
ప్రపంచ మార్కెట్లలో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. పెద్ద స్టాక్ మార్కెట్ అయిన అమెరికన్ లో స్టాక్స్ కూడా చాలా కరెక్షన్స్ కు గురవుతున్నాయని అనుకున్నప్పడు ఇండియన్ మార్కెట్లో మనం ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే విషయంలోచాలా మందికి ఒక సందేహం కలుగుతుంది. ఈ వాలటాలిటీని తట్టుకుని లాభం సంపాదించాలంటే ఉన్న ఒక పరిష్కారం డివిడెండ్.
డివిడెండ్ ఇచ్చే కంపెనీలపై మనం ఫోకస్ పెడితే మంచిది. స్టాక్ మార్కెట్లో చాలా రకాల ఇన్వెస్ట్ మెంట్ థీమ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా గ్రోత్ ఓరియెంటెడ్ కంపెనీలు, డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
– గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీలకి మార్కెట్ వాలటాలిటీతో సంబంధం ఉంటుంది. కానీ డివిడెండ్ ఇచ్చే కంపెనీలకు మార్కెట్ వాలాటాలిటీతో సంబంధం లేకుండా మనకి ప్రాఫిట్ ను ఇస్తాయి.
– 10 శాతం కంటే ఎక్కువ డివిడెండ్ ఇచ్చే కంపెనీలు 600 వరకు ఉన్నాయి. కొన్ని కంపెనీలు 15 నుంచి 20 శాతం వరకు రెగ్యులర్‌గా ప్రతి సంవత్సరం డివిడెండ్‌ని ఇస్తాయి. ఇలాంటి కంపెనీలను గుర్తించడం చాలా అవసరం.
– మనీకంట్రోల్ వెబ్ సైట్ లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం దొరుకుతుంది. టిక్కర్‌టేప్ వంటి మొబైల్ యాప్‌లలో కూడా ఏ కంపెనీ ఎంత శాతం డివిడెండ్‌ని ఇస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటివి మరి కొన్ని వెబ్‌సైట్‌ల ఆధారంగా మనం ఈ సమాచారాన్ని పోగు చేసుకుని హై లీ డివిడెండ్ ఈల్డ్ స్టాక్‌లను గుర్తించి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.
list of high dividend stocks
కొన్ని హై డివిడెండ్ ఇచ్చే షేర్లు..
– బీపీసీఎల్
– ఐఓసీ
– కోల్ ఇండియా
– ఐటీసీ
– హిందుస్తాన్ జింక్
– పవర్ గ్రిడ్ కార్పొరేషన్
– హిందుస్థాన్ గ్లోబల్
– వేదాంత
– ఆర్ఏసీ
ఇలా ఎన్నో డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో వేర్వేరు సెక్టారు గల 10 కంపెనీలను తీసుకుని ఈక్వల్ గా అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే దీర్ఘకాలంలో ప్రతి సంవత్సరం ఇన్ కమ్ ని మనం పొందవచ్చు.
types of dividends
డివిడెండ్ ని రకరకాలుగా లెక్కించుకోవచ్చు
* కొన్ని కంపెనీలు డివిడెండ్ ని ఫేస్ వాల్యూ మీద డిక్లేర్ చేస్తాయి.
* డివిడెండ్ పే ఔట్: ఒక షేర్ కి ఎంత ప్రాఫిట్ వస్తుంది.. ఆ వచ్చిన ప్రాఫిట్ లో నుంచి మనకి ఎంత శాతం డివిడెండ్ కంపెనీ ఇస్తుందో దానిని డివిడెండ్ పే ఔట్ అంటారు.
* డివిడెండ్ ఈల్డ్: కరెంట్ షేర్ ప్రైస్ లో మనం కొంటే మనకు ఎంత వడ్డీ గిట్టుబాటు అవుతుందో దానిని డివిడెండ్ ఈల్డ్ అంటారు.
డౌన్ సైడ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి డివిడెండ్ ఈల్డ్ అనేది ఒక కారణం. అలాగే మనం ఈ స్టాక్స్ కొని ఆప్షనల్ ట్రేడింగ్ చేసుకుంటే మంత్లీ 1 శాతం ఎక్స్ ట్రా ఇన్ కమ్ పొందవచ్చు దీనినే కవర్ కాల్ స్ట్రేటజీ అంటారు.