what is dividend in stock market
ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్ కు పంచడాన్ని డివిడెండ్ అంటారు. అంటే ఒక కంపెనీ భాగా లాభాల్లో వచ్చినపుడు ఆ లాభాల్లో కొంత తిరిగి ఆ కంపెనీ అభివృద్దికి ఖర్చు చేస్తుంది. అలాగే కొంత భాగాన్ని డివిడెండ్స్ రూపంలో ఆ కంపెనీ షేర్ హోల్డర్ కి పంచిపెడుతుంది. అయితే అన్ని కంపెనీలు ఈ డివిడెండ్స్ ఇవ్వవు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఈ డివిడెండ్స్ ని ఇస్తాయి. సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికొకసారి గాని, 6 నెలలకొకసారి గాని లేదా 3నెలలకొకసారి గాని ఇస్తారు.
ప్రతి మూడునెలలకొకసారి అన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి. వీటితో పాటే ఈ డివిడెండ్స్ కి సంబంధించిన వివరాలను కూడా ప్రకటిస్తాయి. అయితే కంపెనీ ప్రతిసారి ఒకే విధంగా డివిడెండ్ ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ పాలసీస్ ని మార్చుకుంటాయి. అది ఆ కంపెనీకి వచ్చిన లాభాలు పైన ఆధారపడి ఉంటాయి. మనకి కంపెనీ షేర్ ప్రైస్ పెరగడం ద్వారా మనకి భాగా లాభాలు వస్తున్నాయి కదా మరి ఆ కంపెనీలు డివిడెండ్స్ ఇవ్వడం ఎందుకు అనుకోవచ్చు. కంపెనీలు తమ షేర్స్ ని పబ్లిక్ కు అమ్ముతాయి. ఇక్కడ ఎంత ఎక్కువ మంది ఆ షేర్లను కొంటే అంతగా ఆ కంపెనీ దగ్గర ఇన్వెస్ట్ ఏర్పడుతుంది. అయితే ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలలో వచ్చే షేర్ ప్రైస్ పెరగడంతో వచ్చే లాభంతో పాటుగా ఈ డివిడెండ్స్ కూడా బోనస్ గా రావడంతో ఇలా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఈ విధంగా ఇన్వెస్టర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి డివిడెండ్స్ ను ప్రకటిస్తుంటాయి.
Types Of Dividends
1.cash dividend
2.stock dividend* Cash dividend అంటే కంపెనీలు తమకు వచ్చిన లాభాలను డివిడెండ్స్ రూపంలో ఇవ్వాలనుకున్నప్పుడు వాటిని క్యాష్ రూపంలో షేర్ హోల్డర్లకు ఇస్తుంది. అయితే కంపెనీ ఈ డివిడెండ్స్ ని పే చేసినపుడు ఆటోమెటిక్ గా ఆ డబ్బు బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా మన బ్యాంకు అకౌంట్ కి జమ అయిపోతుంది. ఒక వేళ మనకు కావాలనుకుంటే చెక్ ద్వారా మనం పొందవచ్చు.
what is stock dividend
stock dividend అంటే కంపెనీలు తమకు వచ్చిన లాభాలను డివిడెండ్ ను క్యాష్ రూపంలో కాకుండా స్టాక్స్ రూపంలో పే చేస్తే దానిని స్టాక్స్ డివిడెండ్ అంటారు. అంటే మనం కొనవలసిన అవసరం లేకుండానే కొన్ని షేర్స్ ని అధనంగా మన అకౌంట్ లో add చేస్తుంది. ఈ విధంగా పే చేసె డివిడెండ్ ని స్టాక్ డివిడెండ్ అంటారు.
ఈ డివిడెండ్స్ ద్వారా వచ్చే అమౌంట్ కి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కంపెనీ డివిడెండ్ ని స్టాక్ డివిడెండ్ ద్వారా పే చేస్తే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి అధనంగా వచ్చిన షేర్లను అమ్ముతామో అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.