
what is sensex and nifty
లిస్ట్ అయిన అన్ని వేల కంపెనీల్లో ద బెస్ట్ కంపెనీలను ఎంపిక చేసి వాటిని ఏవరేజ్ చేసి చూపించే ఇండికేటర్స్ ఇవి. వీటిని ఇండెక్స్ అంటారు.
* బీఎస్ఈలో 30 పెద్ద కంపెనీల ఏవరేజ్ ని సెన్సెక్స్ ఇండెక్స్ అంటారు.
* ఎన్ ఎస్ ఈ లోని 50 పెద్ద కంపెనీల ఏవరేజ్‌ని నిఫ్టీ ఇండెక్స్ అంటారు.
స్టాక్ మార్కెట్ లో ఆ రోజులో మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేదా నష్టపోయాయో తెలియజేయడానికి ఈ సూచీలు ఉపయోగపడతాయి. అంటే ఆ రోజు స్టాక్ మార్కెట్ లో దాదాపు ఎక్కువ కంపెనీలు లాభపడితే సూచీలు పెరుగుతాయి. కంపెనీలు నష్టపోతే సూచీలు తగ్గుతాయి.
what is sensex indicates
సెన్సెక్స్ అనేది బీఎస్ ఈ లో ఉన్న మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేదా నష్టపోయాయో మనకి తెలియజేస్తుంది. నిఫ్టీ అనేది ఎన్ఎస్ఈ లో ఉన్న మెజారిటీ కంపెనీలు లాభపడ్డాయో లేదా నష్టపోయాయో మనకి తెలియజేస్తుంది. అయితే బీఎస్ఈ లో కొన్ని వేలకంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి. కానీ వీటన్నింటిని పరిగణలోనికి తీసుకోకుండా టాప్ పొజిషన్ లో ఉన్న 30 కంపెనీలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంది.
అయితే ఎక్కువ కంపెనీలు లాభపడి తక్కువ కంపెనీలు నష్టపోతే అప్పుడు సెన్సెక్స్ పాయింట్లు పెరుగుతుంది. అలాగే ఎక్కువ కంపెనీలు నష్టపోయి తక్కువ కంపెనీలు లాభపడితే సెన్సెక్స్ పాయింట్లు తగ్గుతాయి. ఈ విధంగా ప్రతిరోజు సెన్సెక్స్ లో పాయింట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. 1979లో సెన్సెక్స్ ని 100 పాయింట్లతో స్టార్ట్ చేశారు. కాని ఇప్పుడు దాదాపుగా 60000 వరకు ట్రేడ్ అవుతుంది. అదే విధంగా నిఫ్టీని 1994-95 లో 1000 పాయింట్లతో స్టార్ట్ చేశారు. కాని ఇప్పుడు దాదాపుగా 8000 వరకు ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెన్సెక్స్, నిఫ్టీ అనేవి మన దేశ స్టాక్ మార్కెట్ అబివృద్దిని, మన దేశ ఆర్థికాభివృద్దిని సూచించడానికి ఉపయోగపడతాయి.