
the miracle morning book summery telugu
జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటే మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలి. కొన్ని పద్ధతులను పాటించాలి. కొన్ని అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకోవాలి. అయితే వీటన్నింటికీ ముందుగా మన దిన చర్యను, ప్రతి ఉదయం ఎలా ప్రారంభిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ది మిరాకల్ మార్నింగ్ పుస్తకంలో రచయిత HAL ELROD ప్రతి ఉదయం చేయవలసిన కొన్ని గొప్ప విషయాలను స్పష్టంగా వివరించారు.
పరిశీలన ముఖ్యం..
జీవితంలో బాధాకరమైన విషయం ఏమిటంటే చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుని ఏదో చెయ్యలేకపోయానని బాధపడడం. ఇలా మనం బాధపడి పశ్చాత్తాపం చెందకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్త పడాలి. ఇలా బాధపడకుండా ఉండాలంటే ముందు కొన్ని విషయాలను మనం పరిశీలించుకోవాలి.
* ACNOWLEDGE…
మన చుట్టూ అందరూ చేసే ప్రధాన తప్పులు, బాధపడడానికి ఉన్న అత్యంత సాధారణ విషయాలేమిటో తెలుసుకోవాలి.
* IDENTIFY CAUSES…
మనం ప్రాబ్లమ్స్ ని గుర్తించాక ఆ ప్రోబ్లమ్స్ మళ్లీ రాకుండా ఉండాలంటే వాటికి మూలకారణాలు తెలుసుకోవాలి. కొన్ని కారణాలు ఏమిటంటే…
– చిన్నప్పటి నుంచి మనకి ఎదురైన సంఘటనలు, అనుభవాలు, మనవల్ల కాదులే అనిపించిన సందర్భాలు వంటివన్నీ సబ్ కాన్సియస్ మైండ్ లో స్టోర్ అయ్యి మన ఎదుగుదలకు అడ్డుపడుతుంటాయి.
– లైఫ్ పర్పజ్ ఏమిటో క్లారిటీ లేకపోవడం.
– చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం.
– పర్సనల్ డవలప్ మెంట్ కి టైమ్ కేటాయించకపోవడం.
* DECIDE NOW…
ఈ రోజు నుంచే మనం ఏం చేయాలనుకుంటున్నామో అన్న విషయంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ డెసిషన్‌కి కట్టుబడి వెంటనే ముందుకు సాగాలి.
what are the WAKE UP TIPS
మన ఆలోచనలను, మన నిర్ణయాలను ప్రభావితం చేసే వాటిలో నిద్ర, మేల్కోవడం అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయం చాలా మంది విజేతల జీవితంలో నిరూపితం అయ్యిందని కూడా మనం తరచూ వింటుంటాం. ఈ విషయం గురించి రచయిత కొన్ని మెళకువలు చెప్తున్నారు.
– మనలాంటి వాళ్లందరికీ నిద్ర లేవడం అనేది చాలా కష్టమైన పని. కాని ఒక మనిషికి 5 గంటలు నిద్ర సరిపోతుంది అని ఇక్కడ తెలుసుకోవాలి.
-మన మైండ్ ని బెడ్ ఎక్కేముందు సెట్ చేసుకోవాలి. రేపటి రోజును నేను ఎనర్జిటిక్ గా మొదలుపెడతాను అని బలంగా అనుకోవాలి.
– మనం ఎన్ని గంటలకు లేవాలి అని బలంగా అనుకుంటామో ఆ సమయానికి మనం లేవగలుగుతాం. వీటినే బయోలాజికల్ అలార్మ్స్ అంటారు. ఇక్కడ మన సంకల్పమే మనల్ని నిద్ర లేపుతుంది.
– మన అలారంను బెడ్ కి దూరంగా ఉంచాలి. ఎందుకంటే అలారం ఆపడానికైనా మనం లేవాలి కనుక.
తర్వాత వాటర్ తాగి కాలకృత్యాలు తీర్చకుని మిరాకిల్ మార్నింగ్ కి సిద్దం కావాలని రచయిత సూచిస్తున్నారు.
మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది విజేతలుగా చేసే అలవాట్లను రచయిత The Life `S.A.V.E.R.S`గా వివరించారు. వాటిని ఎలా ప్రాక్టిస్ చేయాలో ఈ కింద చూద్దాం.
S-SILENCE
ఒక సంవత్సరంలో పుస్తకంను నుంచి నేర్చుకున్న దానికంటే , ఒకగంట నిశ్శబ్దంగా ఉంటే ఎక్కువ నేర్చుకోవచ్చని రచయిత తెలిపారు.
నిశ్శబ్దంగా ఉన్నపుడు మెడిటేషన్ చెయ్యడానికి కొన్ని సింపుల్ టిప్స్ వివరించారు.
– మన మైండ్ ని సెట్ చేసుకోవాలి.
– మన ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
– మనం కూర్చున్నపుడు మన శరీరాన్ని స్ట్రైట్ గా ఉంచాలి.
– మన శ్వాసను పరిశీలించాలి. దీనికోసం 3 – 3 – 3 పద్దతిని అనుసరించాలి. అంటే 3 సెకెన్స్ గాలి పీల్చడం, 3 సార్లు హోల్డ్ చేయడం, 3 సార్లు వదిలివేయడం చెయ్యాలి.
A-AFFIRMATIONS
మన జీవితంలో ఏమవుదామనుకుంటున్నామో ఆ విషయాన్ని మనం బలంగా ధ్రువీకరించుకోవాలి. అలా అనుకున్న వాటిని సాధించడానికి ఉపయోగపడే బెస్ట్ టెక్నిక్ AFFIRMATIONS. దీనిని క్రియేట్ చేసుకోవడానికి రచయిత 5 టిప్స్ ని వివరించారు.
– మనం జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో అది క్లియర్ గా తెలుసుకోవాలి.
– మనం దానిని ఎందుకు సాధించాలనుకుంటున్నామో తెలియాలి.
– మనం సాధించాలనుకున్న దానికి మనం ఎంత కృషి చేస్తున్నామో పరిశీలించుకోవాలి.
– మనకి కనెక్ట్ అయ్యే కొటేషన్స్ ని మన AFFIRMATIONSలో యాడ్ చేయాలి.
– AFFIRMATIONS ని ప్రతిరోజూ 5 సార్లు రిపీట్ చేయండి.
V-VISUALIZATION
Visualization ను ఉపయోగించి ఎంతోమంది జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. అంటే మనం జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నామో దానిని ఊహించుకోవడం. ఇలా Visualization ను ఎలా ఉపయోగించాలో కొన్ని టిప్స్ ను వివరించారు.
– మనకిష్టమైన ప్లేస్ లో కూర్చుని, మనకిష్టమైన మ్యూజిక్ ని లో వాల్యూమ్ లో ఉంచి కళ్ళు మూసుకుని ఇమేజిన్ చెయ్యడానికి సిద్దమవ్వాలి.
– మనం కోరుకున్నది సాధించినట్టు ఊహించుకోవాలి.
– మనం అనుకున్నది సాధించడానికి మనం చెయ్యబోయే యాక్షన్స్ కూడా విజువలైజ్ చేయాలి.
– ఈ ప్రోసెస్ ను ప్రతిరోజు 5 నిమిషాలు చేయడం ద్వారా మనలో ఒక పోజిటివ్ ఎనర్జీ చేరి మన యాక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ కలిగి తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం.
E-EXERCISE…
మనం EXERCISE కి సమయం కేటాయించకపోతే తర్వాత కాలంలో మన రోగాలకు టైం కేటాయించవలిసి ఉంటుంది. మనం ప్రతిరోజూ ఉదయం 20 నిమిషాలు EXERCISE కి టైం కేటాయిస్తే దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదు.
R-READING
మన శరీరానికి EXERCISE ఎలాగో మన మైండ్ కి రీడింగ్ అంత ముఖ్యం. ప్రతిరోజు మనం 20 నిమిషాలు చదివితే మన జీవితానికి అవసరమైన జ్ఞానం పుస్తకాలు మనకి అందిస్తాయి. మన ప్రయాణంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనడానికి కావాల్సిన తెలివి, మెళకువలు పుస్తక పఠనంతో అలవడతాయి.
S-SCRIBING
ప్రతిరోజూ ఉదయం మన ఆలోచలను, మనం గ్రేట్ పుల్ గా ఫీలయ్యే విషయాలను, ఆ రోజు చెయ్యవలిసిన పనులను పుస్తకంలో రాయాలి.
ఇలా రాయడం వల్ల మనలో క్రియేటివిటీ పెరుగుతుంది. మనలో పాజిటివ్ వాతావరణం వస్తుంది.