
స్టాక్ మార్కెట్ ట్రేడర్స్‌కి స్టాప్‌లాస్ అనేది చాలా అవసరం. మనం కొన్న ఒక స్టాక్ ఎంతవరకు పెరుగుతుందో, ఎంత వరకు తగ్గుతుందో చెప్పలేం. అందుకే కొన్ని నిబంధనలు పాటించాలి. అందులో మొదటిది తప్పనిసరిగా పాటించాల్సింది స్టాప్ లాస్. ఒక ట్రేడ్‌ని తీసుకునే ముందే అది ఇంతకన్నా తగ్గితే దానిని అమ్మేయాలని ముందే నిర్ణయించుకోవాలి. అలా తీసుకున్న నిర్ణయమే స్టాప్ లాస్. అలా పెట్టుకోకపోతే ఆ స్టాక్ ధర అలా అలా తగ్గుతూ పోతుంటే మనం నష్టపోవాల్సి వస్తుంది.
what are the uses of stoploss
స్టాప్ లాస్ అంటే తన నష్టాలను అరికట్టడానికి పెట్టుబడిదారులు ఉపయోగించే ఒక పద్ధతి. ఇది ముందుగా నిర్ణయించిన ధరకు ఒక సెక్యూరిటీ చేరుకున్న వెంటనే దానిని విక్రయించడానికి పెట్టుబడిదారు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. కొనుగోలుదారులు కూడా ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
మనం ఏదైనా ఇంట్రడే ట్రేడింగ్ కోసం అనుకున్నపుడు మనం చేయవలిసినది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వగానే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అయితే ఎంత దూరంలో పెడితే బాగుంటుందనేది మనం స్టడీ చేయాలి. మార్కెట్ లో మొత్తం స్టాక్ వాల్యూ చూసుకుంటే ఆ స్టాక్ మూమెంట్‌ని బట్టి స్టాప్‌లాస్ అనేది పెట్టుకోవాలి. ఎక్కువమంది ATR (AVAREGE TRUE RANGE) వాడుతారు. ఎవరైనా ఇంట్రాడే చేసినవాళ్ళు తప్పకుండా సెల్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడం నేర్చుకోవాలి.
what is GTT in stock trading
డెలివరీలో ట్రేడింగ్ చేసే వాళ్లు అనుక్షణం సిస్టమ్ ముందు ఉండకపోవచ్చు. అలాంటివాళ్ళకు GTT ( GOOD TILL TRIGGER) ఆ ఆర్డర్ మనం తీసుకుంటే లాస్ ఎక్కడ వస్తే స్టాక్స్ అమ్మవచ్చు లేదా లాభం ఎక్కడ వస్తే అమ్మవచ్చు అని మనం ఆర్డర్ ఇవ్వవచ్చు. దీనినే GTT అంటారు. ఈ ఆర్డర్ వ్యాలిడిటీ 1 సంవత్సరం ఉంటుంది. మనం సూపర్ ట్రెండ్ అప్లై చేసుకోవచ్చు. సూపర్ ట్రెండ్ అనేది ఒక ఇండికేటర్. సూపర్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనం మార్కెట్ నుంచి లెప్ట్ అయిపోవచ్చు.