Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?

Posted on 28/11/2025 By admin No Comments on మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?

దేశీయంగా  ఇటీవలి రోజుల్లో కనిపిస్తున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీల కదలికల్లో హెచ్చుతగ్గులు పెట్టుబడిదారుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్లలో కూడా రాబడులు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో చాలామంది యూనిట్లను ఇప్పుడు అమ్మేసి మార్కెట్‌ తగ్గినప్పుడు మళ్లీ కొనడం మంచిదేమో? అనే ఆలోచనలో పడుతున్నారు. భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు పరిశీలిస్తే.. ఇటీవల నెలల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇది నిజంగా సరైన వ్యూహమా? లోతుగా పరిశీలిస్తే సమాధానం ‘కాదు!’ అని నిపుణులే చెబుతున్నారు.

కొనసాగింపే లాభదాయకం..Continuity Is Profitable

పెట్టుబడులు పెట్టడానికైనా, వాటిని విక్రయించడానికైనా స్టాక్‌ మార్కెట్లో “ఇప్పుడు సరైన సమయం” అని చెప్పే మ్యాజిక్‌ రూల్‌ ఏదీ లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరికాదు. ముఖ్యంగా SIPల ద్వారా దీర్ఘకాలం మదుపు చేస్తున్న ఫండ్ల విషయంలో ఇది మరింత కచ్చితంగా పాటించాల్సిన నియమం. మ‌న‌ ఆర్థిక లక్ష్యం చేరుకునేవరకు మార్కెట్‌ హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా పెట్టుబడి కొనసాగింపే లాభదాయకం. ఏదేమైనా మార్కెట్‌ పడిపోయినప్పుడు యూనిట్లను అమ్మడం పెట్టుబడిదారులు చేసే అత్యంత సాధారణ తప్పు.

రంగాన్ని ప్రభావితం చేస్తున్నవి ఏమిటంటే? What’s Impacting the Sector?

– గత రెండు సంవత్సరాలుగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. SIPల ద్వారా నెలకు 20–25 వేల కోట్ల వరకు నిధులు ప్రవహించడం సాధారణమైపోయింది. అయితే మార్కెట్‌లో మంచి స్టాక్‌లు సంఖ్య పరంగా పరిమితమే. పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా కేటాయించడం కష్టమవుతోంది.

– అనేక మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్‌లు వాస్తవ విలువ కంటే చాలా ఎక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫండ్లు అధిక ధరలకు కొనడం పెట్టుబడిదారులకు నష్టం అవుతుందని భావిస్తున్నాయి.

– సెబీ ఇటీవల స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ రంగాల్లో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలని హెచ్చరించింది. పెట్టుబడిదారులను రక్షించే క్రమంలో AMCs పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

– అమెరికా ఆర్థిక నెమ్మదితనం, చైనాలో ఉత్పత్తి మందగింపు, యూరోప్‌లో ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యలు … ఇవన్నీ పెట్టుబడి వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

– అమెరికా, చైనా, యూరోప్‌ వంటి ప్రధాన దేశాల్లో వడ్డీ రేట్లపై అస్పష్టత, మధ్యప్రాచ్యంలో జియోపాలిటికల్‌ ఉద్రిక్తతలు, దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి .. ఇవన్నీ కలిసి భారత మార్కెట్లను కుదిపేశాయి. మార్కెట్‌ వ్యత్యాసం (Volatility) పెరిగినపుడు మ్యూచువల్‌ ఫండ్లు సాధారణంగా అనుసరించే మార్గం కొత్త పెట్టుబడులను ఆపి, ప్రస్తుత ఆస్తులను రక్షించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం. కొన్ని ఈక్విటీ ఫండ్లు ఇప్పటికే భారీ నిధుల ప్రవాహం కారణంగా కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపి వేశాయి. మరికొన్ని మాత్రం ప్రవేశిక (Entry Load) మార్చడం, SIP లిమిట్లను తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నాయి. దీని వల్ల పెట్టుబడిదారుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్‌ రంగం భవిష్యత్తు ఎలా ఉంటుందంటే? What Does the Future Look Like for the Mutual Fund Industry?

భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయం, పెట్టుబడులపై అవగాహన అనేవి మ్యూచువల్‌ ఫండ్‌ రంగానికి పెద్ద బలం. 2025–2030 మధ్య మ్యూచువల్‌ ఫండ్ల AUM 60–70 ట్రిలియన్‌ రూపాయలకు చేరే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. SIPల పెరుగుదల కూడా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశముంది. అందువల్ల ప్రస్తుత పెట్టుబడి నిలిపివేతను తాత్కాలిక వ్యూహాత్మక నిర్ణయంగా మాత్రమే చూడాలి.

కొన్ని ఫండ్లు ఎందుకు ‘STOP’ అంటున్నాయంటే? Why Are Some Funds Saying “STOP”?

తాజాగా కొన్ని ప్రముఖ ఫండ్‌ హౌస్‌లు కొత్త SIP/లంప్‌సమ్‌ పెట్టుబడులను ఆపివేసిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇది నెగటివ్‌ సిగ్నల్‌ కాదు. ఇది పూర్తిగా రక్షణాత్మక నిర్ణయం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల డబ్బును అధిక రిస్క్‌ ఉన్న మార్కెట్లలో పెట్టడం ఇష్టం లేకపోవడం, తగిన అవకాశాలు కనిపించకుండా ఉండటం, పెట్టుబడిదారులకు నష్టాలు రాకుండా జాగ్రత్త పడటమే ఫండ్ హౌస్‌ల ల‌క్ష్యం. దీనిని పెట్టుబడిదారులు సంక్షోభ సంకేతంగా కాకుండా, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతాయుత చర్యగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మార్పులు అవసరం.. Changes Are Essential

పెట్టుబడి లక్ష్యం ముగిసే ఏడాది, రెండేళ్ల ముందు నుంచే రిస్క్‌ తగ్గించే చర్యలు చేపట్టాలి. ఫండ్‌ విలువ ముందుగానే అవసరమైన మొత్తాన్ని అందిస్తే ఈక్విటీ ఫండ్ల నుంచి క్రమంగా డబ్బును లిక్విడ్‌ ఫండ్లకు మార్చాలి. లేదా బ్యాంక్‌ ఫ్లెక్సీ డిపాజిట్లలో నిల్వచేయాలి అలా చేయడం వల్ల మార్కెట్‌ ఒక్కసారిగా పడిపోయినా మీ లక్ష్యానికి ప్రభావం ఉండదు.

‘ఎస్‌డబ్ల్యూపీ’ని ఎంచుకోండి Choose the SWP Option

చాలామంది మ్యూచువల్‌ ఫండ్ల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే డివిడెండ్‌ ఆప్షన్‌లోకి మారతారు. అయితే డివిడెండ్లపై పన్నులు ఎక్కువ. దానికంటే Systematic Withdrawal Plan (SWP) చాలా మంచిది. కావలసిన మొత్తాన్ని నిర్దిష్ట వ్యవధిలో వెనక్కి తీసుకోవచ్చు. పన్ను భారమూ తక్కువ. పెట్టుబడి ప్రిన్సిపల్‌ పెరుగుతుండటంతో దీర్ఘకాల ప్రయోజనం కూడా ఉంటుంది.

ఫండ్‌ వ్యూహంలో మార్పులు Changes in Fund Strategy

ఫండ్‌ మేనేజర్‌ మారడం, ఫండ్‌ వ్యూహం మారడం వంటి సందర్భాల్లో.. కొత్త మేనేజర్‌ ఎవరు? గత పనితీరు ఎలా ఉంది? పథకం రిస్క్‌ ప్రొఫైల్‌ మారిందా? అని పెట్టుబ‌డిదారులు ప‌రిశీలించాలి. ఈ విషయాల్లో ప్రతికూలత ఉంటే మాత్రమే పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి. కొన్ని పథకాలు రెండేళ్లు, మూడేళ్లు చూసినా ఆశించిన రాబడి ఇవ్వకపోవచ్చు. అయితే ఒక్క కాల వ్యవధిని ఆధారంగా పెట్టుకుని ఫండ్‌ను వదిలేయకూడదు. వివిధ కాలాల్లోని పనితీరు, అదే విభాగంలోని ఇతర పథకాలతో పోలిక, బెంచ్‌మార్క్‌తో పోల్చిన రాబడి స‌రిచూడాలి. కానీ వరుసగా మూడు సంవత్సరాలు ఫండ్‌ పనితీరు చాలా బలహీనంగా ఉంటే
అప్పుడు మాత్రం బయటకు రావడం మంచిదే!

రిస్క్‌ తగ్గించేందుకు రీబ్యాలెన్సింగ్‌ తప్పనిసరి.. Rebalancing Is Crucial to Reduce Risk

మార్కెట్‌ పెరుగుదల వల్ల మీ ఈక్విటీ పెట్టుబడులు పెరిగినా, మీరు నిర్ణయించుకున్న నిష్పత్తి దాటి పోవచ్చు. ఉదాహరణకు మీ ఈక్విటీ 75% — డెట్‌ 25% అని నిర్ణయించుకున్నారనుకోండి. మార్కెట్‌ ర్యాలీతో ఈక్విటీ 85%కి పెరిగితే దాన్ని తిరిగి 75%కు సర్దుబాటు చేయాలి (రీబ్యాలెన్సింగ్‌). ఈ చర్య రిస్క్‌ను తగ్గిస్తుంది. తగ్గిన ధరకు అమ్మడం వలన నష్టాన్ని లాక్‌ చేసుకున్నట్లే. మార్కెట్‌ తిరిగి పెరిగినప్పుడు మీకు లాభం అందదు . దీర్ఘకాలంలో SIPలు పడిపోయిన మార్కెట్లలోనే ఎక్కువ యూనిట్లు కూడబెట్టుతాయి.

లక్ష్యాల దిశగా సాగితేనే ప్ర‌యోజ‌నం.. Benefits Come Only When You Stay Aligned to Your Goals

మార్కెట్‌ ఎలా ఉన్నా.. లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. దీర్ఘకాలం ఆలోచించాలి. వైవిధ్యాన్ని పాటించాలి. భయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి అనేది “మార్కెట్‌ ట్రేడింగ్‌” కాదు. ఇది మీ భవిష్యత్తు కోసం చేసే ఆర్థిక ప్రణాళిక. అది 5, 10, 15 సంవత్సరాల ప్రయాణం. “మార్కెట్‌ తగ్గిందని యూనిట్లు అమ్మేయకండి… లక్ష్యాల దిశగా నిలకడగా సాగండి!” అని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

257
FEATURE NEWS Tags:Benefits Come Only When You Stay Aligned to Your Goals, Changes Are Essential, Changes in Fund Strategy, Choose the SWP Option, Continuity Is Profitable, Rebalancing Is Crucial to Reduce Risk, What Does the Future Look Like for the Mutual Fund Industry?, What’s Impacting the Sector?, Why Are Some Funds Saying “STOP”?

Post navigation

Previous Post: త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks
Next Post: బాండ్లపై పెరుగుతున్న ఆసక్తి! సెబీ హెచ్చ‌రిక‌లు! Rising Interest in Bonds! SEBI Issues Fresh Warnings

Related Posts

  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS
  • మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి కొత్త దారి..! A New Path to Women’s Financial Independence FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • ఆధార్‌తో పాన్ కార్డ్ లింక్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబర్ 31 వరకే అవకాశం.. Linking PAN with Aadhaar Made Mandatory: Deadline Extended Till December 31 FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • అమ్మాయికి ఇద్దాం ఆర్థిక భరోసా… చిన్న వయసులోనే పెద్ద భవిష్యత్తు నిర్మాణం .. Securing a Girl Child’s Financial Future – Smart Planning for Big Dreams FEATURE NEWS
  • స్టాక్‌ల‌లో ఉండే ర‌కాలేమిటి.. ఏ ర‌క‌మైన స్టాక్‌లో ఇన్వెస్ట్‌చేస్తే లాభాలు వ‌స్తాయి What are the types of stocks.. Investing in which type of stock will bring profits MARKET
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • భారీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన ఇండియన్ ఆయిల్ FEATURE NEWS
  • ఏప్రిల్‌ నుంచి టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు మ‌రింత ప్రియం .. Term Life Insurance Premiums to Become Costlier from April INSURANCE
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme