how much tax on stock market profits
ట్యాక్స్ అనేది మనకు అత్యంత సాధారణమైన విషయం. దీని నుంచి మనం ఎవ్వరూ తప్పించుకోలేం. మనకు వచ్చే ఆదాయంలో అన్నింటికీ ట్యాక్స్ కడతాం. అదే విధంగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ లాభాలు పొందితే ట్యాక్స్ కట్టి తీరాల్సిందే. సాధారణంగా స్టాక్ మార్కెట్ లో ట్యాక్స్ సేవర్స్ రెండు రకాలు ఉంటాయి.
1. షార్ట్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్
2. లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్
what is short term capital gain
షార్ట్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్..
మనం ఏదైనా ట్రేడ్ ను 1 సంవత్సరంలోపు ముగిస్తే దానిని షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. ఈ విభాగంలో స్టాక్స్ పై వచ్చే ఆదాయం మీద 15 శాతం ట్యాక్స్ కట్టవలిసి ఉంటుంది. ఈటీఎఫ్, ఇండెక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ లో డెలివరీ బేస్ ట్రేడ్స్ మీద ట్యాక్స్ 15 శాతం ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ లో ఏ ప్రొడక్ట్ చేసినా ట్యాక్స్ 15-30 శాతం వరకు ఉంటుంది. ట్యాక్స్ సేవ్ కాన్సెప్ట్ ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. అంటే మనం కొనడం, అమ్మడం పూర్తయిన తర్వాత మనకి వచ్చే ప్రాఫిట్ లో ముందు జరిగిన నష్టాన్ని తీసేస్తే వచ్చే క్యాపిటల్ కి మాత్రమే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని సూచనలను మనకి సంబంధించిన చార్టెడ్ అకౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా ట్యాక్స్ సంబంధించి మార్చి 31 లోపు పూర్తి చెయ్యాలి.
what is long term capital gain
లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్ ట్యాక్స్
మనం ఏదైనా ట్రేడ్ ను సంవత్సరం తర్వాత ముగిస్తే దానిని లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. మొదటి లక్ష వరకు ట్యాక్స్ పే చేయాల్సినవసరం లేదు. లక్ష దాటితే 10 శాతం వరకు ట్యాక్స్ పే చేయాలి. ఏదైనా ట్యాక్స్ సేవింగ్ కోసం ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి పైన ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తద్వారా ప్రతి ఒక్కరికీ లక్ష వరకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. ఒక వేళ నిరుద్యోగి అయితే ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో క్రెడిట్ కార్డు, హౌసింగ్ లోన్స్ కావాలంటే బ్యాంకు అధికారులు 3 సంవత్సరాల ఐటీ రిటర్న్స్ అడుగుతారు. మ్యూచువల్ ఫండ్స్ లో, మొత్తం ఆదాయంలో 2.5 లక్షలు దాటితే కూడా ట్యాక్స్ సేవ్ చెయ్యాలి అనుకుంటే సెక్షన్ 80సీ, 80డీని వాడుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో ELSS అనే ఒక కేటగిరి ఉంది. దీనిని నుంచి మరొక 1.5 లక్ష వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ సేవర్ లో మ్యూచునల్ ఫండ్స్ బెస్ట్ కేటగిరి.