బంగారంపై పెట్టుబడి.. దండగే!
why investment on gold is not much profitable
మన దేశంలో ఎక్కువమంది సంప్రదాయబద్ధమైన పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తుంటారు. అందులో మొదటిది బంగారం, రెండొవది భూమి, ఇల్లు. మన పూర్వీకులను పరిశీలిస్తే బంగారం బాగా కొనేవారు. దాన్ని దాచిపెట్టి ఆస్తిగా తయారుచేసేవారు. అవసరమైనప్పుడు దాన్ని అమ్మి, లేదా తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకునేవారు. లేదా ఆ బంగారంతో ఇళ్లు లాంటి ఆస్తులను కొనుక్కునేవారు. ఇది అప్పటికి తెలిసిన మంచి పొదుపు సాధనం. కానీ నేడు ఆధునిక యుగంలో ఎన్నో లాభదాయక మార్గలు అందుబాటులోకి వచ్చాక మనం కూడా అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. అప్పట్లో బంగారం ఓకే కానీ నేడు బంగారంపై వచ్చే రాబడి సరిపోదు. మిగిలిన కొన్నింటితో పోలిస్తే చాలా తక్కువ రిటర్న్ ఇచ్చినట్టే లెక్క. కానీ నేడు బంగారం ఒక ఆభరణం అయ్యింది కనుక దాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావించి అంతా ఎక్కువ మొత్తంలో కొనుక్కుని దాచి పెట్టుకుంటున్నారు. ఆ బంగారం రేటు పెరగవచ్చు కానీ ఆ పెరిగేది చాలా తక్కువ శాతమే అన్న విషయం గుర్తించాలి. రియల్ ఎస్టేట్ అనేది మరో సంప్రదాయ పెట్టుబడి విధానం. ఇందులో కూడా లాభాలు బాగానే వస్తాయి. కాకపోతే ఇక్కడ పెట్టుబడి అనేది చాలా అధిక మొత్తంలో ఉండాలి. వెంటనే అమ్మడం కొనడం కుదరదు. బంగారాన్ని చేతిలో ఉండే డబ్బులానే అందరూ భావిస్తారు. అవసరమైనప్పుడు దీని పైన రుణం పొందే అవకాశం ఉంటుంది. బంగారంపై అప్పుని విరివిగా ఇవ్వడంతో మన పూర్వికులంతా బంగారంపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. దీంతో మన అందరిలో బంగారాన్ని పొదుపు సాధనంగా భావించడం, ఆస్తిలా దాచుకోవడం పెరిగింది. అయితే భద్రత పరంగా దీన్ని దాచుకోవడం కొంచెం కష్టం. ఈ రిస్కులతో పోల్చుకుంటే ఈక్విటీ అనేది అద్భుతమైన పొదుపు సాధనం. అందరికీ అందుబాటులో ఉండడం, కొంచెం కొంచెం డబ్బుతో పొదుపు చేయగలగడం ఈక్విటీ గొప్పతనం. చాలా లాభదాయక పెట్టుబడి సాధనం `ఈక్విటీ`.
gold generates only 6 percent profit
అందరూ ఇటువైపే..
దేశంలో నేడు 84 శాతం మంది రియల్ ఎస్టేట్, 11 శాతం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 6 శాతం మంది మాత్రమే ఆర్థిక ఆస్తులు కలిగి ఉన్నారు. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి వల్ల మనకు సంపద వస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ మనకు అవసరమైన వెంటనే సేల్ చేయలేం. ఇక్కడ ఫిజికల్ గా చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి గొప్పలు పోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అవ్వవచ్చు. గోల్డ్ కూడా బాగా డౌన్ అవ్వవచ్చు. ఎందుకంటే గత సంవత్సరంలో గోల్డ్ ఇచ్చిన 6% CAGR ఇచ్చింది.
equity is the best forever
ఈక్విటీ మంత్రం
రియల్ పెట్టుబడులు బంగారంకంటే ఎక్కువ రాబడి ఇచ్చి ఉండవచ్చు. కానీ అందరికీ ఇది అందుబాటులో ఉండదు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు, ఇప్పడిప్పుడే సంపాదన మొదలు పెట్టిన వాళ్లు ఈక్విటీ మార్కెట్లవైపు చూడవచ్చు. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకి ఇదే సరైన మార్గం. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఈ కోవలోకే వస్తాయి. మనకు ఎంత నచ్చితే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
మనకు వృద్దాప్యంలో డబ్బులు ఎక్కువ అవసరం ఉంటాయి కనుక ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
Leave a Reply