ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి ?
how should be the trading plan is
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వాళ్లకి ట్రేడింగ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం ఖచ్చితంగా నేర్చుకుని, నమ్మితేనే ఆ ప్లాన్ వర్క్ అవుతుంది. ఈ ప్లాన్ మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది.
మనం ట్రేడింగ్ ప్లాన్ తో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇది ఎంత వరకు కిందకి వస్తుంది, ఎంత కంటే కిందకి రాదు అనే ఐడియా వస్తుంది. అప్పడే మనం మార్కెట్‌ను అంచనా వేయగలుగుతాం. లాభాలను పొందగలుగుతాం.
you must follow trading plan
పక్కాగా ఫాలో కావాల్సిందే..
మనం స్టాక్స్ లో పెట్టినపుడు ఫర్ ఫెక్ట్ ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేస్తూ నిరంతరం పరిశీలించుకోవాలి. మనం ఎంచుకున్నది బేడ్ ట్రేడ్ అయితే, మనకి ఇంకొక ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎంచుకున్నది కరెక్ట్ కాదని తెలిస్తే కాన్సెప్ట్ మార్చుకోగలుగుతాం. మనం ఓపెన్ చెయ్యగానే మనకి లాస్ వస్తే, మనం పెట్టుకున్న ప్లాన్ ప్రకారం స్టాప్ లాస్ అయితే మార్కెట్ నుంచి బయటకు వచ్చేయాలి.
never forget stop loss and target
ఎంట్రీ, స్టాప్‌లాస్ & టార్గెట్…
మార్కెట్ లో మన ఎంట్రీ పాయింట్ ఫిక్స్డ్ గా ఉండాలి. స్టాప్ లాస్ చాలా క్లియర్ గా ఉండాలి. టార్గెట్ అయితే పక్కాగా ఉండాలి. మనం ఎప్పుడూ ఎమోషన్స్ కి గురికాకూడదు. ఏదో వచ్చేస్తుందనే భ్రమలో మనం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. కానీ స్టాక్ మార్కెట్లో నష్టం వస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని భర్తి చేయలనుకుంటే ఇంకా నష్టపోతారు. బెస్ట్ ట్రేడర్ ఎప్పుడూ కూడా నష్టం వచ్చినా బాధపడరు. లాభం వచ్చినా సంతోషాన్ని వ్యక్తం చెయ్యరు.
* మార్కెట్ ఎవరికీ శత్రువు కాదు, అలాగని ఫ్రెండూ కాదు. మార్కెట్ ఎంత ఇవ్వాలనుకుంటుందో అంత ఇస్తుంది. అందువల్ల మనకి ఈ ప్రాఫిట్ చాలు అనుకుని బయటకు రావాలి. అంతేగాని మనకున్న అప్పులన్నీ గుర్తు పెట్టుకుని, దీనిలో నుంచే మొత్తం వచ్చేయాలి అని అనుకుంటే, ఉన్న ఫ్రోఫిట్స్ అన్నీ పోయి నష్టాల్లో ఉంటాం.
* ఒక ట్రేడ్ లోకి వెళ్లాక 90శాతం మంది ప్రోఫిట్ లో ఉంటారు. కాని కొంతమంది మార్కెట్ నుంచి ఎప్పుడు బయటకు రావాలో తెలియక ఇంకా ప్రోఫిట్ వస్తుందేమోనని ఆశపడుతుంటారు. అలాంటి వాళ్లే ఎక్కువగా నష్టపోతారు.
* ప్రోఫిట్స్ అన్నీ జీరో కంటే గొప్పవి. అలాగే జీరో అంటే నెగిటివ్ కన్నా గొప్పది. నెగిటివ్ లోకి వెళ్ళాక స్టాప్ లాస్ వస్తే వెంటనే బయటకు వచ్చేయాలి. లేకపోతే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతాం.
take small profits
* ట్రేడింగ్ లోకి వచ్చి ప్రోఫిట్స్ కోసం మనం ఎక్కువ ఆలోచిస్తాం. కానీ సేవింగ్ లోకి వచ్చి, కంట్రోల్ గా ఉండి, చిన్న ప్రోఫిట్స్ తీసుకున్నవాళ్ళే లాంగ్ టైమ్ లో మంచి రిటర్న్ అందుకున్నారని మనం తెలుసుకోవాలి.
* మనం ఎటువంటి పరిస్థితులోనైనా వేరేవాళ్ళు చెప్పినవన్నీనమ్మి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయ వద్దు.
మనం 3 లేదా 4 నెలలు ఇన్వెస్ట్ మెంట్ గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చెయ్యాలి.
Leave a Reply