
ఇటీవల ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరిగింది. మన బ్యాంక్ అకౌంట్లు, వ్యాపారాలు,
ఆస్తులు, ఉద్యోగ వివరాలన్నీ ఆధార్, పాన్ నంబర్‌తో లింక్ అయి ఉండడం వల్ల మన లావాదేవీలన్నీ ప్రభుత్వం, ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్తాయి. కాబట్టి ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ విధంగా మనం అధిక ఆదాయం పొందుతూ ట్యాక్స్ కట్టకుండా ఉండడ కుదరదు. ఈ నేపథ్యంలో పన్ను కట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు, మనం పాటించాల్సిన మెళకువలను ఓ సారి తెలుసుకుందాం.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం కూడా ఉంది. ట్యాక్స్ కట్టే విషయంలో మనం మరింత అవగాహనతో మెలగడం అవసరం. మనకున్న మినహాయింపులు, చట్టప్రకారం పొందగలిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ట్యాక్స్ కట్టమన్నారు కదా అని ఎంత పరధిలో ఉంటే అంత చెల్లించి నష్టపోవడం అవసరం లేదు. మన ఖర్చులు, మన పొదుపులు, ఇన్సూరెన్స్‌లు, రుణ చెల్లింపులు ఇవన్నీ మనం ఇక్కడ తెలియజేసే అవకాశం ఉంది. ఆ మేరకు మాత్రమే మనం ట్యాక్స్ కట్టవచ్చు. ఇందుకు ప్రత్యేక సెక్షన్లు, క్లాజ్ లు ఉన్నాయి. వాటిపై అవగాహన కలిగి ఉండడం శ్రేయష్కరం.
perfect tax planning is also an income
ట్యాక్స్ ప్లానింగూ ఆదాయమే..
సాధారణంగా ట్యాక్స్ గురించి అందరూ మార్చి నెలలోనే ఆలోచిస్తారు. సంవత్సరం అంతా పట్టించుకోకుండా ఆ ఒక్క నెలలోనే హైరానా పడుతుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ పొరపాట్ల వల్ల కొంత ఆదాయాన్నికోల్పోవాల్సి వస్తుంది.
* ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఇన్వెస్ట్ మెంట్ ప్లానింగ్ అనే చెప్పవచ్చు. ఇవీ ఆలోచించి పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.
* ట్యాక్స్ ప్లానింగ్ అనేది కూడా మనకు ప్రత్యేకంగా ఉండాలి. అందరితో పాటు వాళ్లలాగే చేస్తే మనకు అది సరిపోకపోవచ్చు. అందుకే మన అవసరాలకు, ఆదాయానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి.
never go for loopholes in tax filing
డొంక దారులు వద్దు..
* చట్టంలో ఉన్న మినహాయింపులను మాత్రమే వాడుకోవాలి. లొసుగల ఆధారంగా పన్ను ఎగ్గొడితే మూల్యం తప్పదు.
* అబద్దపు లెక్కలు చూపించడం, అబద్దపు ఖర్చులు రాయడం చేయకూడదు. మనం మంచి మార్గంలో వెళ్ళి ట్యాక్స్ బారాన్ని తగ్గించుకోవాలి.
* మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఆర్థిక సంవత్సరం మాత్రమే మినహాయింపు లభిస్తుంది.
* వ్యాపారం, వృత్తి, స్థాయి, రెసిడెన్స్ స్టేటస్, వయసు మొదలైన విషయాలను లెక్కలోకి తీసుకోవాలి.
కేవలం ఒక వ్యక్తి పన్ను భారం తగ్గించే ధోరణి కాకుండా కుటుంబంలోని ఇతర అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
* మన కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చట్టప్రకారం మలుచుకోవాలి. ఆదాయం, ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు, పన్నులు చెల్లించటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి సక్రమంగా సాగేలా ప్లానింగ్ చేసుకోవడం ముఖ్యం.