
portfolio of radhakishan damani
ఇండియాలోని సక్సెస్ ఫుల్ ఇన్వెస్టర్లలో రాధాకృష్ణ దమానీ ఒకరు. డీ మార్ట్ ను స్థాపించి కుబేరుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పోర్ట్‌ఫోలియో ఉన్న స్టాక్స్ గురించి ఓసారి తెలుసుకుందాం
who is radhakishan damani
ఇతనే దమానీ..
రాధాకిషన్ దమానీ ఒక భారతీయ బిలియనీర్, పెట్టుబడిదారుడు, వ్యాపారవేత్త, డీ – మార్ట్ వ్యవస్థాపకుడు. 19 ఆగస్టు 2021న, బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ద్వారా అతను ప్రపంచంలోనే 98 అత్యంత సంపన్న వ్యక్తి గా గుర్తింపు పొందాడు. దమానీ ముంబైలో సింగిల్ రూమ్ అపార్ట్ మెంట్ లో మర్వాడీ కుటుంబంలో పెరిగారు. అతను ముంబై విశ్వవిద్యాలయంలో కామర్స్ లో చేరి సంవత్సరం తర్వాత చదువు మానేశాడు. తర్వాత స్టాక్ మార్కెట్ బ్రోకర్, ఇన్వెస్టర్ గా మారాడు. 1990 లలో షార్ట్ సెల్లింగ్ స్టాక్స్ ద్వారా లాభాలను ఆర్జించాడు. HDFC బ్యాంక్ 1995లో పబ్లిక్ గా మారిన తర్వాత దమానీ అతి పెద్ద వాటాదారుని పేరుపొందారు. 1999లో అతను నేరుల్ లో అప్నా బజార్, ఒక సహకార డిపార్ట్మెంట్ స్టోర్స్ ప్రాంచైజీని నిర్వహించాడు. 2000లో అతను డీమార్ట్ ను ప్రారంభించడానికి స్టాక్ మార్కెట్ ను విడిచిపెట్టారు. 2002లో మొదటి దుకాణాలను స్థాపించి 2010 నాటికి 25 దుకాణాలకు చేరాడు. తర్వాత ఈ కంపెనీ 2017లో పబ్లిక్ గా మారింది. ఇప్పుడు అతనికి భారతదేశం అంతటా 234 డీమార్ట్ స్టోర్ లు ఉన్నాయి. 2020లో అతను $ 16.5 బిలియన్ల నికర విలువతో 4వ ధనవంతుడు అయ్యాడు. దమానీ అనేక రకాల కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నాడు. ఆంధ్ర పేపర్ లో 1 శాతం వాటాను కైవసం చేసుకున్నాడు.
best stocks in damani portfolio
ఇదీ పోర్ట్ ఫోలియో..
దమానీ పెట్టుబడి పోర్ట్ ఫోలియోలో కొన్ని చక్కని లాభదాయకమైన స్టాక్‌లు ఉన్నాయి. అందులో ది బెస్ట్ స్టాక్ లను ఇప్పడు పరిశీలిద్దాం.
* TV 18 BROADCOST
* Jubiliant Food
* Blue dart express
* 3M India
* Sundaram Finance Holding
* Andhra paper
* Astra Microwave
రాధాకిషన్ దమానీ కంపెనీలో ఎక్కువ శాతం లాభాలు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మనం బిలీనియర్లయిన కొంతమంది పోర్ట్ ఫోలియోను తెలుసుకుని అందులో లాభాల్లో ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనమూ లాభాలను పొందవచ్చు.