
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈటీఎఫ్. ఇన్వెస్ట్మెంట్‌కి ఇప్పుడు ఇదో బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టే ఇందులో కూడా మంచి ప్రాఫిట్ పొందవచ్చన్న విషయం ఇక్కడ మనం గుర్తించాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్.. ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఓసారి చూద్దాం.
benefits of mutual funds
మ్యూచువల్ ఫండ్..
మ్యూచువల్ ఫండ్ అనేది బాగా తెలిసిన పొదుపు సాధనం. ఇందులో 100 రూపాయలతో పెట్టుబడి మొదలు పెట్ట వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్ని ఆ ఫండ్స్ హౌస్ ద్వారా గానీ, బ్యాంక్ ద్వారా గానీ మరే ఇతర మార్గాల్లో గానీ కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో 50 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయి. మన దేశంలో టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ అంటారు. అందులో ఇన్వెస్ట్ చేసే వాటిని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. 100 -250 మధ్య ఉన్న కంపెనీలను మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అలాగే 250 నుంచి మిగతా కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మనకు 20 – 30 శాతం రిటర్న్స్ వస్తాయి. మనం నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే 26 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అందులో 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి 2 కోట్లు రూపాయలు వచ్చాయి.
benefits of ETFs
ఈటీఎఫ్ తో ప్రయోజనాలు..
మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం. బాగా పాపులర్ అయిన ఫండ్ గా నిఫ్టీ ఈటీఎఫ్ ని చెప్పవచ్చు.
ఈటీఎఫ్‌ని మనం స్టాక్స్ కొన్నట్టుగానే కొనుక్కోవచ్చు. దీనికి డీ మ్యాట్ అకౌంట్ అవసరం. ట్రేడింగ్ అకౌంట్ నుంచి బై చేయవలిసి ఉంటుంది. మార్కెట్‌లో ఉండే వాలటాలిటీ దీనికి మంచి లాభాలను తెచ్చి పెడుతుంది. ఎందుకంటే మార్కెట్ ప్రతినెలలోనూ సగం రోజులు పడుతూ సగం రోజులు లేస్తూ ఉంటుంది. పడినప్పడు కొని లేచినప్పుడు అమ్మితే ప్రాఫిట్ ష్యూర్..
మనం షేర్లను తక్కువకి బై చేసి ఎక్కువకి సెల్ చేస్తే ఏవరేజ్ మీద మంత్లీ 3-5 శాతం రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 1-2 శాతం ఖర్చుల కింద తీసుకుంటారు. 1 సంవత్సరంలోపు మనం క్లోజ్ చేస్తే 1 శాతం పెనాల్టీ తీసుకుంటారు. ఈటీఎఫ్ లో అలాంటిదీ లేదు. ఎటువంటి చార్జీలు ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.