`How to Avoid Loss and Earn consistently in The STOCK MARKET` book review telugu `హౌ టూ అవైడ్ లాస్ అండ్ ఎర్న్ కన్‌సిస్టెంట్లీ ఇన్ ది స్టాక్ మార్కెట్` పుస్తక సమరీ
స్టాక్ మార్కెట్ ఎంతో మంది జీవితాలను మార్చింది. కొంత మంది కుబేరులయ్యారు. అత్యధిక మంది రోడ్డున పడ్డారు. చాలా మంది ఇదేదో అదృష్టంతో కూడిన ఆట అనుకుంటారు. కానీ ఇది బిజినెస్ అని, అవగాహన, తెలివి ఉండి, మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే విజేతలవుతామన్న విషయం చాలా మంది గుర్తించరు. లాభాలు పొందడం ఒక్కటే అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. నష్టపోకుండా ఉండడం కూడా లాభపడడమే అన్న విషయాన్ని ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి అని చెప్పే పుస్తకమే
How To AVIOD LOSS and EARN CONSISTENTLY IN THE STOCK MARKET.
మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన విషయాలను How To AVIOD LOSS and EARN CONSISTENTLY IN THE STOCK MARKET పుస్తకంలో వివరంగా రచయిత Prasenjit Pual రాశారు. ఈయన ఈక్విటీ ఎనలిస్ట్ , బెస్ట్ సెల్లింగ్ ఆథర్. ఇండియాకి చెందిన రచయిత రాసిన స్టాక్ మార్కెట్ బెస్ట్ బుక్ ఇది. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టాలనుకునే ఇన్వెస్టర్స్ మొదట నష్టాలను ఎలా తగ్గించుకోవాలో, తర్వాత మనీ మేకింగ్ ఐడియాల పై దృష్టి పెట్టాలని రచయిత సూచిస్తున్నారు. ఎలాంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలి స్టాక్స్ ఎప్పుడూ కొనాలి స్టాక్స్ ఎప్పుడూ అమ్మాలి అనే విషయాలు గురించి రచయిత ఈ పుస్తకంలో వివరించారు.
How to Avoid Loss In Stock Market
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడూ మన దేశంలో చాలా మంది బిలీయనీర్ స్థానంలో ఉన్నారు. కానీ వాళ్లు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటిస్తారన్న విషయం తెలుసుకోవాలి.
* స్టాక్ మార్కెట్లో నష్టాలు రాకుండా ఉండాలంటే, ముందు డబ్బులు పోగొట్టుకోవడానికి కారణాలు తెలుసుకోవాలి.
* మనం గుడ్డిగా స్టాక్ బ్రోకర్స్ ని నమ్మకూడదు.
* మనం ఎంత ట్రేడ్ చేస్తే అంత రిస్క్ తీసుకున్నట్టే.
* ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకి ఒక్కసారి నష్టం వచ్చినా ముందుగా వచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా తుడుచుకుపోతాయి.
* ఇంతవరకూ ప్రపంచంలో డే ట్రేడింగ్ ద్వారా బిలియనీర్ అయినవారు ఒక్కరు కూడా లేరు.
* ఎప్పుడు కూడా షేర్స్ ని తనఖా పెట్టి అప్పు తెచ్చిన అమౌంట్ తో ఇన్వెస్ట్ చేయకూడదు.
* ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే , ఎక్కువ లాభాలే కాకుండా, ఎక్కువ నష్టాలు కూడా వస్తాయి.
* ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సాధారణ ఇన్వెస్టర్స్ కి పనికిరావు. అది అనుభవం గల ఇన్వెస్టర్స్ కి మాత్రమే అని గుర్తించుకోవాలి.
First step to pick stocks
సాధారణంగా ఒక కంపెనీ ఫర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని తెలియడానికి , కంపెనీ ప్రాఫిట్స్ ని చూస్తారు. కాని కంపెనీలు ఇన్వెస్టర్స్ ని ఆకట్టుకోవడానికి ప్రాఫిట్ సేల్స్ అంకెలను తారుమారు చేస్తాయి. అలాంటపుడు ఆ విషయాన్ని ముందు మనం ఎనలైజ్ చేయాలి.
అవి ఏమిటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ( ఆర్ఓఈ) అండ్ డెట్ ఈక్విటీ రేషియో
– రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే షేర్ హోల్డర్స్ డబ్బులతో ఒక కంపెనీ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో తెలుపుతుంది. ఏ కంపెనీ ఆర్ఓఈ ఎక్కువ ఉంటే ఆ కంపెనీకి ప్రెఫరన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇదే ఆర్ఓఈ ని భవిష్యత్తులో కంపెనీ మెంటైన్ చెయ్యగలదని గ్యారంటీ లేదు కాబట్టి, కంపెనీకి ఉన్న ఎక్స్ ట్రా అడ్వాంటేజస్ చూడాలి. దీనినే ఎకనామిక్ మోట్ అంటారు.
డెట్ ఈక్విటీ రేషియో…
బిజినెస్ గ్రో అవ్వాలంటే అప్పు చాలా అవసరం. కానీ ఆ అప్పును చెల్లించే వడ్డీ ప్రాఫిట్ కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరం. డెట్ ఈక్విటీ రేషియో ఒకటి కంటే తక్కువ ఉండే కంపెనీలను ప్రిఫర్ చేయాలి. ఇంటరెస్ట్ కవరేజీ రేషియో, కరెంట్ రేషియో పరిశీలించాలి.
Management Evaluation
మంచి మేనేజ్ మెంట్ పూర్ బిజినెస్ ని గుడ్ బిజినెస్‌గా మార్చగలదు. కాని పూర్ మేనేజ్ మెంట్ మంచి బిజినెస్ ని కూడా దివాలా తీసేలా చేయగలదు. మంచి మేనేజ్ మెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి 3 పెరామీటర్స్ ని చెక్ చేసుకోవాలి.
-షేర్ హోల్డింగ్ పాటర్న్
– డివిడెండ్ హిస్టరీ
– రిటర్న్ ఆన్ ఈక్విటీ
* ప్రమోటర్స్ కంపెనీలో ఎంత పర్సంటేజ్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో చూడాలి.
* ప్రమోటర్స్ తమ షేర్స్ ని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న అమౌంట్ వారి హోల్డింగ్ లో 30 శాతం దాటకుండా ఉండాలి.
* డివిడెండ్ పే ఔట్ రేషియో ఎక్కువ ఉందంటే, మేనేజ్ మెంట్ బాగా పనిచేస్తున్నట్లే అర్థం.
* గత 5 సంవత్సరాల కంపెనీ ఆర్ఓఈ ని పరిశీలించాలి. అది 20 శాతం కంటే ఎక్కువ ఉంటే మేనేజ్ మెంట్ సమర్థంగా క్యాపిటల్ వాడుతున్నట్లే.
THE 3 BIG Misconceptions…
* ఎక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ అంతకంటే ఎక్కువ పెరగవు అనే అపోహతో వాటిని కొనకుండా, తక్కువ ప్రైస్ కలిగిన స్టాక్స్ లేదా పెన్నీ స్టాక్స్ కొంటారు. కానీ అలాంటి అపోహ సరికాదు.
* లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎప్పుడూ మంచి రిటర్న్స్ ఇస్తాయి. కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎప్పుడూ పడుతూ లేస్తూ ఉంటాయనే అపోహ పడకూడదు. క్వాలిటీ స్టాక్స్ ఉండేలా చూసుకోవాలి.
* సగానికి పైగా పడిపోయిన స్టాక్స్ తిరిగి అంతే వేగంగా పైకి వెళ్తాయని చాలామంది ఇన్వెస్టర్స్ స్టాక్స్ కొంటారు. 60 శాతం కంటే ఎక్కువ పడిపోయిన స్టాక్స్ ని కొనకూడదు.
4 Investing Mistakes
* కొంతమంది ఇన్వెస్టర్స్ ఒకప్పుడు బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాక్స్ కొంటారు. ఆ స్టాక్స్ ప్రస్తుత పరిస్థితి
గురించి, భవిష్యత్తులో దాని పని తీరు గురించి కానీ ఆలోచించరు. కేవలం గత చరిత్రపై మాత్రమే ఆధారపడి స్టాక్స్ కొనకూడదు.
* కొంతమంది ఇన్వెస్టర్స్ షేర్స్ ని కొన్న రేటుకి అమ్మాలని, లాసుల్లో ఉన్న సరే హోల్డ్ చేస్తారు. కానీ షేర్స్ నష్టం వచ్చినా ఫర్వాలేదు. కానీ ఆ షేర్స్ ని అమ్మివేసి త్వరగా క్వాలిటీ ఉన్న స్టాక్స్ ని కొనాలి.
* కొంతమంది ఇన్వెస్టర్స్ స్టాక్ ప్రైస్ పెరగగానే అమ్మేస్తారు. కానీ ప్రాఫిట్ లో ఉన్న వాటికంటే లూసింగ్ స్టాక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి.
* కొంతమంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ లో ఉన్న స్టాక్స్ అమ్మివేస్తారు. కాని అలాంటి తప్పు చేయకూడదు.
పోర్ట్ ఫోలియో…
* చాలా మంది తమ పోర్ట్ ఫోలియోలో 50 కంటే ఎక్కువ స్టాక్స్ ని ఉంచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వాటిని మనం పూర్తిగా ఫాలో కాలేం. అవన్నీ ఒకే సెక్టార్‌కి చెందినవైతే ఇంకా ప్రమాదకరం. ఒక్కొక్క సెక్టార్ లో క్వాలిటీ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని, హోల్డ్ చేయడం ద్వారా మార్కెట్ పడిపోయినా మనం సేఫ్ గా ఉంటాం.
* డెట్ ఈక్విటీ రేషియో 1 కంటే ఎక్కువ , ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 3 కంటే తక్కువ ఉన్న కంపెనీస్ కి దూరంగా ఉండాలి.
* తరచూ పడిపోతున్న కంపెనీలకు దూరంగా ఉండి, 52 వీక్ న్యూ హై ప్రైస్ రీచ్ అయిన కంపెనీలను రీసెర్చ్ చెయ్యాలి.
Leave a Reply