which mutual funds generate good returns
మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేముందు ఇవి కూడా రిస్క్ తో కూడుకున్నవి అన్న విషయం గుర్తించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో సరైన ఫలితాన్ని పొందాలనుకున్నవాళ్ళు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. తక్కువకాలం ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నష్టపోతారు.
ఇప్పుటి వరకు మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ను ఓసారి చూద్దాం. 2022 లోనూ అవి ఎలా ఫెర్పార్మ్ చేస్తాయో పరిశీలిద్దాం.
NIFTY NEXT FIFTY…
* NIFTY NEXT FIFTY లోని షేర్లలో మాత్రమే పెట్టుబడి పెట్టేటువంటి మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫండ్స్ ను NIFTY NEXT FIFTY ఇండెక్స్ ఫండ్స్ అంటారు.
* భవిష్యత్తులో NIFTY NEXT FIFTY లో షేర్లు నిప్టీ ఫిప్టీలోకి ఏరోజైనా వచ్చే అవకాశాలు ఎక్కవు. ఇవి త్వరలో బ్లూచిప్ గా కన్వెర్ట్ అయ్యే అవకాశం ఉన్న షేర్లు.
NIFTY NEXT FIFTY ఇండెక్స్ ఫండ్స్ లో మనం UTI Nifty Next Fifty Index fund, SBI Nifty Next Fifty Index fund ను పరిశీలించవచ్చు. ఇవి గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే మంచి రిటర్న్స్ అందించాయి. ఇవి ఏవరేజ్ గా 15 శాతానికి తగ్గకుండా లాభాలు ఇచ్చాయి.
BLUE CHIP EMERGING FUND
మార్కెట్ లో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన పెద్ద పెద్ద కంపెనీలను బ్లూచిప్ కంపెనీలు అంటారు. ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేవే బ్లూచిప్ ఫండ్స్. బ్లూచిప్ ఎమర్జింగ్ ఫండ్ పేరుతో Mirae asset మ్యూచువల్ ఫండ్ కంపెనీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చింది. వీటితో పాటు ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్స్ లో ఐసీఐసీఐ బ్లూచిప్ ఫండ్, ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి.
లార్జ్ క్యాప్ ఫండ్స్ తో పోల్చినపుడు Nifty Next Fifty Index fund ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని మనం గమనించాలి. వీటిని దృష్టిలో ఉంచుకుని 10-15 సంవత్సరాల కాలవ్యవధిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుబడిదారులు Nifty Next Fifty Index fund లో blue chip emerging fund లో పెట్టుబడి పెట్టే విషయాలను పరిశీలించవచ్చు.
ప్రత్యక్షంగా చేయాలంటే..
మనమే నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టాలనుకున్నపుడు ఇన్వెస్టర్ చిన్న రీసెర్చ్ చేయవచ్చు.
అదేమిటంటే ఒక ఫండ్ లోకి వెళ్ళి ఆ ఫండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. గత 10 సంవత్సరాలుగా ఎంత రిటర్న్స్ ఇచ్చింది. ఇవన్నీ చూసుకుని ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినటువంటి 10 ఫండ్స్ ను తీసుకుని ఆ 10 ఫండ్స్ ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాయో పరిశీలించి 50 స్టాక్స్ తో ఓ లిస్ట్ తయారు చేసుకోవచ్చు.
ఆ లిస్టులో 2022 లో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చే రంగాలు చూసుకుని ఆ రంగాల స్టాక్‌లలో క్రమం తప్పకుండా ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తే అక్కడ కూడా మ్యూచువల్ ఫండ్‌లో వలే మంచి లాభాలు పొందవచ్చు. ఈ విధంగా మనం సొంతంగా ఓ పోర్ట్ ఫోలియోను తయారు చేసుకోవచ్చు.