
ఇది వరకు బ్యాంకులో రుణం తీసుకోవాలంటే చాలా పెద్ద తతంగం ఉండేది. ఇంటి కాగితాలు, భూమి పత్రాలు, బంగారం.. ఇలా ఏదో ఒక ఆస్తిని చూపిస్తేనే రుణం మంజూరయ్యేది. డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసి వాటిని అట్టే పెట్టుకుని వాటిపై ఎంతో కొంత అప్పు ఇచ్చేవారు. ఇదంతా జరగడానికి కొంత కాలం పట్టేది. కానీ ఇప్పడు ఆ విధానంలో మార్పు వచ్చింది. ప్రస్తుత కాలంలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్.
how much loan amount we get on good credit score
క్రెడిట్ స్కోర్ ఒక రుణగ్రహీత అర్హతకు ప్రతీక. క్రెడిట్ స్కోర్ ద్వారా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది. స్కోరు 750 పై ఉంటే అది గుడ్ క్రెడిట్ స్కోర్. వీరికి రుణాలు వేగంగా రావడం, తక్కువ వడ్డీ రేటుకు రావడం వంటి ప్రయోజనం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణ కాలపరిమితి కూడా కాస్త ఎక్కువగా ఎంచుకోవచ్చు.ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల్లో డిస్కౌంట్ ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగిన రుణగ్రహీతల నుంచి బ్యాంకులకు రిస్క్ తక్కువగా భావిస్తాయి.
how much credit score is required
700 కంటే తక్కువ ఉంటే
క్రెడిట్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే వారికి రుణం ఇవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అన్ని పత్రాలు ఉన్నా ఆలస్యం కావచ్చు. లోన్ ఇచ్చినా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు లాంటివి కూడా అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మంచి హోం లోన్ స్కీమ్స్ వంటివి వర్తించవు. అందుకే లోన్స్ ఇచ్చేటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ చెల్లింపు హిస్టరీ, క్రెడిట్ వినియోగం, క్రెడిట్ ఏజ్, క్రెడిట్ రకం, మొత్తం క్రెడిట్ ఖాతాలు వంటి విషయాలు లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ముందు క్రెడిట్ స్కోర్ ను తనిఖీ చేసుకోవాలి. క్రెడిట్ ఏజన్సీలు స్కోర్ చెక్ చేసుకోవడానికి కాలిక్యులేటర్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఆన్‌లైన్‌లో వీటిని పరిశీలించవచ్చు.
స్కోర్ పెరిగేదెలా?
క్రెడిట్ స్కోర్ మన ఆర్థిక క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎం ఐ వాయిదాలు కట్టడంలో ఆలస్యం చేయడం, సకాలంలో రుణం చెల్లించకపోవడం, బ్యాంకు అకౌంట్లు సరిగా నిర్వహించకపోవడం వంటివి స్కోర్ తగ్గి పోవడానికి ప్రధాన కారణం. మరో ప్రధాన అంశం క్రెడిట్ కార్డు. డబ్బులు చెల్లించడం, వాయిదాల్లో ఆలస్యం, ఫైన్‌లు, అధిక మొత్తంలో పరిమితికి మించి లోన్ తీసుకోవడం తదితర విషయాలు
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. వీటన్నింటినీ సక్రమంగా నిర్వహించగలిగితే స్కోర్ పెరుగుతుంది.