
stock market is profitable or not
స్టాక్ మార్కెట్లో అధిక లాభాలను పొందాలనే అందరూ ప్రయత్నిస్తారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. మనం చేసే వర్క్, మన ఆలోచన విధానం అన్నీ ఇందుకు కారణం అవుతాయి. ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ట్రేడింగ్‌లో, ఇన్వెస్ట్ మెంట్‌లో మనకు నప్పే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. కానీ ఏదైనా ఫైనల్ గా లాభాలు పొందడమే ఇక్కడ లక్ష్యం. కానీ ట్రేడర్లకి ఇన్వెస్టర్లకి లాభాల్లో తేడాలుంటాయి. ఏది లాభదాయకమో ఓ సారి చూద్దాం.
dont aim for temporary profits in stock market
టెంపరరీ లాభం కన్నా…
స్టాక్ మార్కెట్లో టెక్నికల్ గా ఉండేవాళ్ళ కంటే ఫండమెంటల్ గా ఉండేవాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తి మార్కెట్ కి వెళ్ళి కొన్ని సరుకులు కొని వాటిని కొన్న ధర కంటే 10 శాతం పెంచి ఇతరులకు అమ్మాడనుకుందాం. ఈ విధంగా చేసిన దానిని టెంపరరీ ఇన్ కమ్ అంటారు.
టెక్నికల్ గా స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళది టెంపరరీ ఇన్ కమ్ అని అనవచ్చు.
పర్మినెంట్ ఇన్కం అంటే ఫండమెంటల్ గా ఏ స్టాక్ అయితే బలంగా ఉందో అందులో ట్రేడింగ్ చేసేవాళ్ళది పర్మినెంట్ ఇన్కంగా చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు ఒకప్పుడు 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్న ఎస్బీఐ షేర్ ఇప్పుడు రూపాయి ఫేస్ వాల్యూకు వచ్చింది. ఈ 100 రూపాయలు ఫేస్ వాల్యూ ఉన్నప్పుడు 100 రూపాయలకే ఇచ్చారు. ఇప్పుడు రూపాయి ఫేస్ వాల్యూ షేర్ ధర సుమారు 500 రూపాయలు. అంటే ఎంతగా పెరిగిందో మనం లెక్కపెట్టుకోవచ్చు.
how much returns came if we invest in infosys ipo
ఇవన్నీ అద్భుతాలే..
*1993లో ఇన్ఫోసిస్ ఐపీవోకు వచ్చినప్పడు షేరు ధర 95 రూపాయలు. 1993లో పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పడు ఆ షేర్ల విలువ 17 కోట్ల రూపాయలు అయి ఉంటుంది. ఇందులో వచ్చే బోనస్ లు, స్టాక్ స్ల్పిట్‌లు, డివిడెండ్లతో ఈ విలువ సాధ్యమైంది. ఇక్కడ దాగి ఉన్న ఒకే ఒక్క మంత్రం దీర్ఘకాలం వేచి ఉండడం. అంటే అన్నికంపెనీ స్టాక్‌లలోనూ ఇలాగే జరుగుతుందా అంటే చెప్పలేం. కానీ మంచి కంపెనీని ఎంచుకుని ఇన్వెస్ట్ చేసినప్పడు ఇలాంటి అద్భుతాలను వేచి ఉంటేనే చూడగలం.
* ఇలాంటి అద్భుతమే టైటాన్ కంపెనీలో జరిగింది. దీనికి సాక్ష్యం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసి వేల కోట్లు గడించి ఇండియన్ బుల్ మార్కెట్ కింగ్ అయ్యారు రాకేష్.
ఇప్పడు అమాంతం పెరిగి విపరీతంగా లాభాలను ఇస్తున్న కంపెనీలన్నీ ఒకప్పడు తక్కవ ధరలో స్టార్ట్ అయినవే. వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేసి వేచి ఉన్నవాళ్లంతా ఇప్పుడు సక్సెస్ బాట పట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ట్రేడింగ్‌లో లాభాలు వేరేగా ఉంటాయి. ప్రతి క్షణం అలెర్ట్‌గా ఉండేవాళ్లు, నాలెడ్జ్ ఉన్న వాళ్లు, రిస్క్ చేసే వాళ్లు మాత్రమే ఇంట్రాడేలో రాణించగలుగుతారు.