
what is the new rule on loan repayments
రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ పై ఈఎమ్ఐల భారం పెరగనుంది. మనకి వడ్డీ రేట్లు పెరిగితే ప్రతి నెలా దానికి తగ్గట్టుగా ఈఎమ్ఐ కట్టాలి. మనం ఏ లోన్ తీసుకున్నా సరే ఆర్బీఐ పెంచిన వడ్డీ రేట్లు మనపై వేస్తారు. మనం హౌసింగ్ లోన్ తీసుకున్నపుడు, మనం తీసుకున్న లోన్ ఆర్బీఐ పెంచిన వడ్డీరేటు కలిపి కట్టాలి. మన దగ్గర డబ్బు లు ఎక్కువగా ఉన్నపుడు మనం కడితే కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హౌసింగ్ లోన్స్ 6.85 శాతం వడ్డీతో ఉన్నాయి. రానున్న సంవత్సరం ఈ వడ్డీరేటు 7.85 వరకు వెళ్తుంది. రుణ గ్రహీలపై ఇది తీవ్ర భారం కానుంది.
how rbi interest rates will effect the EMIs
రుణగ్రహీలకు కష్టమే..
గృహరుణాలపై వడ్డీ రేట్లు పెరిగాయి. వెహికల్, వ్యక్తిగత రుణాల ఈఎమ్ఐ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనీ డిపాజిట్ చేస్తామనుకున్న వారికి ఇది మంచి వార్తే. కానీ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న వారికి వడ్డీ ఎక్కువ పడుతుంది. ఇన్‌ఫ్లేషన్ తగ్గించాలంటే బ్యాంక్ లోన్స్ ఇవ్వడం తగ్గించాలి. బ్యాంక్స్ వడ్డీలు పెరగడం వలన సిస్టమ్ లో లిక్విడిటీ తగ్గుతుంది. దీనివల్ల డిమాండ్ కొంత తగ్గుతుంది. ముందు ముందు కూడా ఈ సంవత్సరంలో 2,3 సార్లు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల రేట్లు పెరిగాయి. ఇప్పుడు కొత్తగా ఇళ్ళు కొనేవారు ఇక నుంచి ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, రానున్న రోజుల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లను దృష్టిలో పెట్టుకుని ఫైనాన్స్ మేనేజ్ మెంట్ ను ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించాలి. ఖర్చు తప్పదు అనుకునప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచించాలి.
ఇప్పుడు ఎర్నింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్ మెంట్ పై కొంత ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీలో అందరూ వర్క్ చేసి ఇన్ కమ్ పెంచుకుంటే తద్వారా సేవింగ్ చేస్తే అన్ని కంట్రోల్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇప్పటికే కడుతున్న వారికి కూడా పెంచుతారా ఏమిటి?
thappadu