
మనిషి సంతోషంగా, నిశ్చింతగా ఉండడానికి ఆర్థిక స్వేచ్ఛ ఉండాల్సిందే. అంటే ఏ అవసరం వచ్చినా మన దగ్గర సరిపడినంత డబ్బు ఉండడం, జీవితకాలం హాయిగా బతికేగలిగే మానసిక, ఆర్థిక స్థైర్యం కలిగి ఉండడం. ఇలా ఉంటే జీవితం సాఫీగా, హాయిగా సాగిపోతుంది. మరి ఇలాంటి స్వేచ్ఛ రావాలంటే ఏం చేయాలి అని చెప్పేదే `మనీ మాస్టర్ ది గేమ్` బుక్..
2008లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినపుడు ప్రభుత్వాలు ఏదైనా సహాయం చేస్తాయోమోనని అనుకున్నారు. అలా అనుకున్నవారిలో టోనీ రోబిన్స్ కూడా ఒకరు. తర్వాత ఈ సంక్షోభం పై వచ్చిన ఇన్ సైడ్ జాబ్ అని డాక్యుమెంట్ ను చూశాక టోమీ నిరాశ ఒక ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకు సమాధానమే MONEY MASTER THE GAME అనబడే ఈ పుస్తకం. ప్రపంచంలో ఉన్న సుమారు 50 మంది మనీ ఎక్స్ఫర్ట్స్ అందరినీ ఇంటర్వూ చేసి వారు చెప్పిన విషయాలను ఒక చోటుకి చేర్చి ఆర్థిక స్వేఛ్చకు అవసరమైన 7 SIMPLE స్టెప్స్‌ని ఈ పుస్తకంలో రచయిత టోనీ రోబిన్స్ వివరించారు. ఈ పుస్తకంతో పాటుఆయన రాసిన AWAKEN THE GIANT WITH IN కూడా బెస్ట్ సెల్లర్స్ గా నిలిచింది.
ఈ 7 SIMPLE స్టెప్స్‌ని తెలుసుకుందాం.
STEP -1: COMPOUNDING
మానవ చరిత్రలోనే COMPOUNDING అనేది అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణ అని ఐన్ స్టీన్ అంటారు. కాని కొంతమంది మాత్రమే దాని పవర్ ని ఉపయోగించడం టోనీ ని ఆశ్చర్యపరిచింది.
ఎవరు త్వరగా తన సేవింగ్స్ ను మొదలుపెడతారో వారే త్వరగా ధనవంతులు అవుతారు.
money master the game book says about
ఇక్కడ మనం గుర్తించుకోవలిసిన కొన్ని విషయాలు…
* ప్రతినెలా మనకి వచ్చిన ఆదాయంలో కనీసం 10 శాతం సేవ్ చేయాలి.
* మాట్లాడే ముందు వినాలి. రాసే ముందు ఆలోచించాలి.
* ఖర్చు చేసేముందు సంపాదించాలి.
* ఇన్వెస్ట్ చేసేముందు ఇన్వెస్టగేషన్ చేయాలి.
* వదిలేసేముందు ప్రయత్నించాలి.
* రిటైర్ అయ్యేముందు సేవ్ చెయ్యాలి.
* చనిపోయేముందు ఉన్నదంతా ఇచ్చేయాలి.
STEP – 2: BECOME THE INSIDER
మన ఆర్థిక జీవితం రెండు భాగాల్లో ఉంటుంది.
1.ACCUMULATION PHASE 2. DECUMULATION PHASE
ACCUMULATION PHASE లో ఎక్కువ సేవింగ్ చేస్తాం.
DECUMULATION PHASE లో ఆదా చేసిన డబ్బును ఉపయోగిస్తాం.
మొదటి PHASEలో మనకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాం. అందుకే ఈ విషయాలను గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడాలి.
HOW TO BEAT THE MARKET
మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నపుడు మనం ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేయాలి. అందుకే ఎక్స్ పర్ట్స్ ఇండెక్స్ ఫండ్స్ ను ఎంచుకోవడం మంచిదని సలహా ఇస్తుంటారు.
* SMALL FEES
కంపెనీలు రకారకాల పేర్లతో ఇన్వెస్టర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి. కాబట్టి పూర్తి వివరాలను తెలుసుకుని మాత్రమే ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయ్యాలి.
* BROKERS
చాలా మంది బ్రోకర్స్ ఎక్కువ రిటర్న్స్ఆశ చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. కాని బ్రోకర్స్ ను కూడా పూర్తిగా నమ్మకూడదు. ఎందుకంటే తాము సూచించిన స్టాక్స్‌లో ఆ బ్రోకర్స్ కూడా ఇన్వెస్ట్ చేయరు.
* RISK AND RETURN
ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్స్ వస్తుందంటారు. అది పూర్తి నిజం కాదు. తక్కువ రిస్క్ తో కూడా ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు.
* BELIEFS
డబ్బు పట్ల మనకు ఉన్న తప్పుడు అభిప్రాయాలను నిజనిజాలతో పోల్చండి. మనం తక్కువ డబ్బులను ఆదా చేయగలం, ఖర్చులను తగ్గించలేం వంటి ఆలోచనలను తుడిచేయండి.
how to get financial freedom
ఆర్థికంగా మనం స్వతంత్రం పొందగలిగినప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుంది. లేదంటే ఆర్థిక సమస్యలు కలిగించే ఆందోళన, అలజడి ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేటప్పుడు అనుభవజ్ఞులకు కన్నీళ్లు రాలక తప్పదు. అందుకే ఆర్థిక ఆక్షరాస్యత పెంచుకునే వివిధ మార్గలను రచయిత టోనీ రోబిన్స్ అనేక వివరాలతో ఉదహరించి చెప్పారు. `మనీ మాస్టర్ ది గేమ్` బుక్ సమరీలో మిగిలిన స్టెప్స్ ని ఓ సారి చూద్దాం.
STEP -3: HOW MUCH YOU WANT
ప్రతి మనిషి ఆర్థికంగా 3 రకాల గోల్స్ పెట్టుకోవాలి.
లాంగ్ టర్మ్ 2. మిడ్ టర్మ్ 3. షార్ట్ టర్మ్
మన ఫైనాన్షియల్ డ్రీమ్ తీరాలంటే ముందు దానికి ఎంత డబ్బు అవసరమౌతుందో లెక్కలేసుకోవాలి.
మన నిర్ణయాలే మన జీవితాలను నిర్ధేశిస్తాయి. మన లక్ష్యం మనకి దూరంలో ఉన్నంత మాత్రాన మన నిర్ణయాలను తక్కువ అంచనా వేయకూడదు.
మన ఆర్థిక గమ్యం త్వరగా చేరుకోవాలంటే కొన్ని పనులు చేయాలి.
* ఎక్కువ ఆదా చేయడం. కేవలం మనం ఆదా చేసే ఆదాయంపై ఆధారపడకుండా ఇతర మర్గాల్లో ఆదాయం పొందే మార్గలను ఎంచుకోవడం.
* ఖర్చులు అవ్వగా మిగిలిన డబ్బులను మంచి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం.
* అధనపు చార్జీస్ తగ్గించే మర్గాన్ని వెతకడం.
STEP -4 : ASSET ALLOCATION
మనం ఎంత సంపాదించినా దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేయకపోతే మనం మొత్తం కోల్పోవలిసి వస్తుంది.
మన గోల్స్, అవసరాలు రిస్క్ తీసుకున్న సామర్థ్యం బట్టి మన ఆదాయాన్ని డివైడ్ చేసి వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడాన్నే ASSET ALLOCATION అంటారు.
ఈ డబ్బును 3 రకాలుగా విభజించాలి.
1.మన డబ్బును బ్యాంకుల్లో, ఆర్డీలో, బాండ్స్ లో, మార్కెట్ లింక్డ్ డిపాజిట్లో, గవర్నమెంట్ స్కీమ్స్ వంటి సేఫ్ మార్గాల్లో ఇన్వెస్ట్ చెయ్యాలి.
2.రియల్ ఎస్టేట్స్, స్టాక్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చెయ్యాలి.
3. వృద్దాప్యంలో డబ్బులు ఉన్నా ఎంజాయ్ చేసే శక్తి ఉండదు. కాబట్టి మనం సంపదను సృష్టించే సమయంలోనే కొంత డబ్బును ఎంజాయ్ మెంట్ కోసం పక్కన పెట్టాలి.
జీవితంలో మనకు లభించే వాటిని ఆస్వాదించాలి. ఆఖరి నిమిషం వరకు ఆగకూడదు.
STEP-5: BALANCED PORTFOLIO
మనకు ఆర్థికంగా 4 రకాల సీజన్స్ ఉన్నాయి.
1.INFLATION 2. DEFLATION 3.RECESSION 4.GROWTH
సీజన్స్ మారినప్పుడల్లా కొంతమంది లాభపడతారు. మరికొంత మంది నష్టపోతారు. మనం అన్ని సీజన్స్ లో లాభాలు రావాలంటే BALANCED PORTFOLIO ను ఫాలో కావ్వాలి.
మన వద్ద ఉన్న డబ్బును 40 శాతం లాంగ్ టర్మ్ బాండ్స్ లో, 30 శాతం స్టాక్స్ లో, 15 శాతం ఇంటర్మీడియట్ బాండ్స్ లో , 7.5 శాతం గోల్డ్ లో, 7.5 శాతం కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి.
ఎంతటి గొప్ప ట్రేడర్స్ కైనా భయం ఉంటుంది. ఆ భయాలు పోవాలంటే ఈ 4 రకాలను మన పోర్ట్ ఫోలియోలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల మనకు అధికంగా లాభాలు కొంచెం తగ్గినా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉండదు.
STEP -6: INVEST LIKE BILLIONAIRES
కష్టాల సమయంలోనే అవకాశాలను వెతుక్కోవాలి అని టెంపుల్ టన్ అనే బిలియనీర్ అంటారు.
టెంపుల్ టన్ వంటి కొందరు బిలీనియర్స్ కొన్ని సలహాలను అందించారు.
* మన వద్ద ఉన్న డబ్బును కోల్పోకుండా చూసుకోవాలి.
* డబ్బును ఎక్కువ పొందడానికి అప్పుడప్పుడు కొద్దిగా రిస్క్ చెయ్యాలి.
* నష్టాలను అంచనా వేసి డబ్బును DIVERSIFY చెయ్యాలి.
* ఎప్పుడూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి.
STEP -7: THE FINAL SECRET
మనం ఎంత సంపాదించినా సంతృప్తి లేకపోతే ఏదో వెలితిగానే ఉంటుంది. ఆ సంతృప్తి ఇతరులకు మనం ఇచ్చే ఆనందం వల్లే వస్తుంది.
మనకి ఎంత ఆస్తి ఉంది అనే దానిని బట్టి మనల్ని గౌరవించరు. మనం ఎంత ఇచ్చామో అనే దాని బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది.
మన జీవితం ఆనందంగా ఉండాలంటే 3 పనులు చెయ్యాలి.
* నిరంతరం నేర్చుకోవాలి.
* మనం నేర్చుకున్న దానిని అమలు చేయాలి.
* ఉన్నదానిలో కొంత అయినా ఇతరులకు ఇవ్వాలి.