Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS
  • ఆన్‌లైన్‌ చెల్లింపులా.. కాస్త జాగ్ర‌త్త‌.. రుసుముల మోత త‌ప్ప‌దు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard! FEATURE NEWS
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home! FEATURE NEWS
  • పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus! FEATURE NEWS
  • సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana? FEATURE NEWS
  • విహారయాత్ర కోసం వ్యక్తిగత రుణం.. కలల ట్రిప్‌న‌కు మార్గమా? లేక ఆర్థిక భారమా? Personal Loan for Travel.. A Gateway to Your Dream Trip or a Financial Burden? FEATURE NEWS
  • పదవీ విరమణకు ముందు ఈ పొర‌పాట్లు చేయొద్దు..!! Don’t Make These Financial Mistakes Before Retirement..! FEATURE NEWS

తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation

Posted on 08/05/2026 By admin No Comments on తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation

స్టాక్‌ మార్కెట్‌ మరోసారి అస్థిర దశలోకి వెళ్లింది. గత కొన్నినెలలుగా సూచీలు భారీ హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. ఒక దశలో జీవితకాల గరిష్ఠాలను తాకిన మార్కెట్‌, ఇప్పుడు గణనీయంగా వెనక్కి వచ్చింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, జీడీపీ వృద్ధిలో మందగమనం వంటి అనేక అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టిన మదుపరుల్లో ఆందోళన కనిపిస్తోంది. “ఇంకా పడిపోతుందా?”, “పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలా?”, “సిప్‌ ఆపేయాలా?” అనే సందేహాలు పెరుగుతున్నాయి. కానీ మార్కెట్‌ చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. తాత్కాలిక పతనాలే దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలుగా (Long-Term Wealth Creation) మారాయి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్లలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే వారికి మార్కెట్‌ అస్థిరతే పెద్ద బలం అవుతుంది. ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా, మార్కెట్‌లో భయం పెరిగిన సమయాల్లోనే భవిష్యత్తు సంపదకు బలమైన పునాది పడుతుంది. కాబట్టి మార్కెట్‌ హెచ్చుతగ్గులను శాపంగా కాకుండా అవకాశంగా చూడగలిగితేనే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయాణం విజయవంతమవుతుంది.

మార్కెట్‌ అంటేనే అస్థిరత.. Volatility is the Nature of Markets
చాలామంది స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక అపోహలో ఉంటారు. పెట్టుబడి పెడితే అది ఎప్పుడూ పెరుగుతూనే (Long-Term Wealth Creation)ఉంటుందని భావిస్తారు. కానీ మార్కెట్‌ అసలు స్వభావమే హెచ్చుతగ్గులు. ఒక రోజు భారీ లాభాలు కనిపిస్తే, మరుసటి రోజు భారీ పతనం కూడా కనిపించొచ్చు. ఇది సహజం. ప్రస్తుతం చాలా మంది కొత్త మదుపరులు తమ పెట్టుబడుల్లో 20 నుంచి 30 శాతం వరకు తగ్గుదలను చూస్తున్నారు. కొందరికి అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడే చాలామంది భయపడిపోతారు. పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే.. మార్కెట్‌ పతనాల తర్వాత తిరిగి బలంగా పుంజుకుంది.

2020 మార్కెట్‌ పాఠం.. The Lesson from the 2020 Crash
కరోనా సమయంలో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. భారత స్టాక్‌ మార్కెట్‌ కూడా భారీ పతనాన్ని చూసింది. అప్పుడు భయంతో చాలామంది తమ పెట్టుబడులను (Long-Term Wealth Creation)వెనక్కి తీసుకున్నారు. “ఇక మార్కెట్‌ కోలుకోదు” అనుకున్నారు. కానీ కొద్ది నెలల్లోనే మార్కెట్‌ తిరిగి బలంగా పెరిగింది. తర్వాతి సంవత్సరాల్లో చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీల్లో ఒకటిని చూసింది. అప్పుడు భయంతో బయటకు వచ్చిన వారు భారీ అవకాశాన్ని కోల్పోయారు. అదే సమయంలో మార్కెట్‌ పతనాన్ని అవకాశంగా చూసిన వారు అధిక రాబడులను అందుకున్నారు. ఈ ఉదాహరణ పెట్టుబడుల్లో సహనం ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తోంది.

దీర్ఘకాలిక దృష్టి ఎందుకు అవసరం? Why Long-Term Vision Matters?
స్టాక్‌ మార్కెట్‌లో (Long-Term Wealth Creation)త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది ప్రవేశిస్తారు. కానీ నిజమైన సంపద ఒక్కరోజులో ఏర్పడదు. మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీ పెట్టుబడులు ప్రధానంగా దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం. కనీసం 5 నుంచి 10 ఏళ్ల దృష్టితో పెట్టుబడి పెడితేనే అసలు ప్రయోజనం కనిపిస్తుంది. స్వల్పకాలిక పతనాలు దీర్ఘకాలిక ప్రయాణంలో భాగమే. వాటిని చూసి ఆందోళన చెందితే పెట్టుబడి ప్రయాణం సగంలోనే ఆగిపోతుంది.

ఈక్విటీల్లో భయం సహజమే.. Fear in Equity Investments is Natural
షేర్లలో పెట్టుబడి (Long-Term Wealth Creation)అంటే రిస్క్‌ తప్పదు. మార్కెట్‌ పెరిగితే లాభాలు వస్తాయి. పడిపోతే నష్టాలు కూడా కనిపిస్తాయి. అందుకే ఈక్విటీ పెట్టుబడులు పెట్టే ముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి. కానీ దీర్ఘకాలంలో ఈక్విటీలు ఇతర పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని మించే స్థాయిలో సంపదను పెంచగల సామర్థ్యం ఈక్విటీలకు ఉంది. అందుకే నిపుణులు “దీర్ఘకాలంలో రిస్క్‌ తగ్గుతుంది” అంటుంటారు.

ఏ వయసులో ఎంత ఈక్విటీ? How Much Equity is Right for Your Age?
పెట్టుబడుల్లో (Long-Term Wealth Creation)ఒకే ఫార్ములా అందరికీ వర్తించదు. వయసు, ఆదాయం, బాధ్యతలు, రిస్క్‌ భరించే సామర్థ్యం ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు మారాలి. 40 ఏళ్లలోపు ఉన్నవారు తమ పెట్టుబడుల్లో ఎక్కువ భాగాన్ని ఈక్విటీ ఫండ్లలో పెట్టొచ్చు. ఎందుకంటే వారికి దీర్ఘకాలిక సమయం ఉంటుంది. 40 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈక్విటీ, డెట్‌ మధ్య సమతౌల్యం పాటించాలి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారు రిస్క్‌ను తగ్గించుకోవాలి. ఈక్విటీల్లో పరిమితంగా మాత్రమే పెట్టుబడి పెట్టడం మంచిది.

సిప్‌.. సంపదకు అలవాటు.. SIP: A Habit That Builds Wealth
మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ విధానం (Long-Term Wealth Creation)ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్‌ అస్థిరతను సమర్థంగా ఎదుర్కోవచ్చు. మార్కెట్‌ పడిపోయినప్పుడు అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్‌ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీన్నే “రూపీ కాస్ట్‌ అవరేజింగ్‌” అంటారు. దీర్ఘకాలంలో ఇది పెట్టుబడి సగటు ఖర్చును తగ్గిస్తుంది.

మార్కెట్‌ పడిపోయిందని సిప్‌ ఆపొద్దు.. Never Stop SIP During Market Corrections
మార్కెట్‌ పతన సమయంలో చాలామంది చేసే పెద్ద తప్పు సిప్‌ను(Long-Term Wealth Creation) నిలిపివేయడం. వాస్తవానికి మార్కెట్‌ పడిపోయినప్పుడు సిప్‌ వల్ల ఎక్కువ యూనిట్లు కొనుగోలు అవుతాయి. భవిష్యత్తులో మార్కెట్‌ కోలుకున్నప్పుడు ఇవే అధిక లాభాలను ఇస్తాయి. అందుకే నిపుణులు “మార్కెట్‌ పడిపోతే భయపడకండి.. సిప్‌ కొనసాగించండి” అంటుంటారు. సిప్‌ అనేది కేవలం పెట్టుబడి పద్ధతి కాదు. అది ఆర్థిక క్రమశిక్షణ.

చిన్న అవసరాలకు ఫండ్‌ యూనిట్లు అమ్మొద్దు.. Avoid Redeeming Funds for Small Expenses
చాలామంది చిన్న చిన్న ఖర్చుల కోసం కూడా మ్యూచువల్‌ ఫండ్‌ (Long-Term Wealth Creation)యూనిట్లను విక్రయిస్తుంటారు. ఇది దీర్ఘకాలిక సంపద సృష్టికి అడ్డంకిగా మారుతుంది. ఎందుకంటే సమ్మేళన ప్రయోజనం మధ్యలో ఆగిపోతుంది. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు ఒక స్పష్టమైన లక్ష్యంతో ఉండాలి. పిల్లల చదువు, రిటైర్మెంట్‌, ఇల్లు కొనుగోలు వంటి లక్ష్యాల కోసం పెట్టిన డబ్బును చిన్న అవసరాలకు వాడకూడదు.

సమ్మేళన శక్తి అసలు మంత్రం.. The Magic of Compounding
సంపద సృష్టిలో (Long-Term Wealth Creation)అసలు కీలక పాత్ర పోషించేది సమ్మేళన వడ్డీ. పెట్టుబడిపై వచ్చిన లాభం కూడా తిరిగి పెట్టుబడిగా మారి మరింత లాభాన్ని అందిస్తుంది. కాలక్రమేణా ఇది భారీ సంపదగా మారుతుంది. అందుకే పెట్టుబడుల్లో సమయం చాలా ముఖ్యమైనది. త్వరగా ప్రారంభిస్తే సమ్మేళన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

మార్కెట్‌ పతనం కూడా అవకాశం.. Market Corrections Are Opportunities
చాలామంది మార్కెట్‌ పతనాన్ని ప్రమాదంగా చూస్తారు. కానీ దీర్ఘకాలిక (Long-Term Wealth Creation)మదుపరులకు అది అవకాశంగా మారొచ్చు. మంచి కంపెనీల షేర్లు, నాణ్యమైన ఫండ్లు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అదనపు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి రాబడులు వచ్చే అవకాశముంది.

ఒకేసారి మొత్తం పెట్టుబడి వద్దు.. Avoid Lump Sum Investments in Volatile Markets
చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ఒక్కసారిగా మొత్తం పెట్టుబడి(Long-Term Wealth Creation) పెట్టడం సరైన వ్యూహం కాదు. మార్కెట్‌ ఇంకా పడిపోయే అవకాశం ఉంటే నష్టం పెరిగొచ్చు. అందుకే పెట్టుబడిని విడతలుగా పెట్టడం మంచిది. కాలక్రమేణా మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల రిస్క్‌ తగ్గుతుంది.

ఎస్‌టీపీ.. తెలివైన మార్గం.. STP: A Smart Investment Route
ఎస్‌టీపీ అంటే సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌. పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఈక్విటీల్లో పెట్టకుండా, ముందుగా లిక్విడ్‌ ఫండ్‌లో ఉంచి అక్కడి నుంచి క్రమం తప్పకుండా ఈక్విటీ ఫండ్లకు బదిలీ (Long-Term Wealth Creation)చేయడం ఈ విధానం. దీంతో మార్కెట్‌ టైమింగ్‌ రిస్క్‌ తగ్గుతుంది.

హైబ్రిడ్‌ ఫండ్లు ఎందుకు? Why Hybrid Funds Matter Now?
ప్రస్తుతం మార్కెట్‌ అస్థిరత ఎక్కువగా ఉండటంతో చాలామంది హైబ్రిడ్‌ ఫండ్ల వైపు చూస్తున్నారు. ఇవిలో ఈక్విటీ, డెట్‌ రెండూ ఉంటాయి. దీంతో రిస్క్‌ కొంతవరకు (Long-Term Wealth Creation)తగ్గుతుంది. డైనమిక్‌ అసెట్‌ అలొకేషన్‌ ఫండ్లు మార్కెట్‌ పరిస్థితులను బట్టి పెట్టుబడులను మార్చుకుంటాయి. అందుకే కొత్త మదుపరులకు ఇవి కొంత భద్రతను అందిస్తాయి.

భావోద్వేగాలు పెట్టుబడికి శత్రువులు.. Emotions Are the Biggest Enemy of Investors
స్టాక్‌ మార్కెట్‌లో (Long-Term Wealth Creation)అతిపెద్ద ప్రమాదం మార్కెట్‌ కాదు.. పెట్టుబడిదారుడి భావోద్వేగాలు. భయం, అత్యాశ, ఆందోళన, తొందరపాటు నిర్ణయాలు పెట్టుబడులను దెబ్బతీస్తాయి. మార్కెట్‌ పడిపోతే భయంతో అమ్మేస్తారు. మార్కెట్‌ పెరిగితే అత్యాశతో అధికంగా కొనేస్తారు. ఇలా కాకుండా స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలి.

లక్ష్యాధారిత పెట్టుబడులే భద్రం.. Goal-Based Investing is the Safest Strategy
పెట్టుబడులు(Long-Term Wealth Creation) ఎప్పుడూ ఒక లక్ష్యంతో ఉండాలి. పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్‌, ఇల్లు, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యానికి సరిపోయే కాలపరిమితి, రిస్క్‌, పెట్టుబడి పద్ధతిని ఎంచుకోవాలి.

నిపుణుల సలహా ఎందుకు ముఖ్యం? Why Financial Advice Matters?
కొత్త మదుపరులు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వీడియోలు చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరు. అందుకే అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

సంపద సృష్టి ఓపికతోనే సాధ్యం..Wealth Creation Demands Patience
మ్యూచువల్‌ ఫండ్లు (Long-Term Wealth Creation)రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు ఇవ్వవు. కానీ క్రమశిక్షణతో, ఓపికతో కొనసాగితే దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలు అందించగలవు. మార్కెట్‌ అస్థిరతను అర్థం చేసుకుని, భయపడకుండా సిప్‌లను కొనసాగిస్తూ, సరైన వ్యూహంతో ముందుకు సాగితేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. మార్కెట్‌ పతనాలు తాత్కాలికం. కానీ క్రమశిక్షణతో చేసిన పెట్టుబడులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు పునాది అవుతాయి. అందుకే పెట్టుబడుల్లో అసలు రహస్యం ఒక్కటే.. “మార్కెట్‌ను గెలవడం కాదు.. మార్కెట్‌లో ఎక్కువకాలం కొనసాగడం.”

37
FEATURE NEWS, FINICAL PLANNING Tags:Avoid Lump Sum Investments in Volatile Markets, Avoid Redeeming Funds for Small Expenses, Emotions Are the Biggest Enemy of Investors, Fear in Equity Investments is Natural, Goal-Based Investing is the Safest Strategy, How Much Equity is Right for Your Age?, Market Corrections Are Opportunities, Never Stop SIP During Market Corrections, SIP: A Habit That Builds Wealth, STP: A Smart Investment Route, The Lesson from the 2020 Crash, The Magic of Compounding, Volatility is the Nature of Markets, Wealth Creation Demands Patience, Why Financial Advice Matters?, Why Hybrid Funds Matter Now?, Why Long-Term Vision Matters?

Post navigation

Previous Post: రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
Next Post: ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!

Related Posts

  • విదేశీ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలు.. EPFO New Guidelines for International Workers FINICAL PLANNING
  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS
  • పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained FEATURE NEWS
  • పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం.. సిగ‌రెట్ల ధ‌రలు మ‌రింత ప్రియం .. Additional Excise Duty on Tobacco Products… Cigarette Prices to Rise Further FEATURE NEWS
  • కొత్త కార్మిక చట్టాలు VS ఖర్చులు…! 2026లో ఇలా ప్లాన్ చేసుకోకపోతే నష్టపోతారు! New Labour Laws vs Rising Costs..! Fail to Plan This Way in 2026 — and You’ll Pay the Price! FINICAL PLANNING
  • రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ఆన్‌లైన్‌ చెల్లింపులా.. కాస్త జాగ్ర‌త్త‌.. రుసుముల మోత త‌ప్ప‌దు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard!
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home!
  • పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus!
  • సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిని మూడు రెట్లు ఎలా పెంచుకోవాలో తెలుసా? Do You Know How to Triple Your Investment in Sukanya Samriddhi Yojana?
  • విహారయాత్ర కోసం వ్యక్తిగత రుణం.. కలల ట్రిప్‌న‌కు మార్గమా? లేక ఆర్థిక భారమా? Personal Loan for Travel.. A Gateway to Your Dream Trip or a Financial Burden?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS
  • రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong FEATURE NEWS
  • దేశీయ మార్కెట్ల ప‌రిస్థితిపై ఆందోళన వద్దు.. వ్యూహం ఉండాలి.. ! No Need to Panic Over Domestic Market Volatility… What Investors Need is a Strategy FINICAL PLANNING
  • బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుందా? Is India Rising to Become a Gold Price Maker? FEATURE NEWS
  • `THE MIRACLE MORNING` BOOK SUMMERY `ద మిరాకిల్ మార్నింగ్` పుస్తక సారాంశం ఏమిటి …? BOOKS
  • ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency FEATURE NEWS
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme