
why dont we repay home loan early
హోమ్ లోన్స్ ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత ఫ్రీగా ఉండవచ్చని చాలా మంది భావిస్తుంటారు. వాళ్లు ఇచ్చిన గడువు కంటే ముందే రుణం తీర్చేస్తున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే హోమ్ లోన్ క్లియర్ చేయాలనే ఆలోచనలో మనం కొన్ని తప్పులు చేసేస్తున్నాం. మనం హోమ్ లోన్ ను క్లియర్ చేయడంలో తప్పులేదు కాని ఆ క్లియర్ చేసే ఆలోచనలో పడి కొన్ని లక్ష్యాలను వదులుకోకూడదు.
సాధారణంగా హోం లోన్ తీసుకుంటే మన ఆదాయంలో అధిక భాగం ఈఎంఐ కింద నెలవారీ పే చేయాల్సి ఉంటుంది. దీంతో ఇతర అవసరాలకోసం, ప్లాన్‌ల కోసం కేటాయించే భాగం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో అప్పుడప్పుడూ వచ్చే ఇతర ఆదాయాలు, బోనస్‌లు వంటి వాటిని కూడా గృహరుణం చెల్లింపులకోసం కేటాయిస్తే మనకు ఉండేది జీరోనే. అందుకే నిర్ణీత సమయంలో నిర్ణయించిన మొత్తాన్ని మాత్రమే ఈఎంఐలకు కేటాయించాలి. మిగిలిన ఆదాయాన్ని ఇతర అవసరాలు, సేవింగ్స్‌కోసం పెట్టాలి. పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యే ఖర్చు,మన రిటైర్ మెంట్ ప్లాన్ ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మనం సాధారణంగా ఈ హోమ్ లోన్ క్లియర్ చేశాక ఈ మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలనుకుంటాం. కానీ దానికి అంత టైమ్ ఉండదు.
రెండూ ఒకేసారి..
హోమ్ లోన్స్, ఇన్వెస్ట్ మెంట్ ఒకేసారి చేయడానికి మనం ఒక ప్లాన్ ను తయారుచేసుకోవాలి. 20 సంవత్సరాల హోమ్ లోన్ ని 10 సంవత్సరాలలో క్లియర్ చేయాలనుకుంటే, ముందు 10సంవత్సరాల ఔట్ స్టాండింగ్ చూసుకోవాలి. మనకొచ్చిన హోమ్ లోన్ ని 10 సంవత్సారాల్లో పూర్తిచేయాలనుకుంటే హోమ్ లోన్ మంత్లీ ఈఎమ్ఐలో సుమారు 35 శాతం ఎక్స్ ట్రా ఇన్ కమ్ సిప్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. పదేళ్లయ్యాక ఇన్వెస్ట్‌చేసిన మొత్తాన్ని, దానిపై వచ్చిన ప్రాఫిట్‌ను హోమ్ లోన్ క్లియర్ చేయడానికి ఉపయోగిస్తే లోన్ క్లియర్ అవుతుంది. డైరెక్ట్ గా లోన్ కట్టడం కంటే, ఒక టార్గెట్ పెట్టుకుని రెగ్యులర్ గా ఇన్వెస్ట్ మెంట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మనం తక్కువ కడతాం. ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది.
what are the benefits of home loans
హోం లోన్ బెనిఫిట్స్..
హోమ్ లోన్ తీసుకోగానే మనకి ట్యాక్స్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే మనం సొంత ఇంటికి వెళ్ళగానే రెంట్ మిగులుతుంది. 10 సంవత్సరాల తర్వాత ట్యాక్స్ బెనిపిట్స్ ఉండదు. లోన్ కూడా తీరిపోతుంది. మనం హోమ్ లోన్ స్టార్ట్ చేసిన రోజు నుండే ఎస్ఐపీ కూడా స్టార్ట్ చేస్తూ వస్తే, మనకి అనుకోని పరిస్థితుల్లో మనకి హోమ్ లోన్ కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులతో హోమ్ లోన్ కట్టవచ్చు.