పెరుగుతున్న రిటైల్ వాటా

how much percentage of retial investors india

చిన్న చిన్న మొత్తాల‌తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసే వారిని రిటైల్ ఇన్వెస్ట‌ర్లు అంటాం. భారీ మొత్తాల‌తో ట్రేడింగ్ చేసే వారు, అధిక మొత్తాల‌ను ఇన్వెస్ట్ చేసే బ‌డా ఇన్వెస్ట‌ర్ల సాధార‌ణంగా మార్కెట్ ను శాసిస్తుంటారు. ఇప్ప‌డు చిన్న మ‌దుప‌రులు కూడా క్ర‌మంగా వారి వాటా పెంచుకుంటూ మార్కెట్‌ను ప‌రుగులెత్తిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లో చిన్న మదుపర్ల హవా పెరిగింది. ఎన్ఎస్ఈ కంపెనీల్లో రికార్డు గరిష్ఠాలకు వీరి వాటాలు చేరుతున్నాయి. సంప్ర‌దాయ పొదుపు పద్ధ‌తుల‌కు స్వ‌స్తి ప‌లుకుతూ స్టాక్ మార్కెట్‌ల వైపు దృష్టి మళ్లిస్తుండ‌డంతో ఇలాంటి రికార్డులు సాధ్య‌మ‌వుతున్నాయి.

more retial investors in 2021

చిన్న మ‌దుప‌రులు త‌క్కువ త‌క్కువ పెట్టుబడులు పెడుతూ లాభాల బాట ప‌డుతున్నారు. కరోనా కేసులు పెరిగినా..  అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలకు మారుతున్నా మార్కెట్లో పెట్టుబడులకు చిన్న మదుపరులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2021 చివరి త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఎన్ఎస్ఈ నమోదిత కంపెనీల్లో రిటైల్ మదుపరుల వాటా 7.32 శాతానికి చేరిందని ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వెల్లడిస్తోంది.

విలువ పరంగా కూడా ఎన్ఎస్ఈ కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా విలువ 2021 డిసెంబర్ త్రైమాసికం చివరకు రూ.18.98 లక్షల కోట్లకు చేరింది.ఇది కూడాగరిష్ఠ స్థాయిలో రికార్డు సాదించింది.

retail investors are getting more profits

అలా ఎలా..!
మార్కెట్లో దిద్దుబాట్లను ట్రేడింగ్ కు అవకాశంగా చిన్న పెట్టుబడుదారులు భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. వీరంద‌రికీ తెలిసిన ప్రాథ‌మిక సూత్రం త‌క్కువ‌లో కొని ఎక్కువ‌లో అమ్మ‌డం. ఇదే ఇక్క‌డ ఫాలో అవుతున్నారు. 2021 ఆఖరి నెలల్లో మార్కెట్లో బలహీనతలు కనిపించగానే, చిన్నమదుపరులు డబ్బులతో మార్కెట్లోకి వచ్చారని చెబుతున్నారు. కొవిడ్ పరిణామాల తరవాత షేర్లు ఎక్కువ ప్రతిఫలాలను ఇస్తుండడంతో, ధర తగ్గినపుడల్లా కొనుగోలు చేయడానికి చిన్న మదుపరులు అలవాటుపడ్డారని విశ్లేషిస్తున్నారు. డిసెంబరు త్రైమాసికంలో సెన్సెక్స్, నిప్టీలు 1.5 శాతం వరకు తగ్గాయి. అయితే డిసెంబరు త్రైమాసికంలో1.023 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఆరంభం కావడం, రిటైల్ మదుపరుల జోరును తెలుపుతుంది. సగటున నెలకు 34 లక్షల డీమ్యాట్లను పెట్టుబడుదారులు ప్రారంభించారు. సెప్టెంబరు త్రైమాసికం మొత్తం మీద 82 లక్షల డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2021 సంవత్సరంలో కొత్తగా 3.08 కోట్ల మంది ఖాతాలు తెరవడంతో, దేశంమొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8.06 కోట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

రిటైల‌ర్ల దూకుడు..
మొత్తం మీద చూస్తే ఎన్ఎస్ఈలోని 871 కంపెనీల్లో రిటైల్ మదుపర్లు తమ వాటా పెంచుకున్నారు. 759 కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా తగ్గినా, ఆ కంపెనీల సగటు షేరు ధర 20.35 శాతం పెరిగింది. సాధారణంగా సంస్థాగత మదుపర్ల దూరంగా ఉండే మధ్య చిన్నస్థాయి కంపెనీల షేర్లలో రిటైల్ మదుపర్లు పెట్టుబడులు పెడుతున్నారు. నిఫ్టీ కంపెనీల్లో రిటైల్ మదుపర్ల వాటా 7.08 శాతం, ఎన్ఎస్ఈ 100 కంపెనీల్లో 6.68 శాతం ఉండడం గమనార్హం.

రూ. 2 లక్షల కంటే ఎక్కువ వాటా పెట్టే లేదా అధిక నికర విలువ(హెచ్ఎన్ఐ) గల వ్యక్తుల వాటా కూడా డిసెంబరు త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 2.26 శాతానికి చేరింది. 2020 ఇదే సమయంలో ఎన్ఎస్ఈలోని నమోదు చేసిన కంపెనీల్లో వీరి వాటా 2 శాతంగానే ఉంది. దీంతో రిటైల్, హెచ్ఎన్ఐల మొత్తం వాటా 9.58 శాతానికి చేరినట్లయింది. 2021 అక్టోబరు-డిసెంబరులో విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు మాత్రం రూ.38,521 కోట్ల వరకు నికర అమ్మకాలు జరపడంతో వీరి వాటా తొమ్మిదేళ్ల‌ కనిష్టానికి చేరింది.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *