గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు(Falling Silver and Gold Prices) ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత జరిగిన భారీ అమ్మకాలు ఈ పతనానికి ప్రధాన కారణంగా మారాయి. తక్కువ ధరల్లో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు, గరిష్ట స్థాయిల వద్ద లాభాలు బుక్ చేసుకోవడంతో మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. దేశీయ విపణిలో గురువారం బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి ధరల్లో నమోదైన భారీ పతనం మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు రూ.30 వేల మేర తగ్గి రూ.2,69,000కు చేరింది. ఇది ఇటీవలి కాలంలోనే కాదు… దశాబ్దాల చరిత్రలోనే అరుదైన పతనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పసిడి కూడా తగ్గుముఖం.. Gold Prices Ease
వెండి వెంట బంగారం ధర (Falling Silver and Gold Prices)కూడా కాస్త దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.6,600 తగ్గి రూ.1,59,680గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,550 వద్ద కొనసాగుతోంది. గత వారం రోజుల క్రితం వరకూ రికార్డు గరిష్టాలను తాకిన పసిడి ఇప్పుడు స్పష్టమైన కరెక్షన్ దశలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. Global Markets Add Pressure
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు(Falling Silver and Gold Prices) కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,919 డాలర్ల వద్ద, ఔన్సు వెండి ధర 79 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి డెలివరీ వెండి కాంట్రాక్టులు దాదాపు 7 శాతం కుంగి కిలో రూ.2.49 లక్షల స్థాయికి చేరాయి. అదే సమయంలో ఏప్రిల్ డెలివరీలకు పసిడి ధర స్వల్పంగా పెరిగి 10 గ్రాములకు రూ.1.53 లక్షల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో అమెరికాలో డాలర్ బలం పెరగడం కూడా లోహాల ధరలపై ప్రభావం చూపింది. ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ నియామకంపై వార్తలతో డాలర్ బలపడటంతో, బంగారం వంటి విలువైన లోహాలపై అమ్మకాలు పెరిగాయి. మరోవైపు బడ్జెట్ 2026లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచకుండా 6 శాతం వద్దే కొనసాగించడం కూడా మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చి, ధరలు దిగివచ్చేందుకు దోహదపడింది.
గణాంకాలే చెబుతున్న పతనం తీవ్రత .. Numbers Tell the Story
గత వారం వరకు తులం బంగారం ధర రూ.1.80 లక్షల సమీపాన్ని తాకగా, ఇప్పుడు అది రూ.1.50 లక్షల దిగువకు పడిపోయింది. వెండి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కిలో రూ.4.20 లక్షల నుంచి నేరుగా రూ.3 లక్షల స్థాయికి చేరింది. అంటే దాదాపు 30 శాతం కంటే ఎక్కువ పతనం. 1980 తర్వాత ఒకే రోజులో ఇంతటి భారీ పతనం ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పుడు కొనాలా.. ఆగాలా? Buy Now or Wait
ధరలు(Falling Silver and Gold Prices) భారీగా పడిపోవడంతో సామాన్య కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో ఒక్కటే ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడే కొనాలా? లేక ఇంకా తగ్గుతాయా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పతనం ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమే. దీర్ఘకాలికంగా చూస్తే బంగారం, వెండిపై డిమాండ్ తగ్గే అవకాశమే లేదని వారు చెబుతున్నారు. ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి పెట్టకుండా, అంచెలంచెలుగా కొనుగోలు చేయడం సురక్షితమని సూచిస్తున్నారు. దేశీయ మార్కెట్లో బంగారానికి రూ.1.40 లక్షల నుంచి రూ.1.45 లక్షల మధ్య బలమైన మద్దతు ఉందని, వెండి ధర రూ.2.90 లక్షల వద్ద స్థిరపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నిపుణుల మాట.. Expert Opinion
ప్రముఖ కమొడిటీ నిపుణుల అభిప్రాయం ప్రకారం గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు (Falling Silver and Gold Prices)అత్యంత వేగంగా పెరగడం వల్ల ఈ కరెక్షన్ అనివార్యమైంది. ఆనంద్ రాతి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ విశ్లేషకులు ఇది ఒక ‘ఓవర్‌స్పీడ్ ర్యాలీ’కి వచ్చిన బ్రేక్ మాత్రమేనని చెబుతున్నారు. దీర్ఘకాలంలో ధరలు మళ్లీ పుంజుకుంటాయని వారు అంచనా వేస్తున్నారు.
సామాన్యులకు అవకాశం.. Opportunity for Buyers
భారతీయ కుటుంబాల్లో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు… ఒక ఆర్థిక భద్రత కూడా. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల తగ్గుదల సామాన్యులకు ఒక మంచి అవకాశం. అయితే మార్కెట్ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నందున, షార్ట్ టర్మ్ ట్రేడర్లు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే… వెండి ఒక్క రోజులో షాక్ ఇచ్చినా, దీర్ఘకాలికంగా బంగారం, వెండిపై నమ్మకం ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం కనిపిస్తున్న పతనం భయపడాల్సిన సంకేతం కాదని, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే ఇదే అవకాశంగా మారుతుందని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
వెండిపై చూపు.. (Silver Investment Outlook)
బంగారం రికార్డు స్థాయిల్లో ఉన్న వేళ… వెండి ధరలు కొంత దిగివచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు వెండిపై పడుతోంది. ముఖ్యంగా ఫిజికల్ సిల్వర్ కంటే, సులభం, భద్రత కలిగిన పెట్టుబడిగా Silver ETFలు ఆకర్షిస్తున్నాయి. కానీ ఏ ఎస్ఈఎఫ్ అయినా సరే పెట్టేస్తే సరిపోదు. సరైనదాన్ని ఎంచుకోవాలంటే కొన్ని మూల సూత్రాలు తెలుసుకోవాల్సిందే.
సిల్వర్ ETF అంటే ఏమిటి? (What is a Silver ETF?)
సిల్వర్ ETF అనేది వెండి ధరను అనుసరిస్తూ ట్రేడయ్యే మ్యూచువల్ ఫండ్ తరహా పెట్టుబడి. షేర్ మార్కెట్లో షేర్లలా కొనుగోలు–అమ్మకాలు చేయొచ్చు. వెండిని భౌతికంగా నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా, ధరల పెరుగుదల నుంచి లాభపడే అవకాశం ఇది.
సరైన Silver ETFని ఎంచుకోవడానికి 3 కీలక సూత్రాలు (3 Key Rules to Choose the Right Silver ETF)
ఖర్చు నిష్పత్తి (Expense Ratio): ఏ ETF అయినా నిర్వహణ కోసం కొంత ఫీజు వసూలు చేస్తుంది. దీనినే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఇది తక్కువగా ఉంటే, మీ లాభం ఎక్కువగా మీ చేతిలో మిగులుతుంది. దీర్ఘకాల పెట్టుబడుల్లో ఇది చాలా కీలకం.
లిక్విడిటీ & ట్రాకింగ్ ఎరర్: మీరు ఎప్పుడైనా అమ్మాలనుకున్నప్పుడు సులభంగా అమ్ముకునే వీలుండాలి. అందుకే రోజూ మంచి వాల్యూమ్‌లో ట్రేడయ్యే ETFలను ఎంచుకోవాలి. అలాగే వెండి ధరను ఎంత కచ్చితంగా అనుసరిస్తుందన్నది కూడా ముఖ్యం. దీనినే ట్రాకింగ్ ఎరర్ అంటారు. ఇది తక్కువగా ఉన్న ETF మంచిదిగా పరిగణిస్తారు.
ఫండ్ సైజు & బ్యాకింగ్ సిల్వర్: ETF వెనుక నిజంగా వెండి నిల్వలు ఉన్నాయా? ఎంత మేరకు ఉన్నాయన్నది చూడాలి. పెద్ద ఫండ్ సైజు ఉన్న ETFలు సాధారణంగా స్థిరంగా ఉంటాయి.
బంగారంపై చైనా వ్యూహం.. ప్రపంచ మార్కెట్లపై ప్రభావం (China’s Gold Strategy & Global Impact)
ఇటీవల అంతర్జాతీయ బంగారు మార్కెట్లో చైనా చర్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ధరలు గరిష్టానికి చేరినా, చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా 14 నెలలుగా బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా… నవంబర్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 42 టన్నుల బంగారాన్ని తన నిల్వల్లో చేర్చుకుంది. ఇది సాధారణ పెట్టుబడి కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడమే దీని వెనుక అసలు లక్ష్యమని విశ్లేషిస్తున్నారు.
డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారం (Gold as a Hedge Against Dollar Risk)
చైనాకు బంగారం కేవలం ఆస్తి మాత్రమే కాదు. డాలర్ రిస్క్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే రక్షణ కవచం. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు పెరిగినప్పుడల్లా బంగారం సురక్షిత పెట్టుబడిగా మారుతుంది. అందుకే చైనా తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను క్రమంగా పెంచుకుంటోంది. చైనా మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రపంచ బంగారు మండలి అంచనాల ప్రకారం, 2025 చివరి నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు మరింత వేగం పుంజుకోనున్నాయి.
భారత మార్కెట్‌పై ప్రభావం (Impact on Indian Gold Prices)
చైనా నిరంతర కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు బలమైన మద్దతు ఇస్తున్నాయి. దీని ప్రభావంతో భారతదేశంలో కూడా ధరలు పెద్దగా తగ్గే అవకాశం తక్కువే. రాబోయే నెలల్లో దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం… ధరలు రూ.2 లక్షల స్థాయికి చేరే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? (What Should Investors Do?)
బంగారం, వెండి రెండింటిలోనూ దీర్ఘకాలిక డిమాండ్ బలంగానే ఉంది. ధరలు ఒక్కసారిగా పడినా… అది తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనని నిపుణుల అభిప్రాయం. వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు, సరైన Silver ETFని ఎంచుకుని, అంచెలంచెలుగా పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గించుకోవచ్చు. పెళ్లిళ్ల సీజన్, గ్లోబల్ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు… ఇవన్నీ కలిసి రాబోయే రోజుల్లో విలువైన లోహాలకు మద్దతుగా నిలిచే అవకాశముంది. అయితే తక్షణ లాభాల కోసం ట్రేడింగ్ చేసే వారు మాత్రం మార్కెట్ ఒడిదుడుకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే.
