మీరు అతిగా ఖర్చులు చేస్తున్నారా? డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ జపనీస్ టెక్నిక్ గురించి తెలుసుకోండి. మీ దగ్గరున్న డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలన్న అంశాన్ని ఈ జపనీస్ టెక్నిక్ నేర్పిస్తుంది. డబ్బు పొదుపు చేయడానికి ఈ టెక్నిక్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టేవారైనా సరే ఈ టెక్నిక్‌ను అర్థం చేసుకుని అమలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. పొదుపు పెంచుకోవచ్చు.
How to make happy money book summery telugu
How to make happy money పుస్తకం డబ్బు నిర్వహణ గురించి చెబుతుంది. ఫేమస్ జపనీస్ రైటర్ KEN HONDA ఈ పుస్తకం రచించారు. ఇందులో ఒక అద్భుతమైన జపనీస్ టెక్నిక్‌ను వివరించారు. దీనిని ఫాలో అయితే డబ్బు విషయంలో మన ఆలోచన విధానమే పూర్తిగా మారి, మనం నిజమైన ధనవంతులమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Unnecessary expenses
అవసరానికి మించి ఖర్చులు
కొందరు అవసరానికి మించి ఖర్చులు చేసి అప్పులపాలవడం మనం చూస్తూనే ఉంటాం. ఆన్‌లైన్ షాపింగ్ వలలో పడి అవసరం లేకపోయినా వస్తువులు కొనేవారినీ చూస్తుంటాం. అలాంటివారికి తమ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పాటించడం కోసం ఎలాంటి టెక్నాలజీ అవసరం లేదు. కేవలం ఓ పుస్తకం, పెన్ ఉంటే చాలు. మీరు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి. మీ ఆదాయం ఎంత? దాంట్లో ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపర్చుకోవాలి? అని లెక్కలు రాయాలి. మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నట్టైతే మీరు అతిగా ఖర్చు చేస్తున్నట్టే. ఆ అలవాటు మిమ్మల్ని అప్పులపాలు చేయొచ్చు. అయితే నిజంగానే మీకు అవసరమైన వస్తువులపైన మీరు ఖర్చులు పెడుతున్నారా అని ఆలోచించాలి.
ఏదైనా ఓ వస్తువు కొనాలనుకునే ముందు ఈ కింది ప్రశ్నలు మీకు మీరే వేసుకోవాలి.
- ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా?
- నా ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా?
- నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా?
- ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లో స్థలం ఉందా?
- ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను?
- ఈ రోజు నా మానసిక స్థితి ఎలా ఉంది?
- ఈ వస్తువు కొన్న తర్వాత నేను ఎలా ఉంటాను?
ఏదైనా వస్తువు కొనేముందు 7 ప్రశ్నలు వేసుకోవాలి. వాస్తవానికి 7 ప్రశ్నలు అవసరం లేదు. మొదటి 4 ప్రశ్నలకే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మొదటి నాలుగు ప్రశ్నల్లో మీకు ఈ వస్తువు అవసరం లేదు అనిపిస్తే కొనొద్దు. ఇలా మీరు ఏ వస్తువు కొనాలనుకున్నా, ఏ ఖర్చు చేయాలనుకున్నా, ఎక్కడైనా టూర్ వెళ్లాలనుకున్నా, సినిమాకు వెళ్లాలన్నా ఈ ప్రశ్నలు వేసుకోండి. మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఇలా పొదుపు చేసిన డబ్బును మీరు మీ సేవింగ్స్ వైపు మళ్లించండి. మీకు తెలియకుండానే కొన్నేళ్లలో లక్షలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు.
సంతోషంగా డబ్బు సంపాదించడం ఎలా
అసలు డబ్బుతోటి మనకు ఎటువంటి సంబంధం ఉందనేది తెలుసుకోవాలి. ప్రతినెలా సంపాదించే మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామన్నది గుర్తించాలి. మనకి నచ్చిన పనిని చేస్తూ.. సంపాదించే డబ్బును మనకి నచ్చిన విషయాలపై ఖర్చు చేస్తే.. దానినే happy money అంటాం. మన ఎథిక్స్ , వాల్యూస్, సిద్ధావంతాలకు విరుద్ధంగా ఉండే పనిని చేసినపుడు వచ్చే డబ్బు మనకి హ్యాపీనెస్ ఇవ్వకపోతే అటువంటి డబ్బును Un happy money అంటారు. అసలు సంతోషంగా డబ్బు సంపాదించడం ఎలా? అనే దానిపై How to make happy money అనే పేరుతో ఫేమస్ జపనీస్ రైటర్ KEN HONDA ఓ పుస్తకం రచించారు. దీని ద్వారా డబ్బుతోటి మనకు ఎలాంటి సంబంధం ఉండాలనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మన జీవితాన్ని ఆర్థికంగా కూడా సంతోషంగా ఎలా మలుచుకోవాలన్నది ఆయన తన బుక్ లో తెలియజేశారు. మనం సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలంటే డబ్బు చాలా అవసరం . కాకపోతే డబ్బును సంపాదించడం మాత్రమే మన లక్ష్యం కాకూడదు. వచ్చిన డబ్బును మనం ఎలా మేనేజ్ చేయాలి. ఎలా దానిని మంచిగా మన సంతోషాలకు ఖర్చు చేయాలనేది తెలుసుకోవాలి. మన డబ్బుకు విలువ ఇచ్చి ఖర్చులు చేయాలి. మన డబ్బుతో పాజిటివ్ సంబంధం పెట్టుకోవడం ద్వారా మన జీవితాన్ని ఆర్థికంగా మెరుగుపరచుకోవచ్చని KEN HONDA తన బుక్ ద్వారా తెలియజేస్తున్నారు.
Negative thinking about money
డబ్బు గురించి ప్రతికూల ఆలోచన
ప్రతినెలా జీతం వస్తుంది. వచ్చిన జీతం వచ్చినట్టే ఖర్చయిపోతుంది. అసలు ఏమీ మిగలడం లేదు. డబ్బులన్నీ నీళ్లలా ఖర్చయిపోతున్నాయి. ఎలా సంపాదించినా.. ఎలా ఖర్చుపెట్టినా పొదుపుచేయడం లేదు..
ఇదే మనం తరచూ అందరి ఇళ్లలో వింటూ ఉంటాం. కొంతమంది వద్ద మాత్రం ఎప్పడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. అసలు ఎందుకు కొంతమందికి డబ్బులు వాటింతట అవే కూడుతున్నాయి. అని మనకు అనిపిస్తుంది. మనం ఎన్నో రకాలుగా కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించుకున్నామా.. దానిని మళ్లీ వెనకేసుకున్నామా .. ఖర్చులు చేశామా.. అని అనుకుంటూ ఉంటాం. మనం ఇలాగే ఆలోచిస్తే డబ్బుతో మనకుండే సంబంధం కొంచెం నెగిటివ్‌గా ఉన్నట్టే అని నిపుణులు అంటున్నారు.
How to change mindset
మైండ్ సెట్‌ను ఎలా మార్చుకోవచ్చు
మనలో చాలామంది అప్పులు తీసుకుంటూ ఉంటాం. ప్రతినెలా వచ్చే జీతంలోంచే వడ్డీతో సహా వాటిని తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఈఎంఐల భారం కూడా. ఇంకోవైపు ఇంటి ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం, శుభకార్యాలు, జర్నీలు, నిత్యావసర సరుకులు, కిరాణా , సేవింగ్స్ తదితర వాటికి వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ప్రతినెలా జీతం రాకముందే వాటి గురించి ఆలోచిస్తుంటాం. అయితే ప్రతినెలా ఎంత సంపాదిస్తున్నా మిగలడం లేదు. వచ్చిన జీతం వచ్చినట్లే ఖర్చవుతుందని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అయితే మన జపనీస్ రైటర్ KEN HONDA చెప్పిన కొన్ని సిద్ధాంతాల ప్రకారం మన మైండ్‌సెట్‌ను ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
experience is most important
అనుభూతులే ముఖ్యం.. వస్తువులు కాదు…
గతంలో మనం కొన్న ఖరీదైన వస్తువు ఏమిటనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఒక ఖరీదైన వస్తువును నలుగురికి చూపించిన తరువాత కొద్దిరోజుల పాటు ఆ సంతోషం ఉంటుంది. కానీ చివరిగా మీకు ఏది గుర్తిండిపోయిందనేది తెలుసుకోవాలి. ఏదైనా ఖరీదైనా వస్తువు కొంటే దాని విలువ కొన్నాళ్ళకు తగ్గిపోతుంది. అలా కాకుండా మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్‌కు వెళ్లడమో, లేదా మన కుటుంబ సభ్యులను తీసుకెళ్లి ఆ ప్రాంత విశేషాలను చూపించడమో.. స్నేహితులతో ఒక రోజు అక్కడ గడపడమో చేస్తే.. ఇటువంటి విషయాల్లోని ఆ అనుభూతి, ఆ గుర్తులు కొన్నాళ్ల పాటు ఉంటాయి. అంటే వస్తువుల మీద ఖర్చు చేయడం కంటే అనుభూతుల మీద ఎక్కువ ఖర్చు చెయ్యాలని మనం తెలుసుకోవాలి. ఇలా మనం ఖర్చు పెట్టినపుడు మనలో మనకి కృతజ్ఞతా భావం ఏర్పడుతుంది. వచ్చిన డబ్బులతో సంతృప్తిగా ఖర్చు పెడితే మనకి ఇంకా సంతోషంగా ఉంటుంది. డబ్బు విషయంలో కాకుండా ఇతర విషయాల్లో కూడా మనకి పోజిటివ్ భావాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు.
Make it A Treat
ట్రీట్ లా చేసుకోవాలి
మనల్ని మనమే మొదట ప్రయారిటీలాగా ఎంచుకోవాలి. మనకి వచ్చిన డబ్బులతో మనకి మనం ట్రీట్ చేసుకోవాలి. మన సెల్ఫ్ కేర్ ని మనల్ని ప్రయారిటీ గా పెట్టుకున్నట్లయితే మనం సంపాదించే డబ్బులకి అర్థం ఉంటుంది. కుటుంబంలో అందరికోసం ఖర్చు పెడుతూనే మన కోసం మన ఖర్చు పెట్టుకుంటే మనలో పాజిటివిటీ మరింతగా డెవలప్ అవుతుంది.
Buy Time
టైమ్‌ని కొనడం
అసలు కొన్ని విషయాలను డబ్బుతో కొనలేం అని అనుకుంటాం.. అయితే దీనికి విరుద్ధంగా KEN HONDA కొన్నివిషయాలను చెబుతున్నారు. మనలో చాలామంది డబ్బు సంపాదించడానికి 24 గంటలు కూడా సరిపోవడం లేదు అంటారు. పని వెనుక పని, డబ్బు సంపాదించడం కోసం పరుగులు పెడుతున్నామని చెబుతుంటారు.. అయితే రచయిత చెప్పినట్లుగా మీరు డబ్బు సంపాదనకు ఏ పనులైతే చేస్తున్నారో వాటి గురించి కొంచెం బ్రేక్ తీసుకుని ఆలోచించాలి. ఇందులో మనం పనులు చెయ్యకపోయినా పర్వాలేదని భావిస్తే.. కొన్నింటిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బయటవాళ్ళకి ఆ పనుల బాధ్యతను అప్పగించొచ్చు. ఇలా అయితే మనం టైమ్ ని సంపాదించుకోవచ్చు. డబ్బులు పెట్టి టైమ్ ని కొనడం అంటే మనం చేసుకోలేని పనులు లేదా చేయలేని పనులను వేరే వాళ్ళకి ఇచ్చేయడమే. వాళ్లు ఆ పనులను చేసి పెడతారు. అప్పుడు మనకి టైమ్ దొరుకుతుంది. మనకి దొరికిన టైమ్ లో మన కలల్ని సాకారం చేసుకోవాలి అనుకోవాలి. అంతేకాదు వాటిపై మనం దృష్టిపెడితే తప్పకుండా మన జీవితానికి ఒక అర్థం దొరుకుతుంది. ఈ పని చేసి ఉంటే నా లైఫ్ బాగున్నే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. మీకంటూ మీ కలల కోసం కొంత సమయం కేటాయించుకుంటే లైఫ్ ఇంకా మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది.
PAY NOW, CONSUME LATER
ఇప్పుడు కొనండి.. తర్వాత ఎంజాయ్ చేయండి
సహజంగా మన అవసరాల కోసం వెంటనే ఒక వస్తువును కొనేస్తాం. డబ్బులు లేకపోతే EMI లో నైనా వస్తువులను కొంటాం. ఇలా కొన్నవస్తువును ఎంజాయ్ చేయడం కన్నా వచ్చే నెలలో EMI ఎలా కట్టాలని ఎక్కువగా ఆలోచిస్తుంటాం. మనకి ఒక వస్తువు కావాలంటే దానికి సరిపడా డబ్బును ఆదా చేసుకోవాలి. ఆ తర్వాతే మనకు అవసరమైన వస్తువును కొనుక్కోవడం ఉత్తమం. ఇలా చేసే ప్రక్రియలోనే అసలు ఆ వస్తువు మనకు అవసరమా.. కాదా అనేది తెలుస్తుంది. ఇదే సమయంలో ఆ వస్తువుతో ఒక సంబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా డబ్బుపై విలువ కూడా పెరుగుతుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా డబ్బులు ఉన్నప్పుడే మనం వస్తువుని కొనుక్కోవడం శ్రేయస్కరం.
INVEST IN OTHERS
ఇతరులపై పెట్టుబడి
మనతో పాటుగా ఇతరుల మీద కూడా ఖర్చు చెయ్యాలి. వచ్చే నాలుగురాళ్లు నాకే సరిపోవడం లేదు. ఇందులో పక్కన ఉన్నవాళ్లకి ఏమి పెడతానని అనుకోకూడదు. ఈ మైండ్‌సెట్‌నే మనం మార్చుకోవాలి. అలా చేయలేమనుకుంటూ ఏదీ మనకి చేరదు. మనం ఏది నమ్ముతామో అదే మనలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ఉదాహరణకు మనకు రూ.10 వస్తే ఖర్చులన్నీ పోయిన తర్వాత ఎవరైనా ఆపదలో ఉన్న వారికి మన దగ్గర మిగిలిన డబ్బుల నుంచి ఒక్క రుపాయి ఇచ్చినా కూడా అది మనకు ఎంతో సంతృప్తి, పాజిటివిటీని ఇస్తుంది. మనకు ఉన్నదానిలో తృప్తి గా ఉన్నామనే భావన కలుగుతుంది.
MAKE IT CHOICE
ఎంపిక చేసుకోండి
మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ఒక ఛాయిస్ లా చూడాలి. ఇదికాకపోతే ఇంకొకటి.. ఏ కాకపోతే బీ. కానీ మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలావరకూ సొసైటీ వాళ్లు చెప్పే స్టాండర్డ్స్‌పై ఆధార పడి ఉంటున్నాయి. ఇలా పోల్చడం సరికాదు. అలా కాకుండా మనకి ఏమిటి కావాలి, ఇది కాకపోతే ఇంకేమైనా చెయ్యవచ్చా అనే ఆప్షన్ ని మనం పెట్టుకుంటే 80 శాతం మనం నిర్ణయాలను తీసుకోం. ఉదాహరణకు ఒక వస్తువును ఎవరైనా కొంటే.. దానినే అందరం కొంటాం. కానీ మనకు అది ఎంతవరకు లాభం.. ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం ఉత్తమం. అలాగే మనం తీసుకున్న నిర్ణయం కంటే ముందు వచ్చే లాభం దానికి పెట్టే ఖర్చు కంటే ఎక్కువ రెట్లు ఉంటే దానివల్ల ఎక్కువ సంతోషం పొందుతాం అనుకున్నప్పుడు ఆ నిర్ణయం వైపు వెళ్ళడం మంచిది.
FOCUS ON THE JOURNEY
ప్రయాణంపై దృష్టి పెట్టండి…
డబ్బులు సంపాదించడం అనే దానికంటే ఆ సంపాదించడానికి మనం ఎంచుకున్న మార్గం, అలా చేసే పనిని మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించడం అనేది ఇక్కడ చాలా కీలకం. డబ్బులు సంపాదించి.. ఎప్పటికో కోటీశ్వరులు అయిన తర్వాత మనకి సంతోషం వస్తుందని చాలామంది అనుకుంటారు. కావల్సినవన్నీ డబ్బుతో కొనొచ్చు, అప్పుడే ఆనందంగా ఉండొచ్చని భావిస్తుంటారు. ఇలా అనుకోవడం తప్పు అని రచయిత తన బుక్‌లో పేర్కొన్నారు. డబ్బు లేనిదే ఏమీ చెయ్యలేమని భావించి.. మనం డబ్బును సంపాదించే ప్రక్రియలో ఎంజాయ్ చేయడం మరిచిపోతున్నాం. ఈ డబ్బు సంపాదనలో పడి మన కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం, మనకు నచ్చిన ఒక బుక్‌ను కొనుక్కుని చదువుకోలేకపోవడం, నచ్చిన రెస్టారెంట్‌లోప్రశాంతంగా భోజనం చేయలేకపోవడం.. ఇవన్నీ మన గురించి మనం పట్టించుకోకపోవడమే అని రచయిత చెబుతున్నారు. మనం డబ్బులు సంపాదించిన తర్వాత ఎప్పుడో ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన నుంచి బటయ పడాలి. అసలు సంపాదిస్తున్న డబ్బును మేనేజ్ చేస్తూ, నచ్చిన పనులన్నీ చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన సంతోషం సొంతమవుతుంది. అప్పుడే సంపాదించిన డబ్బులకు ఒక అర్థం ఉంటుంది.
THINK SMALL
చిన్నగా ఆలోచించు
అందరూ థింక్ బిగ్ అంటారు.. అంటే డబ్బులు సంపాదించే విషయంలో ఇలా ఉండాలి. కానీ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం అలా ఉండకూడదంటారు రచయిత. థింక్ స్మాల్ అనేదే ఎక్కువ సంతోషాన్నిస్తుందని చెబుతున్నారు. మనం డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఏవైతే చిన్న చిన్న విషయాలు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయో వాటిని వదలకూడదనేదే ఇక్కడ భావం.
BE YOURSELF
మీలా ఉండండి
మనం మనలాగే ఉండాలి. చాలామంది ఎవరో చెప్పారని, పేరెంట్స్ చెప్పారని, స్నేహితులు చెప్పారనో మనకి మనమే ఒక స్టాండర్డ్ ను ఏర్పరుచుకుంటాం. ఈ ప్రాసెస్‌లోనే నిజంగా మనకు ఏం కావాలి, ఎలా ఉండాలనేది మర్చిపోతున్నాం.
ఉదాహరణకు.. చిన్నప్పటి నుంచి మీరు స్వతహాగా బయటికి వెళ్లి కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే పెరుగుతున్నక్రమంలో సొసైటీలో మనకుంటూ ఒకపేరు ఉండాలని చాలా పరికరాలు, ఫ్యాన్సీ డ్రెసెస్‌పై ఖర్చు చేస్తుంటారు. మీ దగ్గర డబ్బులతో ఒక ట్రిప్ అనుకున్నారు. అయితే అదే సమయంలో ఒక కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయితే సొసైటీలో గుర్తింపు కోసం దానిని కొనాలనే తాపత్రయం ఉండకూడదు. ఇక్కడ మీరు అంటే ఏమిటో గుర్తించాలి. ఒక ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి, లైఫ్‌లాంగ్ ఆ జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటామనేది తెలుసుకోవాలి. అందుకే మనం మనలాగే ఉంటే సగం వరకు సమస్యలే ఉండవు.