be care full with online loan apps
ఆన్లైన్లో ఇప్పుడు రుణం పొందడం చాలా సులువైంది. మారుతున్న టెక్నాలజీతో పాటు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే నేటి యువత ఆన్‌లైన్ రుణాలను ఆశ్రయిస్తున్నారు. సులభంగా రుణం పొందగలగడం, త్వరగా క్షణాల్లోనే పని జరుగుతుండడం, ఎటువంటి డాక్యుమెంట్లు, పేపర్ వర్క్ లేకపోవడంతో ప్రజలు ఎక్కడినుంచైనా లోన్ కోసం అప్లై చేయగలుగుతున్నారు.
బ్యాంకులతో పోలిస్తే ఫిన్ టెక్ సంస్థలు ఆన్ లైన్ ద్వారా సౌకర్యవంతంగా, ఎటువంటి శ్రమ లేకుండా రుణాలను మంజూరు చేస్తున్నాయి. చిన్న, చిన్న రుణాల విషయంలో లభ్యత అధికంగా ఉండడంతో వినియోగదారులు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రుణాలను తీసుకునే ముందు మనం కొన్ని విషయాలను గ్రహించాల్సి ఉంటుంది.
what we know before taking online loan
వీటిని పరిశీలించండి..
* మనం ఎంచుకున్న ఆన్‌లైన్ లోన్ ఫ్లాట్ ఫామ్ ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి.
ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా బంగారం లేదా వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసే ముందు ఆ ప్లాట్ ఫామ్ గురించి పరిశోధన చేయడం అవసరం. ఆర్బీఐ నేరుగా గానీ, ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన సంస్థకు అనుసంధానమైన భాగస్వామ్య సంస్థగానీ అయ్యి ఉండాలి. ముందుగా ఈ విషయాన్ని ధ్రువీకరించాలి.
* రుణం తీసుకునే ముందు మీ రుణ అవసరం ఏంటి ? స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక రుణమా ? హామీ ఇస్తున్నారా ? మనకు కావాల్సిన మొత్తానికి ఏ రకమైన రుణం ఎంచుకుంటే సరిపోతుంది ? చెల్లింపులు ఎలా ? ముందుగా ఈ విషయాలను తెలుసుకుని తర్వాత రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
* రుణ ఎంపికలో కీలకమైన అంశం వడ్డీ రేట్లు. రుణం కోసం దరఖాస్తు చేసే ముందు వడ్డీ రేట్లను పరిశీలించాలి. అన్ని సంస్థలు ఒకే రకమైన వడ్డీ రేటుతో రుణాలు అందించవు. అందువలన మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ సంస్థలు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూడాలి. డిజిటల్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు తక్కువగా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత రుణాలతో పోల్చితే బంగారంపై రుణాలు తక్కువ వడ్డీకి లభిస్తాయి.
* మనం ఏదైనా రుణాన్ని ఖరారు చేసి, ఒప్పంద పత్రంలో సంతకం చేసే ముందు సంబంధిత పత్రాల్లో ప్రతి నిబంధనను జాగ్రత్తగా చదవాలి. రుణాలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తెలుసుకోవాలి.
why we have to pay in online
ఆన్‌లైన్‌లో చెల్లించాలి..
ఆన్ లైన్ లెండింగ్ ఫ్లాట్ ఫామ్ చెల్లింపులకు వివిధ రకాల ఆప్షన్లు ఇస్తుంటాయి. అందుబాటులో ఉన్న చెల్లింపు మార్గాలను తెలుసుకుంటే మనకు అనుకూలమైన మార్గంలో చెల్లింపులు చేయవచ్చు. రుణ గ్రహీత తప్పనిసరిగా బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్‌సీ లేదా భాగస్వామ్య ప్లాట్ ఫామ్ తో నమోదు చేసిన అధికారక ఖాతాల ద్వారా ఆఫ్ లైన్ చెల్లింపులు చేయకూడదు. డిజిటల్ గా చెల్లింపులు చేస్తే మనం చెల్లింపులను ట్రాక్ చేసేందుకు వీలుంటుంది.
డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు వినియోగదారుని సౌలభ్యం కోసం `రియల్ టైమ్ కస్టమర్ సర్వీస్` ద్వారా సహాయాన్ని అందిస్తూ వినియోగదారునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా వడ్డీ, అసలు చెల్లింపులు తేదీలను గుర్తు చేస్తుంటాయి. ఈ మెయిల్స్‌ను, మెసేజ్‌లను తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. చెల్లింపుల్లో ఏదైనా ఆలస్యం అయితే ఫైన్‌లు పడతాయన్న విషయం గుర్తించాల్సిందే.