మనందరికీ తెలిసిన అతి సంప్రదాయ, అత్యంత సురక్షిత, పురాతన పొదుపు స్థానం పోస్టాఫీస్. మన పూర్వీకులు, ముందు తరాల వారు కూడా పోస్టాఫీస్ స్కీంలలో పొదుపు చేసిన వారే. పెద్దలకు, రిస్క్ భరించలేని వారికి ఇవి అత్యంత భద్రమైనవి. ఇక్కడ అనేక రకాల పథకాలు ఉన్నాయి. వివిధ వర్గాల వారికి వారి అవసరాలు, వయసును బట్టి పథకాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎంచుకునే పొదుపు పథకం ప్రాతిపదికన వడ్డీ రాబడి ఉంటుంది.
what are the saving schemes in post office
కొన్ని పథకాలు ఇలా..
* టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది, రెండేళ్ళు, ఐదేళ్ళ కాల పరిమితితో (మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.) ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాలి. వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు వస్తుంది.
* రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ వస్తోంది. దీని మెచ్యూరిటీ కాలం 5ఏళ్ళు. ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేస్తూ వెళ్ళాలి.
* మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ ఈ పథకంపై 6.6 శాతం వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. మెచ్యూరిటీ కాలం ఐదేళ్ళు.interst rate of senior citizen savings scheme
* సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ పై 7.4 శాతం వడ్డీ వస్తోంది.రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ కాలం 5ఏళ్ళు.
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15ఏళ్ళు. 7.1 శాతం వడ్డీ వస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
* సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా ఉంది. దీనిపై 7.6 శాతం వడ్డీ వస్తుంది. ఇందులో కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 1.5 ఏళ్ళ వరకు డబ్బులు పెట్టాలి. మెచ్యూరిటీ కాలం 21ఏళ్ళు.
* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్( ఎన్ఎస్ సీ) స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ వస్తుంది. మీరు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.