
shall we buy penny stocks
చాలా తక్కువ ధరల్లో ట్రేడవుతూ, తక్కువ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే షేర్లను పెన్నీ స్టాక్స్ అంటారు. సాధారణంగా ఈ స్టాక్స్ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెన్నీ స్టాక్స్ వివరాల గురించి విశ్వసనీయత లేదు. వీటికి సంబంధించిన వివరాలు అందుబాటులో కూడా లేవు. అనవసర ఖర్చులు పెట్టేవారు పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో కదలిక వచ్చి ఇవి అనేక రెట్లు లాభాలు ఇచ్చే అవకాశాలు ఉండవచ్చు. వీటి ట్రేడింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడమనేది డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గానే పరిగణించాలి.
why penny stocks are risky
* పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ కాదు. ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్ చేసేవారిలో చాలామంది నష్టపోయారు.
* ఇన్వెస్టర్స్ తక్కువ మొత్తంతో మొదలుపెట్టి, అధికమొత్తంలో ఈ పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం తక్కువే అయినప్పటికీ 100 శాతం పెట్టుబడిని నష్టపోయే రిస్కులు ఎక్కువ ఉంటాయి.
* పెన్నీ స్టాక్స్ ఎప్పటికో పెరుగుతాయి. కొన్ని సమయాల్లో పూర్తిగా కనుమరుగైపోతాయి. నమ్మకం లేని ఇన్వెస్ట్ మెంట్ చేయడం కూడా అనవసరం అవుతుంది.
* రియల్ గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలనుకున్నావాళ్లు వాళ్ళకోసం వాళ్ళే స్టాక్స్ ని ఎనలైజ్ చేసి, ఎవరిపైనా ఆధారపడకుండా స్టాక్స్ ని ఎక్కడ కొనాలి, ఎలా ఎనలైజ్ చేయాలో తెలుసుకోవాలి.