
రిలయన్స్ బలమైన సంస్థగా ఎదుగుతోంది. చక్కని పనితీరుతో కరోనా లాంటి గడ్డు పరిస్థితుల్లో సైతం రికార్డు స్థాయి లాభాలను గడించింది. వినియోగదారులు రిలయన్స్ సేవలపై దృష్టి పెట్టడం వల్ల అన్ని వ్యాపారాల్లో ఆదాయాలు, లాభాలు ఎక్కువగా నమోదయ్యాయి. రిటైల్ వ్యాపారంలో 15,000 స్టోర్ల మార్కును అధిగమించారు. ఏర్పాటు చేసిన రెండేళ్ళలోనే జియో ఫైబర్ అతి పెద్ద బ్రాడ్ బ్యాండ్ సేవల కంపెనీగా మారింది. మన దేశ గ్యాస్ రంగంలో సహజవాయువు విభాగం వాటా20 శాతానికి చేరింది.
what is first 100 billion dollar company in India
100 బిలియన్ డాల్లర్ల సంస్థగా రికార్డు
* రిలయన్స్ అరుదైన రికార్డ్ సాధించింది. వార్షికాదాయం 100 బిలియన్ డాలర్ల కి పైగా సాధించిన మన దేశ ఏకైక కంపెనీగా అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది. 2020- 21 ఇదే త్రైమాసిక లాభం రూ.13,227 కోట్ల కంటే ఇది 22.5 శాతం అధికం. కంపెనీ ఆదాయాలు 35 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
* 2021 -22 ఆర్థిక సంవత్సరం మొత్తం కంపెనీ నికరలాభం రూ.60,705 కోట్లు. ఆదాయం రూ.7.92 లక్షల కోట్ల కి చేరుకుంది. అన్ని రంగాల్లో కలిపి 2.1 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగాలను సంస్థ నియమించింది. మార్చి త్రైమాసికంలో ఎబిటా రూ.33,968 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 28 శాతం ఎక్కువ. ఓ2సీ వ్యాపారం ఎబిటా 25 శాతం పెరగడం ఇందుకు దోహదం చేసింది. రష్యా- ఉక్రెయిన్ యుధ్ధం కారణంగా పెట్రోల్, డీజీల్ రేట్లు పెరిగాయి.
* మార్చి త్రైమాసికంలో జియో ప్లాట్ ఫామ్స్ నికర లాభం 23 శాతం వృధ్ధి చెంది రూ.4,313 కోట్లకి చేరుకుంది. స్థూల ఆదాయం 21 శాతం పెరిగి రూ.26,139 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో వినియోగదారులు తగ్గినా వినియోగదారు సగటు ఆదాయం 21.3 శాతం వృధ్ధితో రూ.167.6 కు చేరడం కలిసొచ్చింది. ఏడాది మొత్తం రూ.95,804 కోట్ల ఆదాయం పై రూ.15,487 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
* పలు కొనుగోళ్ళు చేపట్టడం, ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ వరకు పెట్టుబడులు పెట్టడం, కరోనా అనంతరం రికవరీ రావడంతో రిటైల్ వ్యాపారం రాణించింది. త్రైమాసిక నికరలాభం 4.8 శాతం పెరిగి రూ.2139 కోట్లకు చేరుకుంది. కొత్తగా 793 స్టోర్లు స్టార్ట్ చేయడంతో మొత్తం స్టోర్లు 15,196కు చేరుకున్నాయి.