స్టాక్స్ మార్కెట్లో పక్కా ప్లానింగ్ ఉండాల్సిందే..
what is the importance of planning in stock market
స్టాక్ మార్కెట్లో లాభాలు అసాధ్యమేమీ కాదు. పక్కా ప్లానింగ్, నాలెడ్జ్ తో లాభాలు పొందవచ్చు. వీటితో పాటు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఏ పనికైనా ప్లానింగ్ ఉండాల్సిందే. ఒక ప్రణాళిక లేకుండా చేసే ఏ పనైనా విజయ బాట పట్టడం చాలా కష్టం. ముందుగా ఆ పనిమీద పూర్తి స్థాయి అవగాహన కల్పించుకుని, ఒక ప్లానింగ్ రచిస్తే అప్పుడే మనం సఫలీకృతులమవుతాం. దీనికి స్టాక్ మార్కెట్ ఏమీ మినహాయింపు కాదు. ఇదో పెద్ద సముద్రం. వచ్చిన వెంటనే ఎటువంటి ప్రణాళిక లేకుండా, టైమింగ్ లేకుండా లాభాలు పొందేద్దాం అనుకుంటే అది అయ్యే పనికాదు. సమగ్ర సమాచారం, పూర్తి స్థాయి అధ్యయనం చేశాక, పక్కా ప్లాన్ చేసుకుంటే లాభాలు సంపాదించవచ్చు.
how should be planning is..
మరి స్టాక్ మార్కెట్‌లో ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విషయం గురించి ఓ సారి చూద్దాం.
* ముందుగా స్టాక్ ట్రేడింగ్ కావాల్సిన సరంజామా అంతటినీ సిద్ధం చేసుకున్నాకే స్టాక్ మార్కెట్‌లోకి రావాలి.
* ఏ స్టాక్‌లో మనం ట్రేడ్ చేద్దామనుకుంటున్నమో వాటిని ఎంపిక చేసుకోవాలి. దీనికి ఎన్నో స్ట్రాటజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించి స్టాక్ సెలక్షన్ పూర్తి చేసుకోవాలి.
* ఫండమెంటల్ అనాలసిస్, టెక్నికల్ అనాలసిస్‌ను కూడా ముందుగానే అధ్యయనం చేయాలి
* మనం ఎంచుకుని ప్రాక్టీస్ చేసిన ట్రాడ్ ప్లాన్ ను ముందుగా నిర్ణయించుకుని ఉండాలి.
* స్టాప్‌లాస్, ప్రాఫిట్‌లను ముందుగానే నిర్ణయించుకుని ఉండాలి.
* మార్కెట్ సమయంలో మాత్రమే కాకుండా, మార్కెట్ ముందు.. ముగిసాక కూడా ఆ రోజు మార్కెట్ మూమెంట్‌ను పరిశీలించాలి
* మానసికంగా సిద్ధమైన తర్వాతే ఒడిదొడుకులను తట్టుకోగలిగితే మార్కెట్‌లో నిలబడగలుగుతాం.
what are the ways to invest in stock market
స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే షేర్లు కొనాలి. ఇదే కీలకం. ఈ స్టాక్ మార్కెట్లో మనం ఓన్లీ షేర్స్ కొనవచ్చులేదా ఈటీఎఫ్ కొనవచ్చు. షేర్స్ పై ఇన్వెస్ట్ చేయలనుకుంటే అది డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్. కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం స్టాక్ మర్కెట్లో షేర్స్ కొనాలనుకుంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ముఖ్యం. దీనితో పాటు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ కి మనం రెడీ అయితేనే షేర్స్ పై ఇన్వెస్ట్ చేయాలి.
* ముందుగా కొన్ని స్టాక్స్‌ని ఎంచుకోవడం అవసరం. మార్కెట్ ఫ్లక్చువేషన్ ఆధారంగా ట్రేడ్ తీసుకుంటే మన ప్లానింగ్ వర్క్ అవుతుంది. ప్లానింగ్ తో ముందుకి వెళితే 100 శాతం ప్రోఫిట్ రావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ రావచ్చు. స్టాక్ మార్కెట్లో లక్ష రూపాయిలు పెడితే ప్రతి నెలా 20 శతం ప్రోఫిట్ వస్తే సంవత్సరానికి 2 లక్షల 40వేలు సంపాదించవచ్చు. అది మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే వస్తుంది. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రోపిట్ వస్తుంది. కాని ఎమోషన్స్ వల్ల మనం తప్పు చేస్తాం. మార్కెట్ పడిపోతున్నపుడు షేర్స్ అమ్మేయడం లేదా పెరుగుతున్నపుడు తొందరపడి కొనేయడం ఇలాంటివన్నీ వదిలేయాలి. వీటన్నింటిని తెలుసుకోవడానికి మనకి నాలెడ్జ్ కావాలి. స్థిరంగా కొంచెం కొంచెం లాభాలను తీసుకుంటూ ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటే మనం సక్సెస్ అయినట్టే.
Leave a Reply