
ఏవైనా రెండు సంస్థలను విలీనం చేయడాన్ని మెర్జింగ్ అంటరు. ఒకే తరహా కంపెనీలైతే విలీనం ద్వారా లాభాలను మరింతగా పొందుతాయి కాబట్టి మెర్జింగ్ కు మొగ్గు చూపుతాయి. ఇటీవల మెర్జింగ్ కు HDFC & HDFC BANK రావడం ఒక పెద్ద సెన్సేషన్. ఈ రెండు సంస్థలు తమ తమ రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. అలాంటి రెండు పెద్ద సంస్థలు మెర్జ్ అవ్వడం అనేది సంస్థకు లాభదాయకం.
ఇవీ కారణాలు..
reasons behind HDFC merging
HDFC అంటే హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది కేవలం గృహ రుణాలను అందించే పెద్ద సంస్థ. HDFC BANK ఇండియాలోనే ప్రవేటు బ్యాంకింగ్ సెక్టార్‌లో దిగ్గజం. ఇలాంటి ఈ రెండు పెద్ద సంస్థలు విలీనంతో ఒక్క సంస్థగా మారుతున్నాయి.
* రెండు సంస్థల మెర్జింగ్‌తో మొదటి ప్రయోజనం ఖర్చులు తగ్గించుకోవడమే.
* రెండు సంస్థల కస్టమర్లు ఇప్పుడు కలిసిపోయి రెండింటికీ కస్టమర్ బేస్ పెరుగుతుంది.
* బ్యాంకు వినియోగదారులు గృహరుణాలను పొందవచ్చు.. అదే విధంగా గృహ రుణ వినియోగదారులు బ్యాంక్ కస్టమర్లుగా మారవచ్చు.
* HDFC & HDFC BANK కి తక్కువ రేటుకి డబ్బులు వడ్డీకి దొరుకుతాయి. అదే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనుకుంటే దానికి ఎక్కువ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ రెండు మెర్జింగ్ చెయ్యడం వల్ల మనకు 2 శాతం వడ్డీ తగ్గుతుంది. దీనివలన దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయి.
* ప్రపంచంలోనే HDFC & HDFC BANK 5వ అతి పెద్ద సంస్థగా అవతరిస్తుంది. మన దేశంలో రెండో అతి పెద్ద సంస్థ గా అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పడు ఇంటర్నేషనల్ గుర్తింపు వస్తుంది.
* ఇప్పటి వరకు ఇండియలో ఎక్కువ లోన్స్ ఇచ్చే కంపెనీలలో ఎస్బీఐ ఉంటుంది. ఈ రెండు మెర్జ్ అవ్వడంతో ఇండియలో ఎస్ బీఐ తర్వాత HDFC & HDFC BANK లోన్స్ ఇవ్వడంలో రెండో స్థానంలో ఉంటుంది.
ఇన్వెస్టర్లకు లాభమే..
what are the benefits to investor
ఈ విలీనంతో కస్టమర్స్ కి ఉపయోగం ఉంటుంది. ఇన్వెస్టర్లకు కూడా ఉపయోగమే. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణం.
HDFC & HDFC BANK లిమిటెడ్ లో విలీనం కావడానికి సెబీ, సీసీఐ, ఐర్ బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. ఈ ప్రోసెస్ పూర్తయ్యేసరికి 1 లేదా 2 సంవత్సరాలు పడుతుంది. ఇరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ లెక్కలోకి తీసుకుంటే విలీనానంతరం HDFC బ్యాంక్ మార్కెట్ విలువ నిప్టీ వెయిటేజ్ పరంగా చూస్తే 14.5 శాతం ఉంటుంది. ఈ రెండు సింక్ అవ్వడం వల్ల కస్టమర్ బేస్ పెరుగుతుంది. అందువల్ల ఖర్చులు తగ్గుతాయి. వడ్డీ రేటు తగ్గుతుంది.
ఒక కంపెనీని ప్రత్యకంగా మర్చడాన్ని డీ – మెర్జింగ్ అంటారు.
రెండు కంపెనీలను ఒక సంస్థగా మార్చడాన్ని మెర్జింగ్ అంటారు. ఒక సంస్థ మెర్జింగ్‌కు వెళ్లింది అంటే అది తప్పకుండా లాభదాయకమైన నిర్ణయమే. ఇక ఆ స్టాక్‌ను మనం పరిగణలోకి తీసుకోవచ్చు.