ప్రపంచంలో విజయవంతమైన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, బిలియనీర్ల జీవితాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వారు కేవలం ఎక్కువ గంటలు పనిచేయడం వల్లే విజయం సాధించలేదు. వారు మిగతా వారికంటే భిన్నంగా ఆలోచించారు. సరైన సమయంలో(Want to Get Rich?) సరైన నిర్ణయాలు తీసుకున్నారు. తమ సమయాన్ని, జ్ఞానాన్ని, అవకాశాలను తెలివిగా ఉపయోగించుకున్నారు. అందుకే సాధారణ స్థాయి నుంచి అసాధారణ విజయాలను అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, భారత ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి రోజూ పుస్తకాలు చదవడానికి సమయం కేటాయిస్తారు. ఎందుకంటే పుస్తకాలు మనకు అనుభవజ్ఞుల ఆలోచనలను, వారి విజయాలు–వైఫల్యాలను తక్కువ సమయంలో నేర్చుకునే అవకాశం కల్పిస్తాయి. అలాంటి ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు నావెల్ రవికాంత్ ఒకరు. ఆయన ఆలోచనలు, వ్యాపార దృక్పథం, సంపద సృష్టి సూత్రాలను సమగ్రంగా వివరిస్తూ వచ్చిన ‘ది ఆల్మనాక్ ఆఫ్ నావెల్ రవికాంత్’ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇందులో సంపద అంటే ఏమిటి? దానిని ఎలా నిర్మించాలి? ఎలా కాపాడుకోవాలి? జీవితంలో విజయానికి అవసరమైన మానసిక ధోరణి ఏమిటి? వంటి అనేక అంశాలను ఆయన సులభంగా వివరించారు.
కష్టం కాదు.. సరైన నిర్ణయమే విలువైనది.. Judgment Is More Valuable Than Hard Work
చిన్నప్పటి నుంచి ‘కష్టపడితేనే విజయం’ అనే మాట మనం వింటూ పెరుగుతాం. కష్టపడటం అవసరమే. కానీ కష్టానికి సరైన దిశ లేకపోతే ఫలితం ఆశించినంతగా(Want to Get Rich?) ఉండదని నావెల్ రవికాంత్ చెబుతారు. ఒక నౌక పనిచేయకుండా నిలిచిపోయిందని ఊహించండి. అనేక మంది మెకానిక్‌లు గంటల తరబడి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. చివరికి అనుభవజ్ఞుడైన ఒక వ్యక్తి వచ్చి యంత్రంలోని ఒక నిర్దిష్ట భాగాన్ని గుర్తించి చిన్న సుత్తితో ఒక్కసారి కొట్టాడు. వెంటనే నౌక పనిచేయడం ప్రారంభించింది. అతను కొట్టిన సుత్తి దెబ్బకు కాదు.. ఎక్కడ కొట్టాలో తెలిసిన జ్ఞానానికే అసలు విలువ ఉందని ఈ ఉదాహరణ చెబుతోంది. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, పెట్టుబడుల్లోనైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎక్కువ గంటలు పనిచేయడం కంటే సరైన నిర్ణయం తీసుకోవడం జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది.
దీర్ఘకాల ఆలోచన విజయానికి పునాది.. Think Long Term
త్వరగా ధనవంతులు కావాలని (Want to Get Rich?) కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సోషల్ మీడియా ప్రభావంతో ‘క్విక్ మనీ’ అనే భావన యువతలో బలపడుతోంది. కానీ నిజమైన సంపద ఒక్కరోజులో ఏర్పడదని నావెల్ రవికాంత్ స్పష్టం చేస్తారు. ఆయన చెప్పిన ప్రసిద్ధ సూత్రం ‘ప్లే లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్’. అంటే దీర్ఘకాలం కొనసాగించే లక్ష్యాలతో, నమ్మకమైన వ్యక్తులతో కలిసి ప్రయాణించాలని సూచిస్తున్నారు. వ్యాపారంలో విశ్వాసం, ఉద్యోగంలో గుర్తింపు, పెట్టుబడుల్లో లాభాలు, వ్యక్తిగత సంబంధాల్లో గౌరవం.. ఇవన్నీ కాలక్రమంలోనే ఏర్పడతాయి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడేవారు ఎక్కువగా మధ్యలోనే ఆగిపోతారు. ఓపికగా ముందుకు సాగే వారే చివరకు గొప్ప విజయాలను అందుకుంటారు.
సంపద సృష్టించడం ఒక దశ.. దాన్ని కాపాడుకోవడం మరో దశ.. Building Wealth Is One Thing, Preserving It Is Another
చాలామంది డబ్బు సంపాదించడంపైనే (Want to Get Rich?) దృష్టి పెడతారు. కానీ సంపాదించిన సంపదను రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమని నావెల్ చెబుతారు. జీవితంలో ఎప్పుడు వైద్య అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, ఉద్యోగ నష్టం లేదా ఇతర అనుకోని సంఘటనలు ఎదురవుతాయో చెప్పలేం. అలాంటి సమయంలో సంవత్సరాల పాటు కూడబెట్టిన పొదుపు ఒక్కసారిగా ఖర్చవుతుంది. అందుకే ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి ఆర్థిక రక్షణలు తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. బీమా పెట్టుబడి కాదు. అది మన కుటుంబ ఆర్థిక భద్రత కోసం తీసుకునే రక్షణ కవచం. సంపదను కాపాడుకోవడంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
లీవరేజ్.. విజయాన్ని వేగవంతం చేసే శక్తి.. Leverage Creates Extraordinary Results
నావెల్ రవికాంత్ ఆలోచనల్లో (Want to Get Rich?) అత్యంత ప్రాచుర్యం పొందిన అంశాల్లో ‘లీవరేజ్’ ఒకటి. అంటే తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను సాధించే విధానం. పాత రోజుల్లో లీవరేజ్ అంటే ఎక్కువ మూలధనం లేదా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండడమే అనుకునేవారు. కానీ డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక యూట్యూబ్ వీడియోను ఒకసారి రూపొందిస్తే లక్షల మంది ఎన్నో సంవత్సరాల పాటు చూస్తారు. ఒక పుస్తకం ఒకసారి రాస్తే తరతరాలు చదువుతాయి. ఒక సాఫ్ట్వేర్ ఒకసారి రూపొందిస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తారు. ఇదే ఆధునిక లీవరేజ్. టెక్నాలజీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా, కృత్రిమ మేధస్సు వంటి సాధనాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిని సమర్థంగా ఉపయోగించగలిగితే తక్కువ వనరులతో కూడా పెద్ద స్థాయిలో విజయాలను సాధించవచ్చు.
ప్రత్యేకతే అసలు సంపద.. Specific Knowledge Creates Value
నేటి పోటీ ప్రపంచంలో (Want to Get Rich?) అందరూ చేసే పనినే చేస్తే ప్రత్యేక గుర్తింపు రావడం కష్టం. అందుకే నావెల్ ‘స్పెసిఫిక్ నాలెడ్జ్’ లేదా ప్రత్యేక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచిస్తారు. ఇది పుస్తకాల్లో మాత్రమే లభించే జ్ఞానం కాదు. వ్యక్తిగత ఆసక్తి, అనుభవం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యం వంటి అంశాల కలయిక. ఉదాహరణకు సాధారణ దోశ వ్యాపారాన్ని ప్రత్యేక రుచులు, మెరుగైన సేవ, బ్రాండింగ్‌తో పెద్ద చైన్‌గా మార్చిన వారు కూడా తమ ప్రత్యేకత వల్లే విజయాన్ని అందుకున్నారు. ప్రపంచానికి అవసరమైన ఒక ప్రత్యేక సమస్యను పరిష్కరించగలిగితే మార్కెట్ మన విలువను గుర్తిస్తుందని నావెల్ అభిప్రాయపడుతున్నారు.
కాంపౌండింగ్.. నెమ్మదిగా జరిగే అద్భుతం.. The Power of Compounding
చక్రవడ్డీ (Want to Get Rich?) గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ కాంపౌండింగ్ కేవలం డబ్బుకే పరిమితం కాదని నావెల్ చెబుతారు. ప్రతి రోజు కొద్దిగా చదివితే జ్ఞానం పెరుగుతుంది. ప్రతి రోజు కొద్దిగా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రతి రోజు ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటే కెరీర్లో ఎదుగుదల కనిపిస్తుంది. ఇవన్నీ కాంపౌండింగ్కే ఉదాహరణలు. రోజుకు కేవలం 20 పేజీలు చదివినా ఐదేళ్లలో వందలాది పుస్తకాలు పూర్తవుతాయి. ఆ జ్ఞానం నిర్ణయాలను మార్చుతుంది. నిర్ణయాలు జీవితాన్ని మార్చుతాయి. చిన్న అలవాట్లు దీర్ఘకాలంలో అసాధారణ ఫలితాలను ఇస్తాయని ఈ సిద్ధాంతం చెబుతోంది.
సమయాన్ని అమ్మొద్దు.. విలువను సృష్టించండి.. Don’t Sell Time, Build Value
చాలామంది ఉద్యోగంలో (Want to Get Rich?) తమ సమయాన్ని డబ్బుగా మార్చుకుంటారు. ఇది ప్రారంభ దశలో అవసరమే. కానీ జీవితాంతం సమయాన్నే అమ్ముకుంటూ ఉంటే సంపద పరిమితంగానే ఉంటుంది. దానికి బదులుగా ఇతరులకు విలువను అందించే ఉత్పత్తులు, సేవలు, డిజిటల్ ఆస్తులు, వ్యాపారాలు, మేధో సంపత్తి వంటి వాటిని సృష్టించగలిగితే ఆదాయం మనం పనిచేయని సమయంలో కూడా వస్తుంది. ఇదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు దారితీసే మార్గమని నావెల్ చెబుతారు.
నిరంతర అభ్యాసమే గొప్ప పెట్టుబడి.. Reading and Learning Never Stop
ప్రపంచంలోని (Want to Get Rich?) అత్యంత విజయవంతమైన వ్యక్తులందరిలో కనిపించే ఒకే అలవాటు నిరంతర అభ్యాసం. ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, అనుభవాల నుంచి నేర్చుకోవడం వారి జీవితంలో భాగమైపోయింది. పెట్టుబడులైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, సాంకేతికతైనా.. మార్పులను అర్థం చేసుకునే వ్యక్తులే ముందంజలో ఉంటారు. అందుకే జ్ఞానంపైన పెట్టే పెట్టుబడి జీవితంలో అత్యధిక రాబడిని ఇస్తుందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు.
సంపద అంటే డబ్బు మాత్రమే కాదు.. Wealth Is More Than Money
నావెల్ రవికాంత్ తత్వం ప్రకారం సంపద (Want to Get Rich?) అంటే కేవలం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు కాదు. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం, కుటుంబంతో గడిపే సమయం, నిరంతర అభ్యాసం, ఆర్థిక భద్రత.. ఇవన్నీ కలిసే నిజమైన సంపద. అందుకే ఆయన ఆలోచనల్లో సంపాదనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. మొత్తం మీద కోటీశ్వరుడు కావాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. సరైన ఆలోచనా విధానం, దీర్ఘకాలిక దృష్టి, తెలివైన నిర్ణయాలు, ప్రత్యేక నైపుణ్యాలు, లీవరేజ్ వినియోగం, సంపద రక్షణ, నిరంతర అభ్యాసం వంటి అంశాలే నిజమైన విజయానికి పునాదులు. రోజుకు కొద్దికొద్దిగా నేర్చుకుంటూ, సరైన నిర్ణయాలు తీసుకుంటూ, దీర్ఘకాల లక్ష్యాలతో ముందుకు సాగితే సాధారణ వ్యక్తి కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే సందేశాన్నే నావెల్ రవికాంత్ ఆలోచనలు బలంగా వినిపిస్తున్నాయి.
