
సంపదను సృష్టించుకోవాలని, ధనవంతులవాలని అనుకుంటే సరిపోదు. దానికి తగ్గ ప్లానింగ్, అప్లికేషన్ ఉంటేనే సాధ్యమవుతుంది. చాలా ఖచ్చితంగా క్రమశిక్షణతో మనసును, శరీరాన్ని సవ్య దిశలో నడిపిస్తేనే ఆ కల నెరవేరుతుందని చెప్పిన పుస్తకం `ది మిలియనీర్ నెక్ట్స్ డోర్`. ప్లానింగ్ అంటే ఏమిటీ..? ధనవంతులు ఎలా ఉంటారు, వారి ఆలోచనలు, అలవాట్లు ఎలా ఉంటాయి..? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా.. ఇలా అనేక విషయాలను ఈ పుస్తకంలో రచయిత వివరించారు.
THE MILLIONAIRE NEXT DOOR అనే పుస్తకాన్ని థామస్ జే స్టాన్లే రచించారు. ఇతను ఒక రచయిత, సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్. సంపద అనేది బడ్జెట్, ప్లానింగ్, హార్డ్ వర్క్, సెల్ఫ్ కంట్రోల్ వల్లే సాధ్యమవుతుందని థామస్ అంటారు. మనం సులభంగా ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి, సంపదను ఎలా సృష్టించవచ్చో రచయిత ఈ పుస్తకంలో వివరించారు.
who is millionaire
ఎవరు మిలియనీర్
ఒక మనిషి ధనవంతుడో కాదో తెలియాలంటే అతని నెట్ వర్త్ చూడాలి. ఆస్తుల నుంచి అప్పులు తీసేస్తే వచ్చే దానిని నెట్ వర్త్ అంటారు. మన నెట్ వర్త్ తెలుసుకోవడానికి ఇంకో పద్దతి ఉంది.
మన సంవత్సర ఆదాయాన్ని వయసుతో గుణించి 10 తో భాగిస్తే మన నెట్ వర్త్ ఎంతో తెలుస్తుంది.
ఆస్తులే కాకుండా, అప్పులు, నష్టాలు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
ఇక్కడ ధనవంతులను రెండు కేటగిరిలుగా విభజించారు.
మన ప్రస్తుత నెట్ వర్త్ కన్నా ఆదాయం తగ్గితే Under Accumulator Of Wealth కేటగిరి కిందకి వస్తాం.
అదే మనం సంపాదించబోయే నెట్ వర్త్ ప్రస్తుత నెట్ వర్త్కి రెండింతలు ఉంటే Prodigious Accumulator Of Wealth కేటగిరిలోకి వస్తాం.
మనం ఆర్థిక స్వేచ్చ పొందాలన్న, త్వరగా రిటైర్ అవ్వాలన్న మనం Prodigious Accumulator Of Wealth కేటగిరిలోకి రావలిసి ఉంటుంది. మనం ఈ కేటగిరిలోనికి రావాలంటే రెండింతలు కష్టపడాలి. పట్టుదల, సెల్ప్ డిసిప్లైన్ ఉండాలి.
what is the secrete in living low
తక్కువలో బతకండి
ఎంత సంపాదించిన డబ్బులు చాలకపోవడానికి కారణం డబ్బులు రాకముందే అప్పులు చేసి ఖర్చులు చేయడం. ఎంత సంపన్నులు అయినా సామాన్య జీవితమే గడుపుతారు. మిలీనియర్స్ అందరికీ ఈ కింది అలవాట్లు ఉంటాయి.
* తమ ఆదాయాన్ని ఎక్కడ ఉపయోగించాలో బడ్జెట్ వేసుకోవడం.
* తమ ఖర్చులను తగ్గించుకోవడం.
* ఎంత ఆదాయం వచ్చిన సామాన్య జీవితం గడపడం.
ధనవంతులు అవ్వాలనే తపనతో ప్రతి ఒక్కరూ తమని తాము నిత్యం ఇలా ప్రశ్నించుకోవాలి. మన ఇంటి ఖర్చులు, వార్షిక ఆదాయం ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయా..? ప్రతి సంవత్సరం మనకి ఎంత ఖర్చు అవుతుంది..? మనం సరైన మార్గంలోనే వెళ్తున్నామా..? అని.
time is money
కాలమే డబ్బు
చాలా మంది పదవీ విరమణ పొందక ముందే ఆస్తులను కూడబెట్టుకోవాలని అనుకుంటారు. కానీ ఎంతమంది దానికి కావలిసిన టైమ్ ను కేటాయిస్తున్నారో అన్న విషయం ఆలోచించరు. అలా అనుకునే వాళ్లు తమ సమయాన్నిఅధిక భాగం ఇందుకోసమే కేటాయించాలి.
తమ ఫైనాన్షియల్ ప్యూచర్ ప్లాన్ చేసుకోవడానికి, తమ పెట్టుబడులను హ్యాండిల్ చేయడానికి, తమ ఆస్తుల లెక్కలను చూసుకోవడానికి సమయం కేటాయిస్తారు. మనం సంపదను పెంచుకోవాలంటే వారానికి కొన్ని గంటలైనా పెట్టుబడులపై సమయం కేటాయించాలి.
పిల్లలకు ఇవి నేర్పించండి
* చాలామంది తల్లిదండ్రులు వాళ్ళదగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పిల్లలకు ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. కానీ ఒక సర్వే ప్రకారం తల్లిదండ్రుల నుంచి ఎక్కువ పాకెట్ మనీ తీసుకున్న పిల్లలు తక్కువ పొదుపు చేసి ఎక్కువ ఖర్చు పెడతారు. అదే తక్కువ పాకెట్ మనీ తీసుకున్న పిల్లలు ఎక్కువ పొదుపు చేసి తక్కువ ఖర్చు పెడతారు. పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడం.. డబ్బును ఎలా హ్యాండిల్ చేయడం నేర్పించడమే మనం పిల్లలకు ఇచ్చిన గిప్ట్ అని రచయిత చెబుతారు.
* పిల్లలకు మనం ధనవంతులు అనే విషయం చెప్పకూడదు.
* మనం ఎంత ధనవంతులు అయినా సరే మన పిల్లలకు డబ్బు విషయంలో క్రమశిక్షణ, నాలెడ్జ్ అందించాలి.
* పిల్లలముందు తమకు వారసత్వంగా రాబోయే ఆస్తుల గురించి చర్చించకూడదు.
* పిల్లలు పెద్దయ్యాక వారి ఫైనాన్షియల్ విషయంలో కలగజేసుకోకూడదు. సలహా ఇవ్వాలంటే వారి అనుమతి తీసుకోవాలి.
* మనం చిన్నప్పుడు సాధించిన వాటితో పిల్లల విజయాలను పోల్చకూడదు.
* డబ్బుకంటే విలువైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయని తెలియజేయాలి.
* మన పిల్లలు ఎంత విజయం సాధించిన సరే వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించండి.
అవకాశాలను గుర్తించాలి
చాలా మంది ధనవంతులు అవ్వకపోవడానికి కారణం మార్కెట్లో ఉన్న అవకాశలను సద్వినియోగం చేసుకోకపోవడం. ధనవంతులకి అవసరమయినవి సప్లై చేసేవారే త్వరగా ధనవంతులు అవుతారని రచయిత అంటారు. కాబట్టి మార్కెట్లో అలాంటి బిజినెస్ లు ఏమున్నాయో తెలుసుకుని తెలివిగా ఎంచుకోవాలి.
వీరే ధనవంతులు
సంపన్నులు ఒకరి కింద ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. కొంచెం రిస్క్ తీసుకుని అయినా బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తారు. ధనవంతులు అవ్వాలంటే ముందు ఒక కంపెనీకీ ఓనర్ అవ్వాలి. రోజూ ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకుని వెళ్తేనే అందులో విజేతలంకాగలం. ఈ క్రమంలో మనం దేనికి భయపడాల్సిన పనిలేదు. మనం చేసే పని ఎంజాయ్ చెయ్యడంలోనే నిజమైన ఆనందం, విజయం ఉన్నాయి.