
what is fundamental analysis
మనం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకున్నప్పడు మొదటగా ఆలోచించేది ఏ కంపెనీలో డబ్బులు పెట్టాలో అని చాలా ఆలోచిస్తాం. ఇందులో పెడితే డబ్బులు పోతాయని.. అందులో పెడితే డబ్బులు వస్తాయని చాలా మంది చాలా కంపెనీల పేర్లు చెప్తుంటారు. మనం సందిగ్ధంలో ఇరుక్కుని ఏం చేయాలా అర్థం కాక గందరగోళానికి గురవుతుంటాం. ఇలాంటి వాళ్లందరూ మొదట తెలుసుకోవాల్సిందే ఫండమెంటల్ ఎనాలిసిస్..
ఏ కంపెనీలో అయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయో దానిని ఇన్వెస్ట్ చేయడం మంచిది. Fundamental analysis అనేది ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చా? భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తుందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
key factors in Fundamental analysis
ఫండమెంటల్ ఎనాలిసిస్ ముఖ్య విషయాలు
– Balance sheet
– Income statement
– cash flow statement
ఇవన్నీఒక కంపెనీ బలంగా ఉందా లేదా అని తెలియజేస్తాయి.
Balance sheet లో ప్రధానంగా..
* Assets(సంపద): అంటే ఒక కంపెనీలో డబ్బు, ఆస్తి, విలువైన సంపద ఉన్నట్లయితే ఆ కంపెనీకి ఎక్కు వగా Assets ఉన్నాయని అర్థం.
* Liability: అంటే అప్పులు, ట్యాక్స్ మార్ట్ గేజ్ లోన్స్ ఇవి ఎక్కువగా ఉండటం. ఇవి ఎక్కువగా ఉన్న కంపెనీకి దూరంగా ఉండడం మంచిది.
* Equity (capital):
ఒక కంపెనీ స్టాక్స్ ని పబ్లిక్ కి ఇష్యూ చేయడం ద్వారా ఎంత డబ్బు కూడబెట్టిందో దానిని capital అంటారు. దీన్ని కంపెనీ తన వ్యాపార ఖర్చులకి ఉపయోగిస్తుంది. అందుచేత ఏ కంపెనీకి అయితే Assets, capital ఎక్కువ ఉంటాయో ఆ కంపెనీని ఎంచుకోవడం మంచిది.what is Income statement
దీనిలో ఆదాయం, ఖర్చులు అని ఉంటాయి. ఆదాయంలో, ఖర్చులు తీసేస్తే వచ్చే దానిని నెట్ ఇన్ కమ్ అంటారు. ఇదే కంపెనీకి మిగిలిన చివరి లాభం. ఈ లాభాన్ని కంపెనీ రెండు విధాలుగా ఖర్చుపెడుతుంది. ఒకటి షేర్ హోల్డర్ కి డెవిడెండ్ ని పంచుతుంది. ఇంకొకటి కంపెనీ విస్తరింపజేయడానికి, అబివృద్ది చేయడానికి ఉపయోగిస్తుంది. తద్వారా కంపెనీకి మరింత డబ్బు వస్తుంది. దీనిని నగదునిల్వ అంటారు. ఈ డబ్బు కంపెనీ దగ్గర ఉండిపోతుంది. ఎప్పుడైనా కంపెనీకి ఒడి దుడుగులు వస్తే బయటపడటానికి ఈ డబ్బుని ఉపయోగిస్తుంది.
cash flow statement
నగదు నిల్వాని ఎలా ఉపయోగిస్తుంది లేదా ఇంకేదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుందా ఇలా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నగదు నిల్వా ఇంకా పెరుగుతుందా వీటన్నింటిని తెలిపేదే cash flow statement అంటారు.