what is the story behind the name of air india
ఇటీవల భారత ప్రభుత్వం నుంచి టాటాలు సొంతం చేసుకున్న ఎయిరిండియా కంపెనీ కథ మనందరికీ తెలిసిందే. ఎక్కడ మొదలైందో అక్కడికే ఎయిరిండియా ఎగిరొచ్చి పడింది. అయితే ఈ పేరు వెనుక కొంత ఆసక్తి కర చర్చ జరగిందని ఇటీవల టాటా సంస్థ వెళ్లడించింది.
1932లో టాటాలు ఇండియాలో విమానయాన సర్వీసులు ప్రారంభించారు. ప్రపంచంలోనే ఇంకా విమానం పూర్తిగా తెలియని రోజుల్లో బ్రిటిష్ భారతంలోనే జేఆర్‌డీ టాటా కరాచీ- బోంబే మధ్య మొదటి విమాన సర్వీసు నడిపారు. అలా మొదలైన విమాన సర్వీసులను టాటా సన్స్ కంపెనీ నుంచి విడిదీసి వేరే ప్రత్యేక కంపెనీగా నడిపేందుకు టాటా గ్రూపు నిర్ణయించింది. అప్పడు ఏం పేరు పెట్టాలా అని తర్జన భర్జన పడ్డారట.
who decided the name of airindia
1946లో ప్రత్యేక కంపెనీగా విమానసేవలను చేసేందుకు టాటా ప్రయత్నించింది. అందుకోసం కొత్త పేరు వెదుకులాట ప్రారంభించింది. బాంబే హౌస్ లో టాటా సంస్థ ఉద్యోగులకు పోల్ నిర్వహించింది. పోలింగ్ మొదటి రౌండ్ లో ఎయిర్ ఇండియాకు, ఇండియన్ ఎయిర్ లైన్స్ కు, పాన్ ఇండియన్ ఎయిర్ లైన్స్, ట్రాన్స్ ఇండియన్ ఎయిర్ లైన్స్ పేర్లపై పోల్ పెట్టారు. చివరిగా నిర్వహించిన కౌంటింగ్ లో ఎయిర్ ఇండియా పేరుకు అత్యధికంగా ఓట్లు రావడంతో ఆపేరునే కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానయాన కంపెనీకి పెట్టాలని టాటా యాజమాన్యం నిర్ణయించింది.
how tata`s owned air india
ఇదంతా ఒక ఎత్తు అయితే సుమారు 75 ఏళ్ళ తరువాత ఎయిర్ ఇండియాను తిరిగి తన సొంతం చేస్తున్న టాటాలు తాము ప్రయాణికులు ఇచ్చే గౌరవాన్ని, ప్రాముఖ్యతను మళ్ళీ నిరూపించుకున్నారు. ఎయిర్ ఇండియాను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ…టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా స్వయంగా ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్న వారందరినీ ఆహ్వానిస్తూ ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చారు. ఇది ప్రయాణికులకు మరింత ఆకట్టుకుంది.