
స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి కొన్ని వెబ్‌సైట్లు మనకు ఉపయోగపడతాయి. ఈ వెబ్‌సైట్లను ఫాలో కావడం వల్ల బేసిక్ ఇన్‌ఫర్మేషన్‌తో పాటు మార్కెట్ న్యూస్ కూడా తెలుస్తాయి. ఇప్పడు ఎన్నో వెబ్‌సెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిలో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.
సాధారణంగా వెబ్‌సైట్లు ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసేవి, ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చేవి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అందించేవీ ఇలా రకరకాలుగా ఉంటాయి.
మనీ కంట్రోల్. కాం.
మనకు బాగా తెలిసిన, చక్కని వెబ్‌సైట్ ఇది. అన్నింటిలోకెల్లా ది బెస్ట్‌గా దీనిని మనం చెప్పవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్న వెబ్ సైట్ ఇది. మనీ కంట్రోల్ యాప్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫండమెంటల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది.
ఇన్వెస్టింగ్ . కామ్ …
ఇన్వెస్టింగ్. కామ్ లో కూడా టెక్నికల్, ఫండమెంటల్, ఇన్ఫర్మేషన్ ఈ మూడూ వస్తాయి.
ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్స్ కి ఏవైనా స్టాక్స్ స్కానింగ్ చేయాలన్న లేదా వాటికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకోవాలన్నా కొన్ని రకాల వెబ్ సైట్స్ ఉన్నాయి.
చార్టింగ్, స్క్రీనర్, ఐచార్ట్… ఈ మూడు యూజర్స్ కు సులభంగా ఇన్ఫర్మేషన్ ను వెతుక్కోవడానికి ఉపయోగపడతాయి.
trading view website is about
ట్రేడింగి వ్యూ వెబ్‌సైట్
ప్రపంచంలో ఏ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయినా ఫ్రీ గా ప్రొవైడ్ చేస్తుంది ఈ వెబ్‌సైట్. ప్రీ గా టెక్నికల్ చార్ట్స్ వస్తాయి. ఎవరికైనా కొంచెం ప్రొగ్రామింగ్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు సొంతంగా దానిలో కోడింగ్ చేసుకుని సొంతంగా స్క్రీనర్స్ రాసుకోవచ్చు. అలాగే సొంతంగా ఇండికేటర్స్ ను తయారుచేసుకోవచ్చు.
ఇవేకాకుండా ఫండమెంటల్ గా చూసుకోవడానికి ట్రెండ్ లైన్, టిక్కర్ టేప్, మార్కెట్ మోజో అనే వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇవి ఫండమెంటల్స్ గా ఇన్ఫర్మేషన్ ను ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడతాయి.
మార్కెట్ పల్స్..
ఈ మొబైల్ యాప్ లో చార్ట్స్ గాని లేదా ఇండికేటర్స్‌ని ప్లెస్ చేసుకునే స్ట్రాటెజీ తో మొబైల్ యాప్ లో చూసుకోవచ్చు. టెక్నికల్ గా కావాలంటే కొన్ని వెబ్ సైట్స్, ఫండమెంటల్స్ కావాలంటే కొన్ని వెబ్ సైట్స్ ఉన్నాయి.కమోడిటీ ట్రేడింగ్ చేసేవాళ్ళకి ఈ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యం. ఆ డేటా మొత్తం ఇన్వెస్టింగ్ .కామ్ వెబ్ సైట్ లో వస్తూ ఉంటుంది.
స్టాక్ మార్కెట్‌లో ఉండాలంటే నాలెడ్జ చాలా అవసరం. ఇన్ఫర్మేషన్, న్యూస్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీటిని అందించే వెబ్‌సైట్లను తప్పక ఫాలో కావాలి. ఒక్కో వెబ్ సైట్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. పైన ఉన్న వెబ్ సైట్లను గుర్తుపెట్టుకుంటే ట్రేడర్స్ , ఇన్వెస్టర్స్ కి ఉపయోగం ఉంటుంది.