
which companies yield high dividends
సాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లకు డివిడెండ్లు వస్తాయన్న విషయం తెలిసిందే. అంటే కంపెనీ తనకు వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లకు పంచుతుంది. కొన్ని కంపెనీలు తమ లాభాల్లో అధిక మొత్తం డివిడెంట్లను ఇస్తాయి. అయితే ఏ ఏ కంపెనీలుడివిడెండ్‌ను ఇస్తాయి.. ఏ ఏ సమయాల్లోడివిడెండ్‌ను ఇస్తాయి అన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.
ఒక కంపెనీ ఆర్జించిన లాభాల్లో ఎంత భాగం డివిడెండ్‌గా ఇవ్వాలో అనేది ఆ కంపెనీల డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తుంది. ప్రతి కంపెనీకి డివిడెండ్ పాలసీ ఉంటుంది. కంపెనీలో వాటాదారులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ డివిడెండ్ అందుతుంది.
public sector companies are giving high dividends
ప్రభుత్వ సంస్థల్లోనే ఎక్కువగా..
* పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అధికంగా డివిడెండ్‌ను ఇస్తాయి. ఎనర్జీ సెక్టార్లో ఉన్న ఆయిల్ కంపెనీలు వీటిలో ముందు వరుసలో ఉంటాయి.
* మనకు ఎక్కువ డివిడెండ్ ఇచ్చే కంపెనీలు మన ఇండియాలో ఎనర్జీ స్టాక్స్.
REC: RURAL ELECTRICAL CORPARATION.
RFI: RURAL FINANCIAL CORPARATION.
HPCL, BPCL , IOC వంటి ప్రభుత్వ సంస్థలు ఖచ్చితంగా డివిడెంట్లను సంవత్సరానికి రెండు మూడు సార్లు అందిస్తాయి.
ITC, టీసీఎస్, ఐటీ సెక్టార్‌లో ఉన్న కంపెనీలు కూడా రెగ్యులర్‌గా ఏటా డివిడెండ్ ఇస్తాయి.
how we get regular income with dividends
డివిడెండ్తో రెగ్యులర్ ఇన్కం..
కంపెనీలు డివిడెండ్ ను ప్రతి సంవత్సరం ఇస్తాయి. మనం మార్కెట్ అస్థిరత కలిగి ఉన్నప్పుడు కొంటే మంచి డివిడెండ్ వస్తుంది. సాధారణంగా డివిడెండ్ ఇచ్చేది ఫేస్ వాల్యూ మీద.
దీన్ని డివిడెండ్ ఈల్డ్ రూపంలో మాట్లాడుతారు. డివిడెండ్ ఈల్డ్ అంటే సదరు సంస్థలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం మీద ఎంత వరకు రాబడి వచ్చిందనేది లెక్కించేందుకు డివిడెండ్ ఈల్డ్ ఉపయోగపడుతుంది. దీనినీ శాతాల్లో చూపిస్తారు. అధిక డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీ తన లాభాల్లో అధికబాగం డివిడెండ్ రూపంలో ఇస్తుంది. తక్కువ ధరలో ఉండి ఎక్కువ డివిడెండ్ ఇచ్చిన కంపెనీలను కొంటే మంచిది.
స్టాక్ మార్కెట్‌లో రెగ్యులర్ గా ఇలాంటి ఇన్కం రావాలంటే ఈ డివిడెండ్ ఇచ్చే కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం చక్కని అవకాశం. ఎందుకంటే మార్కెట్లో వోలాటిలిటీతో సంబంధం లేదు.
* ఈ డివిడెండ్‌ను ఏ కంపెనీలు ఇస్తాయి.. ఎప్పుడు ఇస్తాయి.. ఎంతెంత ఇస్తాయి.. అనే విషయాలను మనీకంట్రోల్ లాంటి వెబ్‌సెట్లలోకి వెళ్లి చూస్తే ముందుగానే తెలుసుకుని ఇన్వెస్ట్ చేయవచ్చు.