పన్ను + అధిక రాబడి = ఈఎల్ఎస్ఎస్
what is ELSS
మనలో అధిక ఆదాయ వర్గాల వారు, ఉద్యోగులు ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందడానికి చాలా మార్గాలు అన్వేషిస్తారు. ఈ క్రమంలో ఏదో ఒకటి చేసేద్దాం అనుకుని అవసరం ఉన్నా లేకపోయినా ఎల్ ఐ సీ పాలసీలు లేదా తెలిసీ తెలియని ప్రభుత్వ స్కీముల్లో చేరి ప్రీమియం చెల్లిస్తుంటారు. దీని వల్ల ఇన్‌కం ట్యాక్స్‌లోని 80 సీ కింద మినహాయిపు పొందేందుకు ప్రయత్నిస్తారు. కానీ వీటితో ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా తిరిగి ఎక్కువగా నష్టపోతుంటారు. ఇటువంటి వారి కోసం ఉద్దేశించినదే ఈ ఎల్ ఎస్ ఎస్.
tax benefit in elss
సెక్షన్ 80 సీ కింద మనకు లక్ష 50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. అంటే ఇక్కడ మనం లక్ష యాబై వేలు కడితే అంత మొత్తానికి పన్ను చెల్లించక్కర్లేదు. అందుకోసం అవగాహన కలిగిన వారెవరైనా ఈక్విటీ లింక్‌డు సేవింగ్ స్కీంలో పెట్టుకోవడం చాలా ఉత్తమం.
what are the benefits of elss
లాభాలు..
ఈ ఎల్ ఎస్ ఎస్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వలె అధిక రాబడులు వస్తాయి. అదే సమయంలో ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది.
* వీటికి మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.
* పన్ను ఉద్దేశించి ఉన్న అనేక ఇతర పథకాల కంటే ఇది చాలా చాలా బెటర్.
* పన్ను, రాబడి వంటి రెండు లక్ష్యాలు నెరవేరుతాయి.
సిప్ లేదా లమ్ సమ్..
ఈ ఎల్ ఎస్ ఎస్ అనేవి మ్యూచువల్‌లో ఒక రకం కాబట్టి వీటిని కూడా సిప్ లేదా లమ్‌సమ్ మార్గాల్లో ప్రారంభించవచ్చు. ఇవి స్టాక్ మార్కెట్‌లను ఆధారం చేసుకుని నడుస్తాయి. కాబట్టి ఒడుదొడుకులు ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సిప్ ను ఆశ్రయించడం ఉత్తమం. కాకపోతే వీటిలోనూ మార్కెట్ రిస్క్ ఉంటుంది. పూర్తిగా తెలుసుకుని పొదుపు చేయాలి. వీటిలో సుమారు 15 నుంచి 20 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల పీరియడ్ ముగిసిన తరువాత వీటిని కావాలనుకుంటే కొనసాగించవచ్చు. లేదా డబ్బులు తీసుకోవచ్చు. కాదంటే అక్కడికి ఆ పథకం ఆపేసి తర్వాత ఎప్పుడైన డబ్బులు తీసుకోవచ్చు. ఈ కాలానికి కూడా ప్రాఫిట్ జనరేట్ అవుతూనే ఉంటుంది.
బాగుంది.. జనానికి బాగా పనికొస్తుంది.. చాలా మంది అతి తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే వాటి పై చేస్తారు.. మనం పెట్టింది తప్ప లాభలే రావు..
Thank you sir