అతను హిమలయన్ బాబా కాదు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు. ఒక ఆర్టికల్ లో వచ్చిన సమాచారం ప్రకారం 1996 నుంచి 2014 మధ్యలో 4 సార్లు చిదంబరం ఫైనాన్స్ మినిష్టర్ గా పనిచేశారు. కాబట్టి ఈయన NSE ని అనధికారంగా కంట్రోల్ చేసేవారని, బినామీల పేరిట చాలా బ్లాక్ డీల్స్, చిన్న, పెన్నీ స్టాక్స్ ని పెంచడం, తగ్గించడం ఇలాంటివి ట్రేడింగ్ చేసేవారని ఈ ఆర్టికల్ లో ఉంది. అంతేకాకుండా చిదంబరం చాలా స్కామ్స్ లో కూడా ఉన్నారు. ఇతను తమిళియన్ అందుకే ఇతనికి సహకరించడానికి NSE లో తమిళ వాళ్ళను ఎంచుకున్నారు. చిత్రా రామకృష్ణన్, ఆనంద్ సుబ్రమణ్యమ్ కూడా తమిళియన్స్ కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
Nice
thank you bro