
ప్రపంచంలో అత్యధిక మందిని ప్రభావితం చేసి, వారిలో ధనవంతులవ్వాలనే కాంక్షను రగిలించి, వారి ఆలోచనలను ప్రభావితం చేసిన ఒక గొప్ప పుస్తకం `RICH DAD AND POOR DAD `. జీవితంలో ఏదైనా సాధించాలని అనుకున్నవారు, కసితో ఎదగాలనుకున్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. అంత ప్రాధాన్యం ఉన్న పుస్తకంలో రచయిత ఏం చెప్పాడో ఓ సారి చూద్దాం..
who is the writer of rich dad poor dad
1997లో `RICH DAD AND POOR DAD` పుస్తకం సంచలనం సృష్టించింది. ఒక జపనీస్ అమెరికన్ అయిన Robert Kiyosaki రాసిన ఈ పుస్తకాన్ని 50 భాషలకు పైగా అనువదించారు. ఆర్థిక విద్య, ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేసింది. పెద్ద పెద్ద చదువులు చదివినవారు పేదవారిగా, మామూలు చదువులు చదివినవారు కోటీశ్వరులుగా ఎలా అవుతున్నారు. నిజమైన సంపద అంటే ఏమిటి..? ఆదాయానికి సంపదకి ఉన్న సంబంధం ఏమిటి..? నిజమైన ఆస్తిపరులెవరూ..? అసలు మనిషి డబ్బును ఎలా చూడాలి. ఎంత గౌరవం ఇవ్వాలి..? ఇలాంటి ఎన్నో విషయాలపై చర్చించిన పుస్తకం ఇది.
మరిన్ని విశేషాలు ఇలా..
RICH DAD AND POOR DAD పుస్తకం Robert Kiyosaki తన సొంత జీవితంలో జరిగిన రకారకాల సంఘటలను గురించి చెప్పిన కథ. ఈ పుస్తకంలో చెప్పిన ప్రకారం ఇతనికి ఇద్దరు తండ్రులుంటారు. ఒకరు సొంత తండ్రి. అతను పెద్ద పెద్ద చదువులు చదివి ఒక టీచర్ గా పనిచేస్తుంటారు. కాని అతనికి ఫైనాన్సియల్ నాలెడ్జ్ తక్కువ. కనుక అతనిని పూర్ డాడ్ గా పుస్తకంలో చెప్తారు.
రెండో వ్యక్తి తన స్నేహితుడి తండ్రి. అతను 8వతరగతి వరకూ చదివి సొంత బిజినెస్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు.ఇతనికి ఆర్థిక విషయాల పట్ల గొప్ప అవగాహన ఉండడంతో ఇతనిని `రిచ్ డాడ్` అని పుస్తకం మొత్తం సంభోదిస్తారు.
rich dad poor dad says about
* Robert Kiyosaki 9 ఏళ్ళు ఉన్నప్పుడు స్కూల్లో ధనవంతుల పిల్లలను చూస్తారు. వాళ్ళలాగే ధనవంతులు అవ్వాలని అనుకుంటారు. ధనవంతులు ఎలా అవుతారని వాళ్ళ పూర్ డాడ్ ని అడుగుతాడు. కాని అతని దగ్గర సమాధానం లేదు. అతను మీ స్నేహితుడి తండ్రిని అడుగు అని చెబుతాడు. తన రిచ్ డాడ్ దగ్గరకు వెళ్ళి ఈ ప్రశ్న అడుగుతాడు. అప్పుడే Robert Kiyosaki ఆర్థిక విద్య మొదలవుతుంది. డబ్బే అన్ని అనర్ధాలకు మూలం అని పూర్ డాడ్ చెబితే, డబ్బు లేకపోవడమే అన్ని కష్టాలకు మూలం అని రిచ్ డాడ్ అంటారు. ఒకరేమో తమ కోరికను పూర్తిగా సమాది చేస్తే మరొకరు దానిని ఎలా కొనాలి అని ఆలోచిస్తూ మెదడుకు పని పెట్టేవారు. కష్టపడి చదివితే ఒక కంపెనీలో ఉద్యోగం చేయవచ్చు. అని పూర్ డాడ్ అంటే , కష్టపడి చదవండి. ఒక కంపెనీని కొనవచ్చు. అని రిచ్ డాడ్ అంటారు. నాకు పిల్లలు ఉండడం వల్ల నేను ధనవంతుడు కాలేకపోయాను అని పూర్ డాడ్ అంటే, నాకు పిల్లలు ఉండండం వల్ల నేను ధనవంతుడయ్యాను అని రిట్ డాడ్ అంటున్నారు. ఇలా Robert Kiyosaki కి సపోర్ట్ గా ఉంటు 30 సంవత్సరాలు పాటు రిచ్ డాడ్ నేర్పించిన రహస్యాలను ఈ పుస్తకంలో పూర్తిగా వివరించారు.
THE RICH DON’T WORK FOR MONEY
ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. డబ్బుతో పనిచేయిస్తారు. పేద, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే డబ్బుకోసం పనిచేస్తారు. రిచ్ డాడ్ చెప్పిందేమిటంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒక వలయంలో చిక్కుకుని ఉన్నారు. వీరు జీవితాంతం కష్టపడుతునే ఉంటారు. కాని ఫలితం మాత్రం వేరొకరు అనుభవిస్తూ ఉంటారు.
* ఉద్యోగులు వారికొచ్చే జీతంలో నుంచి గవర్నమెంటు మొదట తన షేర్ ను వసూలు చేసుకుంటుంది. జీతానికి పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక విషయాల పట్ల అవగాహన ఉండదు. రిచ్ డాడ్ Robert Kiyosaki కి ఒక సలహా ఇస్తారు. అది ఏమిటంటే నువ్వు ఉద్యోగం చేస్తూనే ఒక సంస్థను కానీ వ్యాపారాన్ని కానీ మొదలుపెట్టు. అది నీకు మంచి అసెట్ అవ్వాలి. దాని నుంచి నీకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండాలి అని చెబుతాడు. దాని గురించి రాబర్ట్ ఆలోచిస్తున్న సమయంలో పక్కింటి వాళ్ళు కొన్ని పుస్తకాలను బయట పడేయడం చూస్తారు. అపుడు వాళ్ళతో రాబర్ట్ మాట్లాడి ఆ పుస్తకాలను తీసుకుని మైక్ వాళ్ళంటిలో ఒక ఖాళీ గదిలో పెట్టి లైబ్రేరి గా మారుస్తాడు. దానికి మైక్ చెల్లిని లైబ్రేరియన్ గా పెడతాడు. ఎవరు చదవడానికి వచ్చినా వారి దగ్గర కొంత డబ్బులు వసూలు చేయమని చెబుతాడు. అలా వారంలోపు 9 డాలర్లు వసూలవుతాయి. ఇలాంటి చిన్న చిన్న పనులతో మనల్ని ఆలోచింప చేయడం ఈ పుస్తకం లక్ష్యం.
what is the need of financial literacy
ఆర్థిక అక్షరాస్యత ఎందుకు?
మీరు ఎంత డబ్బు సంపాదిస్తారనేది ముఖ్యం కాదు. ఎంత మిగిలిస్తారనేదే ముఖ్యం.
డబ్బులు ఏమి చేయాలో ఎక్కడ పెట్టాలో తెలియని వారికి కోట్ల రూపాయలు ఇస్తే వారు దానిని ఖర్చు పెట్టడం తప్ప ఏమీ చేయడు. వారికి ఆర్థిక విద్య లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మనలో చాలా మందికి అసెట్స్ కి లయబెలిటీస్ కి తేడా తెలియదు. అందరూ సొంత ఇంటిని అసెట్స్ అనుకుంటారు.
అసెట్స్ అంటే మన జేబులోకి డబ్బులు తెచ్చేవి. లయబిలిటీస్ అంటే మన జేబులో నుంచి డబ్బులు తీసేవి. ధనవంతులు అసెట్స్ కొంటారు. పేదవారు లయబిలిటీస్ ని కొంటారు. మనం డబ్బు సంపాదించిన లేదా లాటరీ ద్వారా వచ్చిన అసెట్స్ లో పెట్టుబడి పెడితే మంచిది.
ఇంకొక విషయమేమిటంటే ఒక వ్యక్తికి చెందిన రూపాయి రాకపోకలను క్యాష్ ఫ్లో చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
what is cash flow chart in rich dad book
క్యాష్ ఫ్లో చార్ట్‌ను ఇలా విభజించారు.
1.ఇన్ కమ్ అంటే ఉద్యోగం ద్వారా లేదా బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం.
2 ఎక్స్ పెన్సెస్ అంటే ఆ నెలలో మనం చేసే ఖర్చు.
3. అసెట్స్ ఇందులో మనం కొన్న ప్రోపర్టీస్, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ కార్డు ఇన్ స్టాల్మెంట్ ఇలాంటివి.
4. లయబెలిటీస్ ఇందులో మనం కొన్న కారు, అపార్టమెంట్ మొదలైనవి.
మనం పేదవారి క్యాష్ ఫ్లో చార్ట్ చూస్తే వాళ్ళకొచ్చిన జీతం ఆ నెలలోనే ఖర్చు అయిపోతుంది.
మధ్యతరగతి వారు సంపాదించిన డబ్బు ఇన్ కమ్ బాక్స్ నుంచి కొంత ఎక్స్ పెన్సస్ లోకి కొంత లయబిలిటీస్ లోకి వెళ్తుంది. ధనవంతులు సంపాదించిన డబ్బు ఇన్ కమ్ బాక్స్ నుంచి అసెట్స్ లోకి వెళ్లి తిరిగి ఆదాయం రూపంలో ఇన్ కమ్ బాక్స్ లోకి వచ్చేస్తాయి. దీనినే రిచ్ డాడ్ ఆర్థిక అక్షరాస్యత అంటారు.
what are real assets
జీవితంలో ప్రత్యక్షంగా నేర్చుకున్న అనుభవాలనే పాఠాలుగా బోధించి మనకు ఎన్నో విషయాలను నేర్పించేందుకు రాబర్ట్ కియోసకి చేసిన ప్రయత్నం నిజంగా అద్భుతమే. ధనవంతుడు మరింతగా ఎదగడానికి, పేదవాడు మరింతగా క్షీణించడానికి కారణాలను చాలా చక్కగా వివరించి, విశ్లేషించారు. రిచ్‌డాడ్‌లో చెప్పిన మరిన్ని పాఠాలను ఓసారి చూద్దాం.
ముందు ఆస్తులు.. తర్వాతే విలాసాలు
ధనవంతులు తమకు అసెట్స్ ఎన్ని ఉన్నాయని లెక్కిస్తుంటే, పేదవారు తమ ఆదాయ వివరాల్ని లెక్కిస్తుంటారు. మనం చేస్తున్న ఉద్యోగంతో పాటు మంచి అసెట్స్ కూడా ఏర్పరుచుకుంటే వాటి ద్వారా కూడా మనకు ఆదాయం వస్తుంది. ధనవంతులు ముందు ఆస్తులు కొని తర్వాత విలాసవంతమైన వస్తువులు కొంటారు. కాని పేదవారు తమ కష్టపడి సంపాదించిన డబ్బుతో ముందు విలాస వస్తువులు కొంటారు.
THE HISTORY OF TAXES AND THE POWER OF CORPARATIONS
పేదవారికి ధనవంతులకి మధ్య తేడా తగ్గించడానికి టాక్స్ సిస్టమ్ పుట్టింది. గవర్నమెంటు పొందే టాక్స్ ఆదాయంలో ఎక్కువ మధ్యతరగతివాళ్లే చెల్లిస్తుంటారు. ధనవంతులు వారికున్నా వ్యాపారుల లేదా సంస్థల ద్వారా తాము సంపాదించిన డబ్బును రకారకాలుగా పెట్టుబడులు పెట్టి తెలివిగా ఖర్చు పెట్టి దాదాపు అన్ని అవసరాలు తీరిన తర్వాత రకారకాల కూడికలు, తీసివేతలు చేసి మిగిలిన సొమ్మును టాక్స్ గా కడతారు. కానీ మధ్యతరగతి వాళ్ళు తాము సంపాదించిన దాంట్లో టాక్స్ కట్టిన తర్వాత మాత్రమే డబ్బు చేతికి వస్తుంది.
* రిచ్ డాడ్ చెప్పిన ముఖ్యమైనది. పవర్ ఆఫ్ కార్పోరేషన్.. అంటే `సంస్థలు – వాటి శక్తి`
ముందుగా ఉద్యోగస్తుల గురించి రిచ్ డాడ్ చెబుతున్నారు. మనం డబ్బుకోసం పనిచేస్తుంటే అధికారం మన యజమానికి ఇచ్చినట్టే. డబ్బు మన కోసం పనిచేస్తే అధికారం మనదే, నియంత్రణ మనదే.
THE RICH `INVENT` MONEY
ధనవంతులు డబ్బును కనిపెడతారు. మనం డబ్బును ఎలా సంపాదించాలి అని కాకుండా డబ్బును ఎలా కనిపెట్టాలి అని ఆలోచించాలంటున్నారు రిచ్ డాడ్. ఆర్థిక మేధస్సు ప్రతి మనిషికి ఉండాలని, దానివల్ల అవకాశాలు ఎలా సృష్టించుకోవచ్చో, వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకోవచ్చో తెలుస్తుందని ఇక్కడ చెప్తారు. మనకున్న ఏకైక గొప్ప ఆస్తి మన మెదడు. దానికి సరైన శిక్షణ అందిస్తే గొప్ప సంపదను ఇస్తుంది. ఎటువంటి శిక్షణ లేకపోతే కటిక పేదరికంలోకి తోసేస్తుంది.
WORK TO LEARN DON’T WORK FOR MONEY
ధనవంతులు ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. ధనవంతులు వారి వస్తువులను ప్రపంచం మొత్తం ఎలా అమ్ముకోవాలో, వారి సేవలను ప్రపంచం మొత్తం ఎలా విస్తరించాలో నేర్చుకుంటారు. వీరిలో ముఖ్యంగా 3 స్కిల్స్ చూడవచ్చు. క్యాష్ ప్లో ను సరిగా చూసుకోగలగడం. వారి బిజినెస్ లో ఉన్న రకారకాల సిస్టమ్ లను సరిగ్గా ఉపయోగించగలగడం. మానవ వనరులను అద్భుతంగా వాడుకోవడం.
ఈ అడ్డంకుల్ని అధిగమించాల్సిందే..
* భయం.. అంటే పేదవారికి డబ్బు సంపాదిస్తున్నామని ఆనందం కంటే నష్టపోతామని భయం ఎక్కువగా ఉంటుంది.
* అనుమానం.. మనం పెట్టుబడి పెట్టేటపుడు మన మనసులో రకారకాల అనుమానాలు కలుగుతాయి. వాటిని దాటుకుని రాగలగాలి.
* సోమరితనం.. మనిషికి సోమరితనం పెద్ద శత్రువు. అది మనకు ముందుకు కదలనీయదు. దీనికి రిచ్ డాడ్ ఏమి చెప్పారంటే మనిషి కొంచెం అత్యాశగా ఉండడం.
* చెడు అలవాట్లు… మనకు నెలజీతం రాగానే ముందు అన్ని బిల్లులు కట్టేసి తర్వాత మిగిలిన దానిని ఇన్వెస్ట్ చేస్తాం. కానీ రిచ్ డాడ్ ఏమి చెప్పారంటే ముందు మనం ఇన్వెస్ట్ చేసి తర్వాత మిగతా బిల్లులు కట్టాలి.
* ఈగో… డబ్బు సంపాదించడంలో తమకు మంచి పరిజ్ఞానం ఉన్నట్లు చెప్పుకుంటారు. దాని వల్ల చాలా సార్లు ధనాన్ని నష్టపోతారు. తెలియని విషయాల్ని అడిగి తెలుసుకుంటే మంచిది. పైగా రాబోయే నష్టాన్ని కూడా నివారించవచ్చు.
రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి బాగా వివరించావు.. పుస్తకం చదివించే లాగా చెప్పావ్